ఐపీఎల్ వేలంలో యువ ఆటగాళ్లపై ఫ్రాంఛైజీలు కాసుల వర్షం కురిపించింది. దుబాయ్ లో జరుగుతున్న మినీ వేలంలో అత్యధికంగా ఆస్ట్రేలియా స్టార్ బాలర్ మిచెల్ స్టార్క్ రూ. 24.75 కోట్లకు సేల్ అయ్యాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ను రూ. 20.75 కోట్లు వెచ్చించి సన్ రైజర్స్ తీసుకుంది. ఈ క్రమంలో.. పలువురు యువ ఆటగాళ్లు కూడా బంపర్ ఆఫర్ కొట్టేశారు. ఉత్తరప్రదేశ్ కి చెందిన 20 ఏళ్ల సమీర్ రిజ్వీని రూ. 8 కోట్ల 40 లక్షలకు చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. టీ20 లీగ్‌లో కాన్పూర్ సూపర్ స్టార్స్ తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టి రికార్డు నెలకొల్పాడు. అంతేకాకుండా.. తొమ్మిది ఇన్నింగ్స్‌లలో రెండు తుఫాను సెంచరీలు చేశాడు. రాజస్థాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్ లో 65 బంతుల్లో 91 పరుగులు చేశాడు. ఫైనల్‌లో 50 బంతుల్లో 84 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.
IAS Transfers in AP: ఏపీలో 17 మంది ఐఏఎస్‌లకు బదిలీలు, కొత్త పోస్టింగ్‌లు
జార్ఖండ్ యంగ్ ప్లేయర్ కుమార్ కుషగ్రా కోసం ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. వికెట్ కీపర్ అండ్ బ్యాట్స్‌మెన్ కావడంతో.. భారీ మొత్తంలో అమ్ముడుపోయాడు. కుషగ్రను- రూ.7 కోట్ల 20 లక్షల( ఢిల్లీ క్యాపిటల్స్) సొంతం చేసుకుంది. కాగా.. ఇన్ని కోట్లు పెట్టడానికి కారణం.. విజయ్ హజారే ట్రోఫీలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మహారాష్ట్రపై 355 రన్స్ చేజింగ్ లో జార్ఖండ్ తరఫున కుషాగ్రా ఆరో స్థానంలో వచ్చి 37 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 67 పరుగులు చేశాడు. దీంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో.. తుఫాను బ్యాటింగ్‌కు ఫిదా అయిన ఫ్రాంచైజీలు యువ ఆటగాడిని తీసుకోవడానికి పోటీ పడ్డాయి.
Ayodhya Ram Temple: అద్వానీ, జోషిలకు ఆహ్వానం ఇచ్చిన విశ్వ హిందూ పరిషత్
యువ ఆటగాళ్లలో ఎవరికి ఎంత ధర పలికిందంటే..?
షారూఖ్ ఖాన్-రూ.7 కోట్ల 40 లక్షలు (గుజరాత్ టైటాన్స్)
శివం దూబే- రూ.5 కోట్ల 80 లక్షలు (రాజస్థాన్ రాయల్స్)
యశ్ దయాళ్- రూ. 5 కోట్లు (బెంగుళూరు)
మనిమారన్ సిద్ధార్థ్- 2 కోట్ల 40 లక్షలు (లక్నో)