కాంగ్రెస్ పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీరా రెడ్డి లాంటి ముఠాలు కాంగ్రెస్ లో చాలా ఉన్నాయని విమర్శించారు. రాజశేఖర్ రెడ్డికి మడుగులు ఒత్తి, అయన చనిపోయాక జగన్ పై విరుచుకుపడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. తమ ఇంచార్జీ మంత్రిగా ఉండి, కనీసం తన నియోజకవర్గంలో కూడా పర్యటించలేదు, ఆయనకి తన గురించి ఏమీ తెలుస్తుందని రఘువీరా రెడ్డిపై మండిపడ్డారు.
MLC Kavitha: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణ 28కి వాయిదా
తాను ఖూనీలు చేశాను అని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పకుంటానని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. పుట్టపర్తి సాయిబాబా చనిపోతే.. ఆయన పార్థివ దేహాన్ని తీయకుండా డబ్బులు మూటలు సర్దుకున్న వ్యక్తి రఘువీరా అని దుయ్యబట్టారు. రఘువీరా రెడ్డి ఒక పొలిటికల్ బ్రోకర్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని తాము బ్రతికించానని చెప్పుకుంటున్నారు.. కానీ కాంగ్రెస్ ను చంపింది కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీరాలేనని చెప్పారు.
Kishan Reddy: కేసీఆర్ ప్రభుత్వం వల్లే తెలంగాణలో మ్యూజియం ఏర్పాటు ఆలస్యమైంది..
మరోవైపు.. లక్షల కోట్లు అప్పులు చేసి చంద్రబాబు ఒక్క చెప్పుకోదగ్గ పథకం ఏమైనా పెట్టారా అని ప్రశ్నించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నేను ఇది చేశాను అని చెప్పుకునే దిక్కు చంద్రబాబుకు లేదని దుయ్యబట్టారు. ఇకపోతే.. ఈసీకి తన పై ఫిర్యాదు చేయడం వల్ల తనకేం నష్టం లేదన్నారు. ముందు చంద్రబాబును కుప్పంలో గెలవమని చెప్పండని సెటైర్లు వేశారు. ఇదిలా ఉంటే.. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా అనంతపురంలో సభ నిర్వహిస్తామన్నారు. ఇతర పార్టీలు కూడా సీఎం వైఎస్ జగన్ సభ పై దృష్టి పెట్టారని తెలిపారు. ఎన్నికల పోరాటానికి సంసిద్ధం అనెందుకే సిద్దం సభ అని మంత్రి పేర్కొ్న్నారు.