తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాత్రి 2గంటల సమయంలో బాత్రూంలో కాలుజారి పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. కేసీఆర్ ఎడమకాలు తుంటి ఎముక విరిగిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. కాగా.. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ ట్వీట్ చేశారు. "తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గాయపడటం బాధాకరం. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను" అని తెలిపారు.
సెక్రటేరియట్లో విద్యుత్, ఆర్టీసీపై సమీక్ష ముగిసింది. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, కొనుగోలుపై ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. 2014 జూన్ 2 కంటే ముందు పరిస్థితులు, తర్వాత విద్యుత్ ఉత్పత్తి, కొనుగోలు, ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. మరోవైపు.. సీఎండీ ప్రభాకర్ రావు గైర్హాజరు కావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. విద్యుత్, ఆర్టీసీ పై అసెంబ్లీ సమావేశాల తర్వాత మరోసారి రివ్యూ చేస్తానని సీఎం రేవంత్ రేవంత్ తెలిపారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఈరోజు కేబినెట్ మీటింగ్ లో ఈ అంశంపై చర్చించినట్లు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు చెప్పారు. ముఖ్యంగా రెండు గ్యారంటీలపై ఈ భేటీలో చర్చించామని, ముందుగా వాటిని అమలు చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. ఈ క్రమంలో.. ఎల్లుండి (శనివారం) నుంచి మహిళా సోదరిమణులందరికీ ఉచిత బస్సు సౌకర్యం, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం రూ.10 లక్షలకు పెంపు అమల్లోకి వస్తాయని ప్రకటించారు.…
కేబినెట్ మీటింగ్ కు సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు వివరాలను వెల్లడించారు. 6 గ్యారంటీలపై కేబినెట్‌లో సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. వాటి అమలు ప్రక్రియలో భాగంగా అన్ని అంశాలపై చర్చించామని చెప్పారు. రేపు 2 గ్యారంటీలకు సంబంధించి ఆయా శాఖలతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చిస్తారని.. ముందుగా సోనియా గాంధీ పుట్టినరోజైన ఎల్లుండి 2 గ్యారంటీల అమలు ప్రారంభిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. మహిళలకు రాష్ట్రంలో ఉచిత బస్సు రవాణా సౌకర్యం, రాజీవ్ ఆరోగ్యశ్రీ రూ.10 లక్షల వరకు పెంపు నిర్ణయాలను సోనియాగాంధీ పుట్టిన రోజు…
సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తొలి కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, సీఎస్ శాంతికుమారి, వివిధ శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు. 6 గ్యారంటీలు సహా పలు కీలక అంశాలపై చర్చించారు. అంతకుముందు ముఖ్యమంత్రిగా సచివాలయంలో రేవంత్ రెడ్డి బాధ్యతలను స్వీకరించారు. సచివాలయంలోకి అడుగుపెట్టగానే ఆయనకు పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత సచివాలయం లోపల…
నిజామాబాద్ జిల్లా బాల్కొండ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక హామీల అమలుకు కౌంట్ డౌన్ షురూ అయ్యిందని ఆరోపించారు. హామీలు అమలు చేసేంత వరకు వదిలేది లేదు.. వెంటాడుతాం.. పోరాడుతామని అన్నారు. ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు.. ఇది చిన్న విరామం మాత్రమే.. ఆ తర్వాత రెట్టించిన వేగంతో ముందుకు వెళ్తామని తెలిపారు.
ప్రజాభవన్ కంచే తొలగిపోవడంతో సీఎం కార్యాలయం చూసేందుకు పెద్ద ఎత్తున జనాలు వెళ్లారు. కొందరు కళాకారులు ప్రజా భవన్ ఎదుట పాటలు పాడుతూ బై బై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. అంతేకాకుండా.. అటుగా పోయే వాహనదారులు కూడా ఆగి సీఎం కార్యాలయాన్ని చూసుకుంటూ వెళ్లారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి పూర్తిగా కంచే ఉండటం.. జనాల్లో సీఎం కార్యాలయం ఎలా ఉంటుంది అనే క్యూరియాసిటి ఎక్కువగా ఉండేది.. కానీ, ఇప్పుడు పూర్తిగా గేట్స్ ఓపెన్ అయ్యేసరికి జనాలు ఆసక్తిగా చూశారు.
PFI నిజామాబాద్ కేసులో మరో నిందితుడిపై NIA ఛార్జిషీట్ దాఖలు చేసింది. యువతను ఉగ్రవాదం, హింసాత్మక చర్యలకు చేర్చుకోవడం.. తీవ్రవాదం చేయడం మరియు శిక్షణ ఇవ్వడంపై నొస్సామ్ మహ్మద్ యూనస్‌పై సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేసింది. హైదరాబాద్‌లోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలైంది. దీంతో.. ఈ కేసులో మొత్తం నిందితుల సంఖ్య 17కి చేరింది. 2047 నాటికి భారతదేశంలో ఇస్లామిక్ పాలనను స్థాపించాలనే PFI కుట్రను కొనసాగించడానికి హింసాత్మక ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించే PFI లో నొస్సమ్ మహమ్మద్ చేరాడని NIA…
“సమ్మక్క సారక్క” సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో.. ములుగు జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు కానుంది. అంతకుముందు.. ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన బిల్లును సోమవారం కేంద్రం లోక్ సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. రూ. 889.07 కోట్లతో వర్సిటీని నెలకొల్పనున్నారు. ఈ వర్సిటీ ఏర్పాటుకు అక్టోబర్ లో జరిగిన కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. ములుగు సమీపంలో 200 ఎకరాల స్థలాన్ని గత సర్కార్ గతంలోనే గుర్తించింది.…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క మల్లు, మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనర్సింహ, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ప్రమాణ స్వీకారం చేశారు. వారి చేత గవర్నర్ తమిళి సై ప్రమాణం చేయించారు. అయితే.. అందరూ మంత్రులు ప్రమాణం…