అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ఇంకా నెల రోజుల సమయం కూడా లేదు. దీంతో.. రామ మందిర పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. కాగా.. ఈ పనులు కొద్ది రోజుల్లో పూర్తవనుండగా, తర్వాత డెకరేషన్ వర్క్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే.. వేడుకకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం అలంకరణ పనులు మరికొద్ది రోజుల్లో ప్రారంభమవుతాయని ఆలయ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు.
మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్పపై బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ సమయంలో తన పదవీకాలంలో రూ. 40,000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. అంతేకాకుండా.. ఏ నాయకుడు ఏ విధంగా ఎంత డబ్బు సంపాదించాడో తనకు తెలుసన్నారు. ప్రభుత్వం కేవలం రూ.45 విలువ చేసే మాస్క్‌ను రూ.485కి కొనుగోలు చేసిందని అన్నారు. కోవిడ్ కేర్ సెంటర్ల కోసం 10,000 పడకలు అవసరమని యడియూరప్ప నేతృత్వంలోని ప్రభుత్వం తెలిపింది. పడకలను అద్దెకు ఇవ్వడానికి నిర్ణయించిన రేట్లు చాలా ఎక్కువగా…
కొబ్బరి రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కొప్రా ఎంఎస్‌పిని క్వింటాల్‌కు రూ. 300 పెంచుతూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మిల్లింగ్ కొప్రా ఎంఎస్‌పి క్వింటాల్‌కు రూ.10860 నుంచి రూ.11160కి పెరిగింది. మరోవైపు.. బాల్ కొప్రా ఎంఎస్‌పి క్వింటాల్‌కు రూ.11750 నుంచి రూ.12000కి పెంచారు. పెంచిన ధరల ద్వారా కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇదిలా ఉంటే, ఈరోజు జరిగిన సమావేశంలో.. బీహార్‌లోని దిఘా నుండి సోన్‌పూర్ మధ్య గంగా నదిపై 6 లేన్ల కేబుల్ వంతెనను…
చెన్నైలో 28 ఏళ్ల క్రితం భార్య విడాకుల ఫిర్యాదుతో అత్తను హతమార్చిన వ్యక్తిని బెర్హంపూర్ రైల్వే స్టేషన్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు చాలారోజులుగా వెతుకుతుండగా.. మంగళవారం అరెస్టు చేశారు. నిందితుడు హరిహర్ పట్టాజోషి (51) కోసం వారం రోజులపాటు నిఘా ఉంచి అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. గోసానినుగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితుడు దాక్కున్నట్లు తెలుసుకుని అదుపులోకి తీసుకున్నట్లు బెర్హంపూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) వివేక్ ఎం శరవణ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. 1994లో చెన్నైలోని…
ఈ నెల ప్రారంభంలో లోక్‌సభ సమావేశాల సమయంలో ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చున్న ఇద్దరు వ్యక్తులు హఠాత్తుగా అక్కడి నుంచి దూకి ఎంపీల మధ్యకు వెళ్లడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఘటనపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ సందర్భంగా.. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ 'లోతైన, చీకటి గది'గా మారిందని, భద్రతా ఉల్లంఘనపై కేంద్ర ప్రభుత్వం మౌనం వహిస్తోందని ఆరోపించారు.
డాక్టర్ మోహన్ యాదవ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మధ్యప్రదేశ్‌లో పరిపాలన చాలా చురుగ్గా కనిపిస్తుంది. తాజాగా మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురంలో ఓ కేసు నమోదైంది. రెండు రోజుల క్రితం ఓ బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందన్న వార్త రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఇప్పుడు ఈ కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకునేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం.. యూపీ సీఎం ఫార్ములాను ఉపయోగిస్తుంది. నర్మదాపురంలోని బిటిఐ ప్రాంతంలో రెండు రోజుల క్రితం సామూహిక అత్యాచారం జరిగింది. ఈ కేసులో నలుగురు నిందితులలోని ఇద్దరు నిందితుల ఇళ్లపై మోహన్ యాదవ్…
వేర్పాటువాద నాయకుడు మస్రత్ ఆలం భట్ నేతృత్వంలోని జమ్మూ కాశ్మీర్ ముస్లిం లీగ్ ను కేంద్రం బుధవారం 'చట్టవిరుద్ధమైన సంఘం'గా ప్రకటించింది. అంతేకాకుండా.. UAPA చట్టం కింద ఐదేళ్లపాటు నిషేధించింది. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. 'ముస్లిం లీగ్ జమ్మూ కాశ్మీర్ (మస్రత్ ఆలం వర్గం)'/MLJK-MA UAPA కింద 'చట్టవిరుద్ధమైన సంఘం'గా ప్రకటించబడిందని తన పోస్ట్‌లో రాశాడు. భారత దేశం యొక్క ఐక్యత, సార్వభౌమాధికారం, సమగ్రతకు వ్యతిరేకంగా పనిచేసే ఎవరైనా వదిలిపెట్టబోమని.. కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.…
క్రిస్మస్ సందర్భంగా తన అధికారిక నివాసాన్ని పాఠశాల విద్యార్థినులు సందర్శించారు. ఈ సందర్భంగా.. వారి ముఖాల్లో సంతోషం స్పష్టంగా కనిపిస్తున్న వీడియోను ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పిల్లలు థంబ్స్-అప్ ఇవ్వడంతో తన కార్యాలయం అంతిమ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్టు అనిపిస్తోందని ప్రధాని అన్నారు.
సెంచూరియన్ వేదికగా జరుగుతున్న దక్షిణాఫ్రికా-టీమిండియా తొలి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ చేసి టీమిండియాను కష్టాల నుంచి గట్టెక్కించాడు. కేఎల్ రాహుల్ 137 బంతుల్లో 101 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడి, లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌తో కలిసి జట్టు స్కోరును 245 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ ను అందించాడు. కేఎల్ ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడీగా కొనసాగుతున్నాయి. విద్యుత్ అప్పులపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్, ఎంఐంఎం మధ్య రచ్చ జరుగుతోంది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మొదటిసారి వచ్చిన సభ్యుడు పొరపాటుగా మాట్లాడితే.. అలా కాదు అని చెప్పాలి.. కానీ అక్బరుద్దీన్.. వ్యాఖ్యలు సరికాదని భట్టి విక్రమార్క తెలిపారు. భాష, విషయం ఉందని సభానాయకుడిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదని అన్నారు.