సౌతాఫ్రికాతో సెంచూరియన్ లో జరుగుతున్న టెస్టులో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. 32 పరుగుల తేడాతో ఘోర పరాజయం పొందింది. ఈ విధంగా దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ గెలవాలన్న భారత జట్టు కల కలగానే మిగిలిపోయింది. 163 పరుగుల తొలి ఇన్నింగ్స్ లోటుతో ఇవాళ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా.. 131 పరుగులకే ఆలౌటైంది. విరాట్ కోహ్లీ 76 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా.. మిగతా బ్యాట్స్ మెన్లు పెద్దగా రాణించలేకపోయారు. కెప్టెన్ రోహిత్ శర్మ, అశ్విన్, బుమ్రా డకౌట్ అయ్యారు. తొలి…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పై మంత్రి సీదిరి అప్పల రాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లోకేష్ నాకు చాలెంజ్ చేసారు.. మత్స్యకారులకు, ఉత్తరాంధ్రాకు ఏం చేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చినబాబు నీకు దమ్ము, సిగ్గు లజ్జా ఉంటే.. మీ నాన్న కొబ్బరికాయ కొట్టిన పోర్టు, హార్పర్ ఇది అని చూపించు అని చాలెంజ్ చేశారు. వెనుకబడిన జిల్లాను అభివృద్ధి ప్రాంతాల నడుమ నిలబెట్టడానికి జగన్ కృషి చేస్తున్నారని మంత్రి సీదిరి తెలిపారు.
వైసీపీలో నియోజకవర్గ ఇంఛార్జుల మార్పుల- చేర్పుల కసరత్తులు కొనసాగుతున్నాయి. అనంతపురం జిల్లాలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి నేతలు క్యూ కడుతున్నారు. వైసీపీ అధిష్టానంతో నేతల వరుస భేటీలు జరుగుతున్నాయి. మాజీ మంత్రి కొడాలి నాని, ఎంపీ గోరంట్ల మాధవ్ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. మచిలీపట్నంలో పోటీపై పేర్నినానితో సీఎం చర్చించారు. అలాగే హిందూపురం ఎంపీ సీటు మాధవ్ కు దక్కుతుందా లేదా అనేది అనుమానమే.. మరోవైపు సీఎం జగన్ తో విజయసాయిరెడ్డి, బాలినేని కూడా…
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెళ్ళనున్న బహిరంగ సభల షెడ్యూల్ ఖరారు అయింది. జనవరి 5వ తేదీ నుంచి 25 పార్లమెంట్ సెగ్మెంట్లల్లో చంద్రబాబు బహిరంగ సభలు నిర్వహించనున్నారు. అంతేకాకుండా.. రెండు రోజుల్లో మూడు బహిరంగ సభలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తొలి విడతలో జనవరి 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు బహిరంగ సభల షెడ్యూల్ ఉండనుంది. అంతేకాకుండా.. తొలి విడతలో ఏడు పార్లమెంట్ సెగ్మెంట్లను కవర్ చేసేలా టీడీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మొదటగా ఒంగోలు పార్లమెంట్ నుంచి…
ఏపీ డీజీపీపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. డీజీపీ రాజేంద్రనాథరెడ్డి బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి ఆయన వ్యవహారశైలి నానాటికి దిగజారుతోందని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన రాజేంద్రనాథరెడ్డి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీని కాపాడుతూ మిగతా పార్టీలను వేధించడం, నిర్లక్ష్యం చేయడమే డీజీపీ పనా..? అని ప్రశ్నించారు. టీడీపీ నాయకులు.. రాజేంద్రనాథరెడ్డి అపాయింట్ మెంట్ కోరితే ఈ రెండు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఇవ్వలేదని అన్నారు. మహిళా నాయకురాళ్లు వారి ఇబ్బందులు చెప్పుకోవాలనుకున్నా…
మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. కాసేపటి క్రితం తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చిన అంబటి రాయుడు వైసీపీలో అధికారికంగా చేరారు. అంబటి రాయుడును పార్టీలోకి సీఎం జగన్ సాదరంగా ఆహ్వానించారు. ఇదిలా ఉంటే అంబటి రాయుడు గత కొంతకాలంగా గుంటూరు జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే ఎప్పటి నుంచో వైసీపీలో చేరతారన్న ప్రచారం జరిగినప్పటికీ.. అధికారికంగా మాత్రం అంబటి రాయుడు పార్టీలో చేరలేదు. ఈరోజు ఆయన పార్టీలో చేరడంతో.. గుంటూరు…
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి ఉపాధ్యాయ సంఘాల నేతలు వచ్చారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయ సంఘాల్లో అతిపెద్ద సంఘం పీఆర్టీయూ.. గత ప్రభుత్వంలో రెండుగా విడిపోయాయని తెలిపారు. అంతేకాకుండా.. రెండు ఎమ్మెల్సీలను గెలుచుకున్న గొప్ప సంఘం పీఆర్టీయూ అని అన్నారు. విడిపోయిన నేతలతో మాట్లాడి రెండు సంఘాలు కలిసేలా చూశామని.. ఒప్పందం ప్రకారం విడిపోయిన రెండు సంఘాలు ఏకమయ్యాయని పేర్కొన్నారు. రెండు సంఘాలు కలవడం వల్ల బలం పెరిగింది.. రాష్ట్రంలో వాలంటీర్లు ఎక్కడా సమ్మె చేయడం…
సెంచురియన్ లో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియాపై ఆతిథ్య దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు చేసింది. డీన్ ఎల్గార్ (185) సెంచరీ చేయగా.. మార్కో యన్సెన్ (84 నాటౌట్), డేవిడ్ బెడింగ్ హామ్ (56) అర్ధసెంచరీలతో దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్ లో 9 వికెట్లు కోల్పోయి 408 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్ లో కెప్టెన్ టెంబా బవుమా గాయం కారణంగా బ్యాటింగ్ చేయలేదు.
శ్రీ సత్యసాయి జిల్లాలో వైసీపీ అధిష్టానం చేపట్టిన మార్పులు, చేర్పులు ఎఫెక్ట్ స్పష్టంగా కనబడుతోంది. సిట్టింగ్ లను మార్చొందంటూ ఎమ్మెల్యేల మద్దతుదారులు రోడ్డెక్కి తమ అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు.
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా రేపు (శుక్రవారం) విజయవాడ, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈరోజు సాయంత్రం ఢిల్లీ నుండి విజయవాడ చేరుకుని.. రాత్రికి విజయవాడలో బస చేయనున్నారు. శుక్రవారం ఉదయం 9.15 కు విజయవాడలో పాత ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ బ్లాక్, BSL-3 ల్యాబ్ నిర్మాణానికి కేంద్రమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడ కొత్తగా నిర్మించిన IPHL ల్యాబ్స్ ను ప్రారంభించనున్నారు.