GSLV-F14 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ వాహననౌక ఇన్సాట్-3డీఎస్ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లింది. అనంతరం 2,275 కిలోల బరువు ఉన్న ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశ పెట్టింది. తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి సాయంత్రం 5.35 గంటలకు ప్రయోగించారు.
Read Also: IND vs ENG: మూడో రోజు ముగిసిన ఆట.. భారత్ ఆధిక్యం ఎంతంటే..?
ఇన్సాట్-3డీఎస్‌ను వాతావరణ పరిశీలనలను మెరుగుపరచడానికి, భూమి, సముద్ర ఉపరితలాలను పర్యవేక్షించడానికి రూపొందించారు. తద్వారా వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరుస్తుంది. ఈ ఉపగ్రహం పదేళ్లపాటు సేవలందించనుంది. కాగా.. ఇన్సాట్-3డీఎస్ ఉపగ్రహం విపత్తులపై ముందే హెచ్చరించనుంది. ఇదిలా ఉంటే.. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు, సిబ్బందికి ఛైర్మన్ సోమనాథ్ అభినందనలు తెలిపారు.