తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అసెంబ్లీ, లోక్ సభ ఇంఛార్జుల్లో మార్పులపై కసరత్తు కొనసాగుతుంది. ఉదయం నుంచి సీఎం క్యాంపు కార్యాలయనికి పలువురు ఎమ్మెల్యేలు వస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ ఐదవ జాబితా కసరత్తు కొనసాగుతుంది. ఉదయం నుంచి క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు క్యూ కట్టారు. సీఎంఓకు వచ్చిన వారిలో ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్, సుచరిత, అన్నాబత్తుని శివ కుమార్, రీజనల్ కోఆర్డినేటర్ అయోధ్య రామి రెడ్డి, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, మంత్రి జోగి రమేష్ ఉన్నారు. ఇప్పటికే నాలుగు జాబితాలు ప్రకటించిన అధికార వైసీపీ.. మరో జాబితాను సిద్ధం చేస్తుంది.
Read Also: Trump: థర్డ్ వరల్డ్ వార్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
రానున్న ఎన్నికల్లో రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ ఈ కసరత్తులు చేస్తోంది. కాగా.. వైసీపీ ఇప్పటికే ఎన్నికల శంఖారావం పూరించింది. సిద్ధం పేరుతో బహిరంగ సభ నిర్వహించారు. అయితే గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న అధికార పార్టీ.. అన్ని నియోజకవర్గ స్థానాలపై ఫోకస్ పెట్టి మార్పులు చేర్పులు చేస్తోంది.
Read Also: Delhi Horror: కత్తితో బెదిరించి.. 14 ఏళ్ల బాలుడిపై స్నేహితులు అసహజ లైంగిక దాడి