ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సొంత నియోజకవర్గం కొడంగల్‌లో తొలిసారి రేవంత్ రెడ్డి పర్యటించారు. రూ.4,369 కోట్ల విలువైన 20 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కోస్గిలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. రాబోయే వారం రోజుల్లో 5 వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్, 2 వందల యూనిట్లకు ఉచిత విద్యుత్ ఇస్తాం. వచ్చే నెల 15 వ తేదీలోపు రైతులందరికి రైతుబందు అందిస్తాం. రైతులను రుణవిముక్తి చేసేందుకు త్వరలో 2 లక్షల రుణమాపీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
CM Revanth: మహబూబ్‌నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన సీఎం రేవంత్..
‘కరీంనగర్ నుంచి పారిపోయి పాలమూరుకు వలస వచ్చిన కేసీఆర్‌ను గెలిపిస్తే ఇక్కడి ప్రజలను మోసగించారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే కేసీఆర్ జిల్లాలో ఓట్లు అడగాలన్నారు. 27 వేల కోట్లు ఖర్చు చేసినా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా ఒక్క ఎకరానికి నీరు ఇవ్వని దద్దమ్మ కేసీఆర్ అని మండిపడ్డారు. చిన్నారెడ్డి ప్రారంభించిన తెలంగాణ ఉద్యమంలో చేరి.. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడించారని దుయ్యబట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఛీ కొట్టిన సిగ్గు రాలేదని.. మళ్లీ లోక్ సభ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వస్తున్నారని మండిపడ్డారు.
పాలమూరులో ఏ ప్రాజెక్టు పూర్తి చేశావని మళ్లీ ఇక్కడకు వస్తానంటున్నావని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లలో 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఏ ప్రాజెక్ట్ ను పూర్తి చేశావని ప్రశ్నించారు. సమైక్య రాష్ట్రంలో జరిగిన అన్యాయం కంటే కేసీఆర్ పాలనలో జరిగిన అన్యాయమే తెలంగాణకు ఎక్కువ నష్టం జరిగిందని తెలిపారు. రోజమ్మ పిలిచి రాగి సంకటి, నాటుకోడి పులుసు పెట్టగానే పులుసు తిని అలుసు ఇచ్చి బలిచిపోయి రాయలసీమకు నీళ్లు ఇస్తా అన్నావని కేసీఆర్ పై విమర్శలు చేశారు.
Ex-Boyfriend: ఈ మాజీ లవర్ ఎంత అదృష్టవంతుడో.. 2 కోట్ల గిఫ్ట్‌తో సర్‌ఫ్రైజ్!
పాలమూరు అభివృద్ధి ముసుగులో కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని సీఎం రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 2014లో ప్రధాని మోదీ జాతీయహోదా ఇస్తామని ఎందుకు ఇవ్వలేదో జిల్లా బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, డీకే అరుణ, జితేందర్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఈ జిల్లాలో ఓటు అడిగే హక్కు బీజేపీకి లేదన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కొడంగల్‌లో 50 వేల మెజార్టీ ఇస్తే మరింత అభివృద్ధి చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో 14 లోక్ సభ సీట్లు గెలిస్తేనే.. దేశ స్థాయిలో రాష్ట్రం యొక్క గొప్పతనం, కాంగ్రెస్ పార్టీలో కొడంగల్ గౌరవం పెరుగుతుందన్నారు. అందుకోసమని.. కార్యకర్తలు ఆ దిశగా పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.