వీసాల జారీలో కొర్రీలు పెట్టే అగ్రరాజ్యం.. ఈసారి మాత్రం భారతీయులకు వీసాలు వచ్చే విషయంలో సరికొత్త రికార్డు సృష్టించింది. గతేడాది ఏకంగా రికార్డు స్థాయిలో భారతీయులకు వీసాలు ఇచ్చినట్లు వెల్లడించింది.
YCP Rebel MLAs: వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల విచారణ వాయిదా..
2023లో భారతీయులకు 14 లక్షల వీసాలు ఇచ్చినట్లు అమెరికా తెలిపింది. అన్ని వీసా విభాగాల్లో డిమాండ్ భారీగా పెరిగిందని పేర్కొంది. 2022తో పోలిస్తే గతేడాది భారతీయుల వీసా దరఖాస్తుల్లో 60 శాతం పెరుగుదల నమోదైందని వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి పది మంది దరఖాస్తుదారుల్లో ఒకరు ఇండియన్ ఉన్నారని పేర్కొంది. ఇక విజిటర్ వీసా అపాయింట్‌మెంట్ వెయిటింగ్ సమయాన్ని వెయ్యి రోజుల నుంచి 250కి తగ్గించినట్లు ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.
Delhi: అన్నదాతలకు కేంద్రం శుభవార్త.. ఇక నుంచి రూ.9వేలు..!