హైదరాబాద్ మాదాపూర్లోని శిల్పకళావేదికలో మార్చి 22న ‘మెలోడియస్ క్వీన్ సునీత ఉపద్రష్ట’ ప్రత్యక్ష సంగీత కార్యక్రమం నిర్వహించనున్నారు. ఎస్.వి.యం గ్రాండ్ మరియు టెంపుల్ బెల్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ పి పట్నాయక్, టెంపుల్ బెల్ ఈవెంట్స్ నిర్వహకులు కౌశిక్ రామ్ మద్దాలి, ఎస్.వి.యం గ్రాండ్ హోటల్ ఎం.డి. వర ప్రసాద్ తదితరులతో కలిసి సునీత బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1లోని ఎస్.వి.యం. గ్రాండ్ హోటల్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చాలా రోజుల తర్వాత హైదరాబాద్ పేక్షకులకు మంచి సంగీత ప్రదర్శన ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే మంచి మెలోడియస్ సాంగ్స్తో పాటు తెలుగు, తమిళ పాటలను ఆలపించనున్నట్లు ఆమె వివరించారు.
Rebel MLA’s: మరోసారి రెబెల్ ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై విచారణ..
కాగా.. టెంపుల్ బెల్ ఈవెంట్‌లు గతంలో హైదరాబాద్‌లో ఇళయరాజా, శంకర్ మహదేవన్ మరియు ఎస్ఎస్ థమన్‌లతో షోలు నిర్వహించాయి. బుక్‌మైషోలో పాస్‌లు అమ్మకానికి ఉన్నాయి.. ప్రారంభ ఆఫర్‌గా నిర్వాహకులు 15శాతం తగ్గింపును అందిస్తున్నారు. ప్రదర్శన యొక్క మొదటి టిక్కెట్‌ను ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్‌పి పట్నాయక్ కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఆర్‌పి పట్నాయక్ మాట్లాడుతూ.. పరిశ్రమలో 25 సంవత్సరాలకు పైగా పూర్తి చేసుకున్నందుకు సునీత ఉపద్రష్టకు శుభాకాంక్షలు తెలిపారు. సంగీత సోదరులకు ఆమె చేస్తున్న అద్భుతమైన సేవకు ఆమెను అభినందించారు.
Balineni Srinivasa Reddy: నేను ఏదైనా చేయాలనుకుంటే పార్టీ నుంచి బయటకు వెళ్లి చేస్తా..