ఫిబ్రవరి 1న పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.. అందులో దక్షిణ మధ్య రైల్వేకు కేంద్రం బడ్జెట్ కేటాయించింది. కాగా.. ఈ బడ్జెట్ లో కేంద్రం ఎంత ప్రకటించిందో సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు.
Read Also: Minister Seethakka: గ్యారంటీల ప్రకటన ఇక్కడ ఉండదు..
ఈ ఏడాది రూ.14,232.84 కోట్లు కేటాయింపు..
భద్రాచలం రోడ్ డోర్నకల్ మధ్య 54.65 కిలోమీటర్ల డబ్లింగ్లోనే పనులకు రూ.770.12 కోట్లు..
ఔరంగాబాద్ అంకై మధ్య డబ్లింగ్ పనులకు రూ.960.64 కోట్లు..
దక్షిణ మధ్య రైల్వేలో కొత్త ప్రాజెక్ట్ లకు నిధులు..
కొత్త ప్రాజెక్ట్ ల కింద రూ.1184.14 కోట్ల కేటాయింపు..
డబ్లింగ్, థర్డ్ లైన్ ప్రాజెక్ట్ కింద రూ.2905.91 కోట్లు..
విద్యుద్దీకరణ లైన్ ల కోసం రూ.225.59 కోట్లు..
సిగ్నల్ టెలి కమ్యూనికేషన్ కింద రూ. 302.68 కోట్లు..
రైల్వే భద్రత పరంగా నిధుల కేటాయింపులు రూ.891.4 కోట్లు..
ట్రాక్ మరమత్తులు కోసం రూ.1530 కోట్లు..
కవచ్ కోసం రూ.41.94 కోట్లు..
నడికుడి శ్రీకాళహస్తి కొత్త రైల్వే లైన్ కోసం రూ.450 కోట్లు కేటాయింపు(ఏపీ)..
మనోహరబాద్ కొత్తపల్లి కొత్త ప్రాజెక్ట్ పనుల కోసం రూ.350 కోట్లు..
కొత్తపల్లి నర్సాపూర్ కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్ కోసం రూ.300 కోట్లు..
డబుల్, థర్డ్ లైన్ కొత్త కేటాంయిపులు..
విజయవాడ గూడూరు థర్డ్ లైన్ కోసం రూ.500 కోట్లు..
కాజీపేట విజయవాడ థర్డ్ లైన్ కోసం రూ.310 కోట్లు..
కాజీపేట బలర్ష థర్డ్ లైన్ కోసం రూ.300 కోట్లు..
గుంటూరు గుంతకల్ డబుల్ లైన్ కోసం రూ.283.50 కోట్లు..
అకొల డోన్ డబుల్ లైన్ కోసం రూ.220 కోట్లు..
ఔరంగాబాద్- ఆంకై డబుల్ లైన్ కోసం రూ.214 కోట్లు..
గుంటూరు -బీబీ నగర్ డబుల్ లైన్ కోసం రూ.200 కోట్లు..
గూటి- పెండెకల్లు డబుల్ లైన్ కోసం రూ.150 కోట్లు..
పర్బాని- పార్లి డబుల్ లైన్ కోసం రూ.100 కోట్లు..
భద్రాచలం రోడ్ డోర్నకల్ డబుల్ లైన్ కోసం రూ.100 కోట్లు..
ఎంఎంటీఎస్ ఫేస్ 2 కింద రూ.50 కోట్లు..
ఎంఎంటీఎస్ ఫేస్ 2లో ఘట్కేసర్ – యాదాద్రి లైన్ పొడిగింపు కోసం రూ.10 కోట్లు..
బైపాస్ లైన్ కోసం 209.8 రూ.కోట్లు..
అదనంగా బై పాస్ లైన్ కోసం రూ.172.27 కోట్లు..
వాజినత్ 1.9km, వికారాబాద్ 2.8km విష్ణు పురం 4.9km ..
కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కోసం రూ.150 కోట్లు..
చర్లపల్లి టెర్మినల్ కోసం రూ.93.75 కోట్లు..
కర్నూల్ మిడ్ లైఫ్ రీహాబిలిటేషన్ ఫ్యాక్టరీ కోసం రూ.115.54 కోట్లు..
గుంటూరు యార్డ్ కోసం రూ.50 కోట్లు..
రాజమండ్రి గోదావరి బ్రిడ్జి మెయింటేన్ కోసం రూ.10 కోట్లు..
కాగా.. తెలంగాణకు నిన్నటి బడ్జెట్ లో రూ. 5,071 కోట్లు కేటాయించగా.. ఏపీకి రూ.9,138 కోట్లు కేటాయించింది.