Minister Sridhar Babu: పెద్దపల్లి జిల్లా మంథని ఎంపీడీవో కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ లో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజల సంక్షేమం కోసం, జవాబుదారితనంతో పనిచేస్తుందన్నారు. వ్యక్తుల కోసం కాదని మంత్రి తెలిపారు. అంతేకాకుండా.. సిటిజన్ చార్టర్ తీసుకొచ్చి పారదర్శక పాలన అందిస్తామని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
Read Also: Nizamabad: సంచలన ఘటన.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి దారుణ హత్య..
సామాన్య ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని అధికారులకు మంత్రి ఆదేశం ఇచ్చారు. ఏదైనా సమాచారం అడిగిన వెంటనే అందించేలా అధికారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు. మరోవైపు.. సర్పంచుల సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఖజానాను పూర్తిగా ఖాళీ చేసిందని ఆయన ఆరోపించారు. ఎన్నికల ముందు.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలను ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అమలు చేసి తీరుతామని తెలిపారు. ఇది ప్రజా ప్రభుత్వం.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
Read Also: Big Shock: నల్లగొండ మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు బిగ్ షాక్