ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ సమీకరణాల వేగంగా మారుతున్నాయి. పార్టీలో టికెట్ లభించకపోయినా, సమచిత స్థానం కల్పించలేకపోయినా లీడర్లు పార్టీ మారుస్తున్నారు. ఇప్పటికే వైసీపీ అధిష్టానం.. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తీవ్ర కసరత్తులు చేసింది. ఈ క్రమంలో పార్టీ నుంచి అలకలు, బుజ్జగింపుల పర్వం మొదలైంది.
Read Also: GSLV F14: జీఎస్‌ఎల్వీ-ఎఫ్14 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్..
కదిరి ఎమ్మెల్యే సిద్దారెడ్డిని బుజ్జగించే పనిలో పడింది వైసీపీ అధిష్టానం. ఈ క్రమంలో ఆయనతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సమావేశం అయ్యారు. మార్పులు చేర్పుల్లో భాగంగా కదిరి నియోజకవర్గంలో సమన్వయ కర్తను మార్చింది వైసీపీ. అప్పటి నుంచి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పార్టీకి దూరంగా ఉన్నారు. ఇప్పడు ఆయనతో మంత్రి పెద్దిరెడ్డి సమావేశం కావడం ఆసక్తికరంగా మారింది. సిద్ధారెడ్డికి భవిష్యత్ లో మంచి అవకాశాలు ఉంటాయని మంత్రి పెద్దిరెడ్డి బుజ్జగించినట్లు సమాచారం.
Read Also: Australia floods: ఆస్ట్రేలియాను ముంచెత్తిన వరదలు.. భారతీయురాలి మృతి