ఎమ్మిగనూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారిని బరిలోకి దించాలని గోనెగండ్ల మాజీ సర్పంచ్ రంగముని పోతలపాటి అభ్యర్థించారు. ఆయనతో పాటు నాయకులు బాబు నాయుడు, లక్ష్మీనారాయణ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గం వారికి కేటాయిస్తే.. తాము గెలిపించుకోవడానికి తమ శాయ శక్తుల కృషి చేస్తామని పేర్కొన్నారు. అంతకుముందు.. గోనెగండ్ల మండలంలోని కాశీ నీలకంఠేశ్వర దేవాలయం, చింతలముని నల్లారెడ్డి ఆశ్రమంలో పూజలు చేసి మండలంలో విస్తృత ప్రచారం చేశారు. పెద్దమర్రి వీడు, చిన్నమర్రి వీడు, కులుమాల గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు.
Nampally Numaish: నేటితో ముగియనున్న నుమాయిష్
ప్రతి గ్రామంలో పర్యటిస్తున్న గోనెగండ్ల మాజీ సర్పంచ్ రంగముని పోతలపాటి బీసీ నాయకులతో మాట్లాడుతున్న సందర్భంలో టీడీపీ ప్రభుత్వంలో బీసీలకు స్కాలర్షిప్స్, బీసీ కార్పొరేషన్ వంటి వాటిని బీసీ సామాజికవర్గానికి కేటాయించారు. కానీ నేటి ప్రభుత్వంలో బీసీలకు ఎటువంటి ప్రాధాన్యం లేకపోగా, ఉన్న వాటిని కూడా తొలగించారు అని అక్కడి గ్రామస్థులు విన్నవించారు. అనంతరం ఇంటింటికీ తిరిగి మహిళల సమస్యలు తెలుసుకున్నారు. టీడీపీ ప్రభుత్వం రాగానే తల్లికి వందనం పేరుతో ప్రతి ఇంట్లో చదువుకొనే పిల్లలు ఉంటే వారందరికీ సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి అక్క చెల్లెమ్మకు ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు ఇస్తారని చెప్పారు. ఇంకా దీపం పేరుతో ప్రతి సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని తెలిపారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. వీటితో పాటు ఆరు పథకాలు గురించి రంగముని పోతలపాటి విస్తృత ప్రచారం చేస్తున్నారు. అక్కడి ప్రజల సమస్యలు తెలుసుకొని టీడీపీ ప్రభుత్వం రాగానే ఈ సమస్యలన్నిటిని పరిష్కరిస్తాను అని వారికి హామీ ఇచ్చారు.
Bees attack: పెళ్లికి పిలువని ఆహ్వానితులు.. బంధువులు పరుగో పరుగు.. వీడియో వైరల్..
ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కృష్ణారెడ్డి, మాజీ సింగల్ విండో ప్రెసిడెంట్ పరమేశ్వరరెడ్డి, మాజీ ఎంపీటీసీ రహమతుల్లా, అగ్రహారం పార్వతమ్మ, టి.ప్రభాకర్ నాయుడు, పూతలపాటి రంగముని, చానాల రాయుడు, ఎస్ బి. యూనిస్, చిట్యాల మునియప్ప, కాలపర్రి రంగముని, బేకల్ లక్ష్మీనారాయణ, రంగారెడ్డి, లక్ష్మన్న, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.