మాజీ మంత్రి హరీష్ రావుకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. వరి ధాన్యం కొనుగోలు ఎప్పుడు ప్రారంభిస్తారు.. బోనస్ కింద రూ.500 ఎప్పుడు ఇస్తారని హరీష్ రావు ప్రశ్నించారు. ఈ క్రమంలో మంత్రి సీతక్క హరీష్ రావుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారం చేపట్టి రెండు రోజులు కూడా కాకముందే.. తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం హాస్యాస్పందగా ఉందని తెలిపారు. ఒక్కొక్కటిగా అన్ని అమలు చేస్తామని మంత్రి సీతక్క చెప్పారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. నిబంధనల ప్రకారం.. 15 రోజుల లోపు ఏదో ఒక పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆ ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికల సంఘం ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తుంది. ఈ క్రమంలో.. బీఆర్ఎస్ కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీ…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించింది. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నుండి ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో ఉచితంగా మహిళలు ప్రయాణించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం కార్యక్రమాన్ని ప్రారంభించారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. తమకు వచ్చిన ఓట్లు, సీట్లు చూస్తే రాబోయే కాలంలో బీజేపీ తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో అధికారం సాధించే దిశలో పయనిస్తుందని తెలిపారు. డబ్బు, మద్యం ప్రభావంను పక్కన పెట్టి ప్రజలు బీజేపీకి విజయాన్ని కట్ట బెట్టారని అన్నారు. బీజేపీకి ఓటు వేసిన ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు శాతం అనూహ్యంగా పెరిగిందని ఈటల పేర్కొన్నారు. మోడీ…
ఓ యువకుడు వివాహం కావడం లేదని ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న రాత్రి ఇంట్లో తండ్రితో గొడవపడి జిల్లెలగూడ సందన చెరువులో దూకి సూసైడ్ చేసుకున్నాడు యువకుడు. మృతుడు నాగరాజు (28) చంపాపేట్ నివాసిగా గుర్తించారు. యువకుడు న్యాయవాది దగ్గర పని చేసేవాడని బంధువులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు.
రాజ్భవన్లో గవర్నర్ తమిళిసైని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు కలిశారు. ప్రభుత్వం సంప్రదాయం పాటించలేదని గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ నియామకంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. సీనియర్లు ఉన్నప్పటికీ అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్ గా నియమించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు 8 మంది అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేదు. ఈ క్రమంలో నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి బీజేపీ ఎమ్మెల్యేలు వినతి పత్రం అందించారు.
తెలంగాణ వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కీమ్ 'మహాలక్ష్మి' ప్రారంభమైంది. తెలంగాణ అసెంబ్లీ ముందు మహిళా మంత్రులు కొండా సురేఖా, సీతక్క, సీఎస్ శాంతికుమారి, తెలంగాణ మహిళా బాక్సర్ నిక్కత్ జరీన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, పలువురు ఎమ్మెల్యేలు, , రవాణా శాఖ సెక్రటరీ వాణిప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం మహిళా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు, మహిళా ఉద్యోగులు, సిబ్బందితో కలిసి సీఎం రేవంత్…
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ ముగిసింది. యశోదా హాస్పిటల్ లో కేసీఆర్ కు హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీ చేశారు. నాలుగు గంటలకు పైగా కేసీఆర్ కు డాక్టర్లు సర్జరీ చేశారు. యశోద డాక్టర్ల ఆధ్వర్యంలో కేసీఆర్ తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతంగా ముగిసింది .ఈ క్రమంలో.. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై మరికాసేపట్లో యశోదా హాస్పిటల్ హెల్త్ బులిటెన్ విడుదల చేయనుంది.
మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం.. ప్రశ్నించే గొంతుకకు ప్రాణం పోసిన గడ్డ మల్కాజ్ గిరి అని లేఖలో పేర్కొన్నారు. కొడంగల్ లో రాజ్యం ఆదేశాలతో పోలీసు లాఠీలు నా ఇంటిపై పడి, నన్ను నిర్భంధించి, నడి రాత్రి ప్రజాస్వామ్యాన్ని నిర్దాక్షిణ్యంగా హత్య చేసిన సందర్భాన్ని చూసి మల్కాజ్ గిరి చలించిందన్నారు. ఆరు నెలలు తిరగక ముందే, కేవలం 14 రోజుల వ్యవధిలో నన్ను తమ గుండెల్లో పెట్టుకుంది. ప్రశ్నించే గొంతుకై…
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్వస్థలమైన అక్కంపేట గ్రామాన్ని రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ గ్రామంగా ప్రకటించింది. ఈ క్రమంలో.. జీవో జారీ చేయడంతో అక్కంపేట గ్రామంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పర్యటించారు. ప్రొఫెసర్ జయశంకర్, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కంపేట గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా ప్రకటిస్తూ ఇచ్చిన జీవో కాపీని గ్రామస్తులకు అందజేశారు.