పార్లమెంట్ లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం రేవంత్ రెడ్డి తొలి లోక్‌సభ అభ్యర్థిని ప్రకటించారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్‌రెడ్డిని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. బుధవారం కోస్గి సభలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి.. భారీ మెజార్టీతో వంశీచంద్ రెడ్డిని గెలిపించాలని కోరారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. వంశీచంద్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు. కొడంగల్ లో 50 వేలు తగ్గకుండా ఆపై మెజార్టీ ఇవ్వాలని కోరారు.
సింగరేణి కాలరీస్ లో ఖాళీగా ఉన్న 317 డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులను, అలాగే 168 ఇంటర్నల్ రిక్రూట్మెంట్ పోస్టులను తక్షణమే భర్తీ చేసేందుకు వీలుగా నోటిఫికేషన్లు సిద్దం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సింగరేణి ఛైర్మన్ అండ్ ఎం.డీ బలరామ్ నాయక్ ను ఆదేశించారు. సింగరేణిలో కారుణ్య నియామక ప్రక్రియను వేగంగా చేపట్టాలని, ఈ ఏడాదిలో కనీసం వెయ్యి మంది వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన ఆభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై బుధవారం సచివాలయంలో సింగర్‌రేణి సంస్థ ఛైర్మన్ అండ్…
రాష్ట్రంలోని రైతులు, వ్యాపారులు, వినియోగదారులందరికీ నాణ్యమైన విద్యుత్తును సంపూర్ణంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రానున్న వేసవిలో విద్యుత్ సరఫరాకు సంబంధించిన ఏర్పాట్లపై సీఎండి రీజ్వితో కలిసి ట్రాన్స్కో ఎస్సీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా.. అత్యధిక విద్యుత్ డిమాండ్ ఉన్నా కూడా సరఫరా చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ కొన్నిచోట్ల చిన్నపాటి ఇబ్బందులు వస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని భట్టి విక్రమార్క తెలిపారు. మెయింటెనెన్స్, ఓవర్ లోడ్ ఈ రెండు అంశాల సందర్భంలో ఇబ్బందులు…
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. నిరుద్యోగుల విషయంలో స్పెషల్ ఫోకస్ పెట్టింది. గత పదేళ్లుగా బీఆర్ఎస్ నిరుద్యోగుల విషయంలో నిర్లక్ష్యం వహించిందని ముందు నుండి ఆరోపిస్తూ వచ్చిన కాంగ్రెస్.. ఎన్నికల ప్రచారంలో కూడా కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
బ్రతుకు దెరువు కోసం విదేశాలకు వెళ్లి, అక్కడ ఏజెంట్ చేతిలో మోసపోయిన 12 మంది భారతీయులను తిరిగి వెనక్కు తీసుకురావాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. గత ఏడాది హైదరాబాద్ లోని నాంపల్లి బజార్ ఘాట్ ప్రాంతానికి చెందిన మహమూద్ అస్ఫాన్ తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మొత్తం12 మంది లేబర్ పని కోసం గల్ఫ్ దేశానికి వెళ్లారు. అక్కడి నుండి స్థానిక ఏజెంట్ ఎక్కువ జీతం వస్తుందని... వారిని రష్యా దేశంలో సెక్యూరిటీ…
తెలంగాణ నుంచి రాజ్యసభ ఎంపీగా కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. ఈరోజు రిటర్నింగ్ అధికారి నుండి రాజ్యసభ ఎంపీగా ఎన్నిక ధ్రువీకరణ పత్రం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజ్యసభకు తనను పంపినందుకు సోనియాగాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీకి థ్యాంక్స్ చెప్పారు. రాజ్యసభ ఎంపీ అవ్వడం బహుమతి కాదు.. బాధ్యత పెరిగిందని చెప్పారు. ఈ క్రమంలో బీజేపీపై విరుచుకుపడ్డారు. ఎన్నికలు అనగానే నాయకుల ఇళ్లకు ఈడీ అధికారులు చేరుకుంటున్నారని ఆరోపించారు. పదేళ్లు ఇదే చూశాం..…
ఎన్నికల షెడ్యూల్ కు గడువు మరో పక్షం రోజులే ఉన్నందున ఆ లోపే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసి కాంగ్రెస్ పార్టీ తన చిత్తుశుద్దిని నిరూపించుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని చూస్తుంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసేలా కన్పిస్తోందన్నారు. ‘‘6 గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామంటున్న కాంగ్రెస్ నేతలకు 70 రోజుల గడువు ముగిసింది. నెలాఖరు తరువాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ వెలువడే…
ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు చిట్ చాట్ నిర్వహించారు. అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఐటీని 2, 3 టైర్ సిటీస్ గా విస్తరణ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. అంతేకాకుండా.. ఫార్మా ఇండస్ట్రీ పూర్తిగా రెడ్ జోన్.. పొల్యూషన్ ఎక్కువ కాబట్టి క్లస్టర్ లు ఏర్పాటు చేసి విభజిస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం ఉంటుంది.. ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మరోవైపు.. నల్గొండలో డ్రై పోర్ట్ ప్రపోజల్ పెడుతున్నాం.. ఏపీ పోర్టులకు దగ్గరగా ఉంటుందని నల్గొండలో డ్రై…
అధిక లాభాలు ఆశ చూపి.. ట్రేడింగ్ పేరుతో కోట్లు కొట్టేస్తున్నారు సైబర్ కేటగాళ్లు. ట్రేడింగ్ పేరుతో లాభాలు చూపెడతామని అమాయకుల దగ్గర నుంచి కోట్లు వసూలు చేసి చివరకు టోపీ తిప్పేస్తున్నారు. చార్టెడ్ అకౌంటెంట్, న్యాయవాదులే టార్గెట్ గా సైబర్ కేటుగాళ్లు పనిచేస్తున్నారు. పెద్ద ఎత్తున ట్రేడింగ్ చేసే న్యాయవాదులు, చార్టెడ్ అకౌంట్ లో సైబర్ కేటుగాళ్లు ట్రాప్ చేస్తున్నారు. ట్రేడింగ్ లో అధిక లాభాలు ఇప్పిస్తామని చెప్పి వారిని బుట్టలోకి దించుతున్నారు ఈ మాయగాళ్లు. దీంతో ఆశతో చార్టెడ్ అకౌంట్, న్యాయవాదులు వారి…
తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతరకు భక్తులు భారీ ఎత్తున తరలివస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి సీతక్క మేడారంలోనే ఉండి జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతిసారీ తల్లులను వనంలో నుంచి గద్దెలపైకి తీసుకొచ్చేటప్పుడు తాను ఉంటున్నాని తెలిపారు. ఈసారి తన ఆధ్వర్యంలో తీసుకురావడంత ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. అలాగే.. మేడారం వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అంతేకాకుండా.. భక్తులు తల్లులను దర్శించుకునే సమయంలో క్యూలైనల్లో బాటిళ్లు ఇస్తున్నట్లు తెలిపారు. మేడారంలో భక్తులకు…