Teeth: పసుపు పచ్చని పళ్లతో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా చేయండి మెరిసిపోతాయి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొన్ని కారణాల వల్ల దంతాలు పసుపు రంగులోకి మారిపోతాయి. కానీ వాటిని తిరిగి తెల్లగా చేయడం కష్టం. కానీ పసుపు దంతాలను తెల్లటి ట్యూబ్‌లైట్ లాగా మెరిసేలా చేయాలనుకుంటే కొన్ని సులభమైన నివారణలు ఉన్నాయి. దంతాలను సరిగ్గా శుభ్రం చేయకపోవడం, దంతాలు పసుపు రంగులోకి మారడానికి కారణమయ్యే వాటిని తినడం, దంతక్షయం కారణాల వల్ల దంతాలు పసుపు రంగులోకి మారుతాయి. దంతాల నుండి పసుపు పొరను తొలగించడానికి.. ఉదయం, సాయంత్రం దంతాలను బ్రష్ చేయడం మాత్రమే కాదు, కొన్ని నివారణలను ప్రయత్నించాలని వైద్యులు చెబుతున్నారు.
అరటి తొక్క
పసుపు దంతాలను శుభ్రపరచడంలో అరటి తొక్కలు మంచి ప్రభావాన్ని చూపుతాయి. అరటి తొక్కలో మెగ్నీషియం, మాంగనీస్ మరియు పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. అరటిపండు తొక్క లోపలి భాగాన్ని తీసుకుని దంతాల మీద రుద్ది కాసేపటి తర్వాత నోటిని కడిగి శుభ్రం చేసుకోవాలి. ఈ ప్రక్రియను ఉదయం, సాయంత్రం చేయడం ద్వారా.. దంతాల పసుపు రంగు క్లియర్ అవుతుంది.
Also Read
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
బేకింగ్ సోడా
బేకింగ్ సోడా పసుపు పళ్ళపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. బేకింగ్ సోడా దంతాల మరకలను తొలగిస్తుంది. ఒక గిన్నెలో బేకింగ్ సోడా తీసి అందులో నీళ్లు పోసి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను బ్రష్‌పై తీసుకుని దంతాల మీద రుద్ది, ఆపై నోరు కడగాలి. దంతాల పసుపును తొలగించడంలో దీని ప్రభావం కనిపిస్తుంది.
వేప, పటిక
వేప, పటిక పళ్ళలో మురికిని తొలగించి తెల్లగా మార్చడానికి ఉపయోగపడుతుంది. వేప, పటిక చెక్కలు దంతాలకు ఎంతో మేలు చేస్తాయి. వాటిని పళ్లతో నొక్కడం ద్వారా వాటి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీమైక్రోబయల్ లక్షణాలు దంతాలకు లభిస్తాయి. ఇది దంతాలకే కాకుండా చిగుళ్లకు కూడా మేలు చేస్తుంది.
స్ట్రాబెర్రీలు
స్ట్రాబెర్రీ, బేకింగ్ సోడా కలిపి దంతాలపై పూయడం వల్ల దంతాల మీద పసుపు మచ్చలు తొలగిపోతాయి. స్ట్రాబెర్రీలో మాలిక్ యాసిడ్ ఉంటుంది.. ఇది దంతాల నుండి మరకలను తొలగిస్తుంది. ఒక స్ట్రాబెర్రీని చూర్ణం చేసి, ఒక చెంచా బేకింగ్ సోడాలో వేసి, ఈ పేస్ట్‌ను దంతాల మీద రుద్ది.. కాసేపు ఉంచి తర్వాత కడిగేయండి. దంతాలు మెరుస్తాయి.
కొబ్బరి నూనె
కొబ్బరి నూనెతో దంతాల పసుపును తొలగిస్తుంది. ఇది దంత క్షయాన్ని కూడా తొలగిస్తుంది.. అంతేకాకుండా నోటి దుర్వాసన నుండి ఉపశమనం కలిగిస్తుంది. కొద్దిగా కొబ్బరి నూనెను నోటిలో ఉంచి, అటు ఇటు తిప్పండి. దాని ద్వారా దంతాల నుండి మురికిని తొలగిస్తుంది. కొబ్బరి నూనెను ఒకటి నుండి రెండు నిమిషాలు నోటిలో కడిగి, నోటిని శుభ్రం చేసుకోండి.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!