మీరు వోక్స్‌వ్యాగన్ వర్టస్ లేదా టిగువాన్ కొనాలని అనుకుంటున్నారా.. ఇదే మంచి అవకాశం. ఈ రెండు కార్లపై వోక్స్‌వ్యాగన్ రూ. 2.5 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. అంతేకాకుండా.. కస్టమర్లకు 4 సంవత్సరాల ప్రామాణిక వారంటీ (స్టాండర్డ్ వారంటీ), పాత పోలో కార్ల యజమానులకు రూ. 50,000 ప్రత్యేక లాయల్టీ ప్రయోజనం కూడా అందిస్తోంది. దీంతో పాటు.. స్క్రాపేజ్ ప్రయోజనాలను కూడా అందిస్తున్నారు.. ఇది పాత కార్లను మార్పిడి చేసుకునే వారికి అదనపు ప్రయోజనాన్ని ఇస్తుంది.
వోక్స్‌వ్యాగన్ వర్టస్‌పై అద్భుతమైన ఆఫర్లు:
వివిధ వేరియంట్‌లను బట్టి వోక్స్‌వ్యాగన్ వర్టస్‌పై భారీ తగ్గింపులు ఇస్తున్నారు. వోక్స్‌వ్యాగన్ వర్టస్ GT లైన్ 1.0L TSI AT పై రూ. 83,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. వర్టస్ GT ప్లస్ స్పోర్ట్ 1.5L TSI DSG పై రూ. 1.35 లక్షల వరకు ప్రయోజనం ఇస్తున్నారు. వర్టస్ క్రోమ్ హైలైన్ 1.0L TSI AT రూ. 1.90 లక్షల వరకు ప్రయోజనాలతో లభిస్తుంది. వోక్స్‌వ్యాగన్ వర్టస్ టాప్‌లైన్ 1.0L TSI AT రూ. 1.87 లక్షల వరకు ప్రయోజనాలతో లభిస్తుంది. వర్టస్ GT Plus Chrome 1.5L TSI DSG పై రూ.1.29 లక్షల వరకు ప్రయోజనం ఇస్తున్నారు.
వోక్స్‌వ్యాగన్ టిగువాన్ పై బంపర్ డిస్కౌంట్:
టిగువాన్ SUV పై కూడా గొప్ప ప్రయోజనాలు అందిస్తున్నారు. వోక్స్‌వ్యాగన్ టిగువాన్ పై ఈ ఆఫర్లు కస్టమర్లను ఆకర్షించనున్నాయి. వోక్స్‌వ్యాగన్ టిగన్ GT లైన్ 1.0L TSI AT రూ. 1.45 లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తోంది. టిగన్ GT ప్లస్ స్పోర్ట్ 1.5L TSI DSG రూ. 2 లక్షల వరకు ప్రయోజనాలతో లభిస్తుంది. టిగన్ హైలైన్ 1.0L TSI AT రూ. 2.5 లక్షల వరకు ప్రయోజనాలతో ఇస్తుంది. టిగన్ టాప్‌లైన్ 1.0L TSI MT రూ. 2.36 లక్షల వరకు ప్రయోజనాలతో లభిస్తుంది. టిగన్ GT ప్లస్ క్రోమ్ 1.5L TSI DSG పై రూ.2.39 లక్షల వరకు ప్రయోజనాలు అందిస్తుంది.
ఈ ఆఫర్ ఎప్పటి వరకు..?
ఈ డిస్కౌంట్ స్కీమ్ పరిమిత సమయం మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీరు వోక్స్‌వ్యాగన్ యొక్క కొత్త Virtus లేదా Taigun కొనాలని భావిస్తుంటే.. అదనపు వారంటీ, లాయల్టీ ప్రయోజనాలతో పాటు ఈ భారీ డిస్కౌంట్లను పొందడం ఇదే ఉత్తమ సమయం కావచ్చు.