Shabbir Ali: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ తప్పక నెరవేరుస్తామని తెలిపారు. అంతేకాకుండా.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చుపుతామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల హామీలన్నీ ఎట్టి పరిస్థితుల్లో నెరవేరుస్తామని చెప్పారు.
Read Also: KTR Tweet: కేటీఆర్ కామెంట్స్‌కు కర్ణాటక సీఎం సిద్దరామయ్య కౌంటర్ అటాక్
ఈ సందర్భంగా.. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలను షబ్బీర్ అలీ కార్యకర్తలకు వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఐక్యంగా ఉండి పార్టీ అధికారంలోకి తెచ్చేందుకు కష్టించి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తను కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకుంటుందని తెలిపారు. ఇదే సమిష్టి కృషితో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా.. ఇదే సమిష్టి కృషితో పనిచేసే పార్టీని దేశంలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించే విధంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని షబ్బీర్ అలీ పేర్కొన్నారు.
Read Also: Bigg Boss 7 Arrests: షాకింగ్ న్యూస్.. బిగ్ బాస్ అల్లర్ల కేసులో పల్లవి ప్రశాంత్ డ్రైవర్లు అరెస్ట్!