బీఆర్ఎస్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. గాంధీభవన్ లో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం మారింది.. దానికి అగుగుణంగా వ్యవహరించాలని కోరారు. ప్రజలు మార్పు కోరుకున్నారని ఆయన అన్నారు. బీఆర్ఎస్ చేసింది బంగారు తెలంగాణ అయితే.. ప్రజావాణి నుండి వేల పిటిషన్లు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. కాగా.. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో ఆటో డ్రైవర్లు, యూనియన్లు నిరసన చేస్తున్నారు.. వారికి అండగా ఉంటాం.. వారి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. 15 రోజుల్లో రివ్యూ చేస్తామని మంత్రి చెప్పారు. ఆరు గ్యారంటీ స్కీమ్ లను 100 రోజుల్లో అమలు చేస్తామని మంత్రి పేర్కొన్నారు.
CM Review: ఉమ్మడి ఏపీ భవన్ విభజన, తెలంగాణ భవన్ నిర్మాణంపై సీఎం సమీక్ష
పార్లమెంట్ లో మొన్న ఆగంతకులు దూకి సభ్యులపై టియర్ గ్యాస్ విడిచారు.. పార్లమెంట్ భద్రత పై ప్రశ్నస్తే 77 మంది పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేశారు.. ఇది దేశ పార్లమెంటరీ వ్యవస్థకే మచ్చా అని మంత్రి పొన్నం ఆరోపించారు. తనీషా లాగా నియంత లాగా పరిపాలిస్తున్నారని విమర్శించారు. దేశ వ్యాప్తంగా విద్వేషాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం రావాలని రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారని మంత్రి పేర్కొన్నారు. భారతదేశ వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తున్నారు.. ప్రభుత్వం పై ప్రశ్నిస్తే బీజేపీ అనుబంధ సంస్థలు సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి చూడలేదని మంత్రి పేర్కొన్నారు.
Play Store Settlement: గూగుల్ సంచలన నిర్ణయం.. వినియోదారులకు రూ. 5200 కోట్లు చెల్లింపు..!
ప్రభుత్వం నాలుగు కాళ్ళు నియంతృత్వం మీదనే నడవాలని చూస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీజేపీ.. ఇండియా అనే పదాన్ని కూడా జీర్ణించుకోలేక పోతున్నాయని అన్నారు. దేశ వ్యాప్తంగా అన్ని పార్టీలు ఒక్కటై నిరసిస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ కార్యకర్తలను రక్షించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది… అందుకే ఎంపీలను సస్పెండ్ చేసింది.. తాము దేశ భక్తులం అని చెప్పుకునే బీజేపీ ఎంపీలు జవాబు చెప్పాలని కోరారు. తెలంగాణ పై వ్యతిరేకంగా మాట్లాడిన మాట్లాడరు.. పార్లమెంట్ మీద దాడి జరిగినా, సస్పెండ్ చేసినా తెలంగాణ బీజేపీ ఎంపీలు మాట్లాడరని విమర్శించారు. 13వ తేదీ జరిగిన దాడి పై ఇంతవరకు ఎవరు స్పందించలేదని మంత్రి పొన్నం పేర్కొన్నారు.