ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్సీ వంశీ యాదవ్ మధ్య తీవ్ర రచ్చ జరుగుతుంది. ఒకరిపై ఒకరు మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. తాజాగా.. ఎమ్మె్ల్సీ వంశీ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను చెంచా గాళ్లు అని అన్నది ఎంవీవీ చెంచా గాల్లని మాత్రమేనని అన్నారు. తాను ఎవరి మీద వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదని.. దమ్ముంటే ఎంవీవీ తనతో మాట్లాడాలని అన్నారు. తన గురించి జగన్ తో తప్పుగా చెప్పి బ్యాడ్ చేసాడని తెలిపారు. ఎంవీవీకి ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నా.. నువ్వు … నేను రాజకీయాలకు దూరంగా ఉంటానని సవాల్ చేశారు. నీ చెంచా గాల్లతో నన్ను తిట్టించడం కాదు.. నీకు మేటర్ లేదా? అని ప్రశ్నించారు.
Peddireddy: రఘువీరారెడ్డిపై మంత్రి తీవ్ర ఆగ్రహం..
మీరంతా యాంటీగా తనకు ప్రయత్నం చేసినా తాను గెలిచానన్నారు. మంత్రి అవ్వాలని తాను నీకు కలలోకి వచ్చి చెప్పానా? అని ప్రశ్నించారు. చిత్త కార్తె కుక్కలా ఉండేది నువ్వు.. సంధ్యా రాగం పాడించాలి నీకు అని విమర్శలు గుప్పించారు. పిచ్చి కుక్కని కొట్టినట్టు కొట్టిన సిగ్గు రాలేదని ఎంవీవీపై మండిపడ్డారు. కులం పేరుతో, జాతి పేరుతో తిట్టించి సునకానందం పొందుతున్నావని తెలిపారు. జైల్లో తన్నులు తిని వచ్చి ఎంపీగా గెలిచావని.. విశాఖలోనే దరిద్రమైన ఎంపీగా నిలిచిపోతావని దుయ్యబట్టారు. ఎంపీగా గెలిచి ఈ ఐదేళ్లలో ఒక్క కంపెనీ విజిట్ అయినా చేశావా అని ప్రశ్నించారు. నేను చేసిన తప్పు 2019 ఎన్నికల్లో నువ్వు మంచొడివే అని చెప్పడమే అని పేర్కొన్నారు.
Kidnap: ఆళ్లగడ్డలో బాలుడి కిడ్నాప్ కలకలం..
నేను ఎవ్వరు ఆస్తులు కబ్జా చేయలేదు.. ఎంవీవీ దగ్గర ఆధారాలు ఉంటే నిరూపించమనండని వంశీ యాధవ్ తెలిపారు. నామీద ఎన్ని కేసులు పెట్టినా ఏమీ చేయలేరు.. నా రాజకీయ జీవితాన్ని నాశనం చేసింది ఎంవీవీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మేయర్ అవ్వకుండా అడ్డుకున్నాడని.. తన గురించి విశాఖ వాసులుకు తెలుసన్నారు. మరోవైపు.. తాను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండడానికే పార్టీ మారానన్నారు. తనకు రెండో దేవుడు పవన్ కళ్యాణ్ అని చెప్పారు. రాజకీయంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో తనకు పవన్ అవకాశం ఇచ్చారని తెలిపారు.