ఢిల్లీలో నిర్వహించిన ‘ఇండియా కూటమి’ సమావేశం ముగిసింది. ఈ నెల 22 న దేశవ్యాప్త ఆందోళనకు ఇండియా కూటమి పిలుపునిచ్చింది. పార్లమెంట్ లో అధికార పార్టీ వ్యవహారానికి నిరసనగా ఆందోళన చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా.. ఈ సమావేశంలో భారత కూటమి ప్రధాని అభ్యర్థిపై చర్చించారు. మల్లిఖార్జున్ ఖర్గే ప్రధానిగా పోటీ చేస్తారా అనే అంశంపై మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ ఈ ప్రతిపాదనను తెచ్చారు. ఈ సమయంలో మమతా బెనర్జీ మల్లికార్జున్ ఖర్గేని ప్రధానమంత్రి అభ్యర్థిగా చేయాలని ప్రతిపాదించారు. దీనికి ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ మద్దతు తెలిపారు. మరోవైపు.. ఈ ప్రతిపాదనను ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు ఆమోదించలేదు.
Ambati Rambabu: యాంకర్ స్థాయికి జనసేన అధినేత దిగజారిపోయారు..
సమావేశం అనంతరం మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. ఈ సమావేశంలో 28 పార్టీలు పాల్గొన్నాయన్నారు. కూటమి ముందు నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా అందరూ కలిసి పనిచేయాలి.. సమస్యలను లేవనెత్తాలన్నారు. దేశవ్యాప్తంగా కనీసం 8-10 సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రధాని ఎవరో “ఇండియా” కూటమి అంతర్గత వ్యవహారమని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రధాని ఎవరనేది నిర్ణయిస్తామని ఖర్గే అన్నారు. ఎన్నికల్లో గెలవడమే మా ముందున్న కర్తవ్యం, ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఖర్గే తెలిపారు.
Salaar 1AM Shows: ప్రభాస్ ఫాన్స్ కి బంపర్ న్యూస్.. ఈ 20 థియేటర్లలో అర్ధరాత్రి ఒంటిగంటకే సలార్!
కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. డిసెంబర్ 31 కల్లా సీట్ల సర్దుబాటు పై నిర్ణయం తీసుకుంటామన్నారు. సీట్ల సర్దుబాటు ప్రక్రియ సత్వరమే ప్రారంభమౌతుందని తెలిపారు. అనంతరం.. సిపిఐ ప్రధాన కార్యదర్శి రాజా మాట్లాడుతూ.. సమావేశం విజయవంతంగా ముగిసిందని తెలిపారు. సీట్ల సర్దుబాటు సత్వరమే పూర్తి కావాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఎంపీల సస్పెన్షన్ ప్రజాస్వామ్యం పై దాడి అని అన్నారు. ఎంపీల సస్పెన్షన్ పై దేశ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేయాలని పిలుపునిచ్చినట్లు రాజా పేర్కొన్నారు.