ఇవ్వాల్సిన డబ్బు కోసం ఇంటి మీదకు వచ్చి బెదిరిస్తారు.. తిడతారు.. కొడతారు. కానీ ఓ వ్యక్తి బాలుడిని కిడ్నాప్ చేశాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. అప్పు తీర్చలేదని బాలుడిని కిడ్నాప్ చేశాడు ఆళ్లగడ్డ వైసీపీ కౌన్సిలర్ వరలక్ష్మి కుమారుడు సుధాకర్. తీసుకున్న అప్పు ఇవ్వలేదన్న కోపంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
Read Also: YCP: కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి వైసీపీ బుజ్జగింపులు..
స్కూల్కు వెళ్లిన బాలుడిని.. స్కూల్ నుంచి బయటకు రాగానే కిడ్నాప్ చేసి కారులో ఎక్కించుకుని తీసుకెళ్లాడు. బాలుడిని కిడ్నాప్ చేసిన నిందితుడు సుధాకర్.. ఏం చేయాలో తెలియక బ్రహ్మంగారి మఠం వద్ద లోయలో పడేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆ బాలుడు లోయలో నుంచి బయటకు రావడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. గాయాలపాలైన బాలుడిని చికిత్స నిమిత్తం కడప ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం కర్నూలు హాస్పటల్ కు తరలించారు.
Read Also: Delhi Assembly: కేజ్రీవాల్ షాకింగ్ నిర్ణయం.. ఫ్లోర్‌టెస్ట్‌కు తీర్మానం