మాజీ మంత్రి మల్లారెడ్డి పై మేడ్చల్ జిల్లా శామీర్ పేట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు అయింది. గిరిజనుల భూములు కబ్జా చేశారని మల్లారెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో.. ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసు, అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా.. మల్లారెడ్డి అనుచరులు తొమ్మిది మందిపై కేసులు నమోదు చేశారు. శామీర్ పేట మండలంలోని కేశవాపురం గ్రామంలో 47 ఎకరాలు కబ్జాకు పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో.. తహశీల్దార్ తో పాటు మల్లారెడ్డిపై ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Also: Praja Bhavan: డిప్యూటీ సీఎం అధికారిక నివాసంగా ప్రజా భవన్
శామీర్‌పేట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ మల్కాజిరి జిల్లా కేశవాపురం గ్రామంలోని సర్వేనెంబర్ 33, 34, 35లో గల 47 ఎకరాల 18 గుటల లంబాడీల వారసత్వ భూమిని మల్లారెడ్డి, అతని అనుచరులు 9 మంది అక్రమంగా కబ్జా చేశారని తెలిపారు. అందుకు సంబంధించి శామీర్‌పేట పోలీస్టేషన్‌లో ఫిర్యాదు నమోదు అయ్యింది. మొత్తం 47 ఎకరాలు కబ్జా చేశారని ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. కబ్జాకు పాల్పడిన మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు అతని అనుచరులు 9 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు 420 చీటీంగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Read Also: Harish Rao: కేసీఆర్ కి పనితనం తప్ప పగతనం తెలియదు..