రేపు సోనియాగాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఢిల్లీలో ఉదయం 9.30 గంటలకు ఈ మీటింగ్ జరగనుంది. పార్లమెంటు భద్రతా ఉల్లంఘనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన డిమాండ్‌పై ప్రతిపక్షాలు, బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మధ్య రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.
Read Also: Gangula Kamalakar: 100 రోజుల వరకు ఎదురుచూస్తాం.. మేము రొడ్డేక్కే పరిస్థితి ప్రభుత్వం తెచ్చుకోవద్దు
ఇదిలా ఉంటే.. మొత్తం 141 మంది విపక్ష ఎంపీలను పార్లమెంటు నుండి సస్పెండ్ చేశారు. ఈ ఎంపీలు మొత్తం శీతాకాల సమావేశాల్లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభ్యులను సస్పెండ్ చేయాలని తీర్మానం చేశారు. ఈ క్రమంలో.. ఫరూక్ అబ్దుల్లా, సుప్రియా సూలే, డింపుల్ యాదవ్, శశి థరూర్‌లతో సహా 49 మంది ప్రతిపక్ష ఎంపీలను మంగళవారం లోక్‌సభ నుండి సస్పెండ్ చేశారు. సోమవారం 33 మంది ఎంపీలు దుష్ప్రవర్తన కారణంగా సభ నుండి సస్పెండ్ అయ్యారు.
Read Also: Paayal Rajput: ఇదేం పని ఇండిగో? నీవల్ల అది మిస్సయ్యా.. పాయల్ ట్వీట్ వైరల్
ఎంపీల సస్పెన్షన్ ప్రతిపాదనపై పలువురు విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. ఎంపీని తిట్టిన వాడు సభలో కూర్చుంటాడని, ప్రశ్నించిన వారిని సస్పెండ్ చేస్తున్నారని, ఇది ఏ ప్రజాస్వామ్యమని ఓ ఎంపీ అన్నారు. నియంతృత్వానికి స్వస్తి పలకాలి. లోక్‌సభలో ప్లకార్డులతో నిరసన తెలిపి, హెచ్చరించిన తర్వాత కూడా రచ్చ కొనసాగించినందుకు ఎంపీలను సస్పెండ్ చేశారు.