తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్వస్థలమైన అక్కంపేట గ్రామాన్ని రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ గ్రామంగా ప్రకటించింది. ఈ క్రమంలో.. జీవో జారీ చేయడంతో అక్కంపేట గ్రామంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పర్యటించారు. ప్రొఫెసర్ జయశంకర్, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కంపేట గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా ప్రకటిస్తూ ఇచ్చిన జీవో కాపీని గ్రామస్తులకు అందజేశారు.
Chiranjeevi: కేసీఆర్ కు గాయం.. చాలా భాదపడ్డాను
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో రచ్చబండ కార్యక్రమంలో అక్కంపేట గ్రామానికి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామం రాష్ట్రంలోనే వెనుకబడిన ప్రాంతంగా ఉండడం చూసి తాము అధికారంలోకి రాగానే అక్కంపేట గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా చేసి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చారన్నారు. ఇటీవల పరకాలలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో తాను కూడా అక్కంపేట గ్రామాన్ని రెవెన్యూ గ్రామం చేయాలని కోరానని చెప్పారు. రేవంత్ రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రకటించగానే తాను అక్కంపేట గ్రామాన్ని రెవెన్యూ గ్రామం చేయాలని సీఎంకి గుర్తు చేయడం జరిగిందని సీఎంగా తెలిపారు.
Big Breaking: రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఉద్యమకారులపై కేసుల ఎత్తివేతకు లైన్ క్లియర్
ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం వారి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి జీవో జారీ చేయడం జరిగిందని అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో పరకాల నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు తాను కృషి చేస్తానని.. ప్రొఫెసర్ జయశంకర్ ఆశీస్సులు ఉండాలని ఎమ్మెల్యే తెలిపారు.