Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు, ఇతర నేతలు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా.. నాగోబాను దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ పూజల్లో డిప్యూటీ సీఎం విక్రమార్కతోపాటు మంత్రలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, సీతక్క, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సాయంత్రం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు.
Read Also: Khiladi Bank Manager: కిలాడి బ్యాంక్ మేనేజర్.. బ్యాంకులో కుదువ పెట్టిన బంగారంతో వడ్డాణం
అంతకుముందు మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. గ్యారంటీల ప్రకటన ఇంద్రవెల్లిలో ఉండదని చెప్పారు. దానికి సంబంధించిన విధివిధానాలు సిద్ధమవుతున్నాయని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాకు కావాల్సిన నిధుల కోసం అధికారులు ప్రతిపాదనలు పంపారని.. వాటికి సంబంధించి హామీ వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అప్పుడు పోరాట శంఖారావం.. ఇప్పుడు అభివృద్ది శంఖారావమన్నారు. అసలు సిన్మా గురించి రేవంత్ రెడ్డి చెప్పుతారని మంత్రి సీతక్క తెలిపారు.
Read Also: MLC Jeevan Reddy: తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకున్నారు..
సీఎం హోదాలో ఆయన మొదటి జిల్లా పర్యటన.. ఇంద్రవెల్లి గడ్డను సీఎం రేవంత్‌రెడ్డి సెంటిమెంట్‌గా తీసుకున్నారు. అప్పట్లో టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకం తర్వాత 2021 ఆగస్టు 9న ఇక్కడే తొలి సభ నిర్వహించారు. అప్పుడు ‘దళిత, గిరిజన దండోరా’ పేరిట నిర్వహించిన సభకు లక్ష మందికి పైగా జనం విచ్చేశారు. సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో రేవంత్ రెడ్డి ఇక వెనుదిరిగి చూసుకోలేదు.. ఆ తర్వాత రాష్ట్రంలో పలు సభలు నిర్వహించారు. అప్పటి నుంచే కాంగ్రెస్ వైపు ప్రజల్లో పెరిగిందన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమైంది. ఇక, దానికి తగ్గట్టుగానే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో పాటు రేవంత్‌రెడ్డిగా సీఎం కావడం జరిగిపోయింది. తాజాగా పార్లమెంట్ ఎన్నికల నగారాను కూడా ఇంద్రవెల్లి నుంచే స్టార్ట్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.