ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ కు పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు హాజరుకాలేదు. మంగళగిరిలోని సెక్రటేరియట్ నుంచి సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. జనవరి నెలలో అమలు చేసే పథకాలకి సంబంధించి సమావేశం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి దాడిశెట్టి రాజాతో సహా జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అయితే ఈ భేటీకి మాత్రం పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు డుమ్మా కొట్టారు.
మున్సిపాల్టీల్లో సమ్మెలో ఉన్న సీఐటీయూతో మంత్రి ఆదిమూలపు సురేష్ చర్చలు ముగిశాయి. రెండున్నర గంటల పాటు మంత్రి, యూనియన్ నేతల మధ్య చర్చలు కొనసాగాయి. అయితే.. సీఐటీయూతో మంత్రి సురేష్ చర్చలు అసంపూర్తిగా ముగిసినట్లు తెలుస్తోంది. మరోవైపు.. సమ్మె విరమించాలని మంత్రి సురేష్ వారిని కోరారు. ఈ క్రమంలో.. చర్చల సారాంశాన్ని కార్మికులకు చెప్పి సమ్మె కొనసాగింపా..? విరమణా..? అనే విషయం తెలియచేస్తామని సీఐటీయూ చెప్పింది. కార్మికుల నుంచి క్లారిటీ తీసుకున్నంత వరకు సమ్మె కొనసాగిస్తామని సీఐటీయూ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. సీఐటీయూ…
ఇచ్చిన మాట ప్రకారం ఒకటో తేదీ నుంచి 3 వేల పెన్షన్ అమలు చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. సీఎం జగన్ మాటిస్తే అమలు చేసి తీరుతారమని అన్నారు. మూడో తేదీన పెన్షన్ ల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారని చెప్పారు. వచ్చేనెల 4 ముఖ్యమైన కార్యక్రమాలు జరగనున్నాయని.. అంతేకాకుండా, వైయస్సార్ ఆసరా చేయూత లబ్ధిదారులకు సీఎం జగన్ నగదు జమ చేయమన్నారని అన్నారు. 404 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరిస్తారని…
ఏపీలో ప్రైవేట్ పాఠశాలలకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు కాలపరిమితి 8 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 3 నుండి 8 ఏళ్ల గుర్తింపు కాలపరిమితి పెంపుదలపై 13 మంది రీజినల్ మరియు జిల్లా అధికారులకు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
వైసీపీ ఎమ్మెల్యే సీట్ల మార్పు, షర్మిళ కాంగ్రెస్ పార్టీలో ఎంట్రీ ప్రచారాలపై సీరియస్ కామెంట్స్ చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. షర్మిళ కాంగ్రెస్ లో చేరిక ఆమె వ్యక్తిగతం అని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీలో అయినా చేరవచ్చు.. కాంగ్రెస్ లో చేరినా, కేఏ పాల్ పార్టీలో చేరిన తమకేం సంబంధం లేదని తెలిపారు. సీటిస్తేనే పార్టీలో ఉంటాము అనే నాయకులు వెళ్లిపోవడమే మంచిదని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన బలమైన నాయకత్వం…
దక్షిణాఫ్రికాలో ఇప్పటి వరకు టెస్టు సిరీస్ గెలవలేదన్న బాధతో ఈ వరుసకు బ్రేక్ వేసేందుకు టీమిండియా కష్టాల్లో పడింది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో రెండో రోజు ఘోరంగా వెనుకబడింది. సెంచూరియన్ వేదికగా జరుగుతున్న ఈ టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 11 పరుగుల ఆధిక్యంలో ఉండగా.. ఇంకా 5 వికెట్లు మిగిలి ఉన్నాయి.
దేశంలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా పాకుతుంది. మళ్లీ కరోనా కేసులు తీవ్రంగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో.. మహారాష్ట్రలో కొత్తగా 87 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇక కరోనాతో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. కాగా.. ముంబైలో 19 కోవిడ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పూణె, సాంగ్లీ జిల్లాలో ఒక్కొక్క కేసు నమోదైంది. ఇదిలా ఉంటే.. నిన్న రాష్ట్రంలో 37 మందికి కరోనా సోకింది. మార్చి 2020 నుండి రాష్ట్రంలో మొత్తం కోవిడ్ -19 కేసుల…
2024 జనవరి 22న "ప్రాణ్ ప్రతిష్ఠ" విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుంది. అయితే.. ఈ కార్యక్రమానికి ఆహ్వానించబడిన విశిష్ట అతిథులందరికీ ప్రత్యేక బహుమతులు ఇవ్వనున్నట్లు ఆలయ ట్రస్ట్ బుధవారం ప్రకటించింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం, నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన ట్రస్ట్ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం, హాజరైనవారికి పవిత్ర ప్రసాదంతో పాటు, గీతా ప్రెస్ నుండి 'అయోధ్య దర్శన్' పుస్తకం కాపీలను అందించనున్నట్లు చెప్పారు.
రాజస్థాన్ ప్రభుత్వం నూతన సంవత్సర కానుక ఇచ్చింది. జనవరి 1 నుండి ఉజ్వల గ్యాస్ సిలిండర్ రూ.450కు అందించనుంది. రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా.. బిజెపి మేనిఫెస్టోలోని అన్ని హామీలలో ఉజ్వల పథకం లబ్ధిదారులకు 450 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు. పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన వాగ్దానాలన్నింటినీ మోడీ హామీలుగా ప్రచారం చేసింది. ఇప్పుడు దీనిని నెరవేరుస్తూ ఉజ్వల పథకం లబ్ధిదారుల కోసం బీజేపీ ఈ ప్రకటన చేసింది.
ఐపీఎల్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కర్ణాటక క్రికెటర్ కేసీ కరియప్ప.. ప్రస్తుతం తీవ్ర వివాదంలో ఇరుక్కున్నాడు. అతని మాజీ ప్రియురాలు అతనిపై తీవ్ర ఆరోపణలు చేసింది. కరియప్ప తన మాజీ ప్రియురాలు మాదకద్రవ్యాల వినియోగంలో ఉన్నట్లు ఆరోపించిన వీడియోను విడుదల చేయడంతో వివాదం సంచలనంగా మారింది. దీనిపై కర్ణాటక పోలీసులు విచారణ ప్రారంభించారు.