పల్నాడు జిల్లా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు నిన్న వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. త్వరలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. వచ్చే నెల మొదటి వారంలో నరసరావుపేటలో జరిగే రా కదలి రా సభలో లావు శ్రీకృష్ణ దేవరాయలు టీడీపీలో చేరనున్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ జంగా కూడా టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఏపీ హైకోర్టులో రాజధాని రైతులకు ఊరట లభించింది. రైతులకు ఇచ్చిన ప్లాట్లను రద్దు చేస్తూ జారీ చేసిన నోటీసులను హైకోర్టు కొట్టివేసింది. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు గతంలో సీఆర్డీయే ప్లాట్లు ఇచ్చింది. ప్లాట్లను రద్దు చేస్తూ 862 మంది రైతులకు సీఆర్డీఏ, రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. దీంతో రైతులు హైకోర్టును ఆశ్రయించారు.
విజయవాడ రూరల్ మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో యాగం చేపట్టారు. మూడు రోజుల పాటు చేపట్టనున్న అష్ఠద్రవ్య మహాగణపతి, రాజ్యలక్ష్మి, సుదర్శన లక్ష్మీనారసింహ యాగం సోమవారం ప్రారంభమైంది. గన్నవరం ప్రజలు సుఖ:సంతోషాలతో వర్ధిల్లటంతో పాటు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ.. ఈ యాగం చేపట్టినట్లు యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. ఈ కార్యక్రమం 26, 27, 28 తేదీల్లో జరుగనుంది. ఈ సందర్భంగా.. యార్లగడ్డ వెంకట్రావు, జ్ఞానేశ్వరి…
అసెంబ్లీ ఎన్నికలకు అధికార పార్టీ వైసీపీ సమాయత్తం అవుతుంది. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఈ క్రమంలో.. తాడేపల్లిలో వైసీపీ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు నాయకులతో సీఎం జగన్ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. 175 నియోజకవర్గాల నుంచి 2500 మంది నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ క్రమంలో సీఎం జగన్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
విశాఖలో కాపు ఉద్యమ జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ పార్టీలకు చెందిన కాపు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. విశాఖ జిల్లా కాపునాడు అధ్యక్షులు తోట రాజీవ్ మాట్లాడుతూ, కాపులకు జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కాపు జాతి కోసం చిత్తశుద్ధితో పోరాటం చేసామని.. ఎన్నికల సమయంలో తమ ఓట్లు మీకు కావాలి కాబట్టి తమ ఇబ్బందులు గుర్తించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తమ సమస్యలను కోల్డ్ స్టోరేజ్ నుంచి బయటకు తీయాలని పేర్కొన్నారు.…
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీలో వర్గపోరు రాజుకుంది. ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుపై మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివరామరాజు మండిపడ్డారు. భీమవరంలోని మాజీ ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు.. సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో.. ఎన్నికల్లో ఏ మాత్రం సహకరించేది లేదంటూ స్పష్టం చేశారు. దీంతో పార్టీ ఆఫీసు నుంచి రామరాజును శివ వర్గం బయటకి పంపించింది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు వ్యతిరేకంగా శివవర్గం నినాదాలు చేశారు.
మగవారు ఎక్కువగా కండల కోసం జిమ్లో వర్కౌట్లు, జాగింగ్లు చేస్తుంటారు. అంతేకాకుండా.. శరీరానికి బలానిచ్చే ఆహారపదార్థాలు తీసుకుంటారు. అయితే ఓ యువకుడు మాత్రం బాడీ బిల్డిండ్ కోసమని నాణాలు, అయస్కాంతాలు మింగాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. శరీరానికి జింక్ అవరసరమని చిల్లర నాణాలను మింగేశాడు. అయితే.. అలా మింగిన తర్వాత వాంతులు, కడుపులో నొప్పితో సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరాడు. దీంతో వైద్యులు స్కానింగ్ తీయగా.. అతని కడుపులో నాణాలు చూసి ఆశ్చర్యపోయారు. దీంతో ఆ యువకుడకి ఆపరేషన్…
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. మంగళవారం వైసీపీ కీలక సమావేశం జరగనుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యనేతలను సమాయత్తం చేసేందుకు వైసీపీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన తాడేపల్లి సీకే కన్వెన్షన్‌లో ఈ మీటింగ్ జరగనుంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నేతలు హాజరు కానున్నారు. సుమారు 2 వేలకు పైగా మండల స్థాయి నేతలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ…
నెల్లూరు జిల్లా కావలిలో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదిగలకు ఎక్కడా విలువ లేదని వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం మాలలకే ఇచ్చారు.. తెలంగాణ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం మాలలకే ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వానికి తాము వ్యతిరేకం కాదని.. ఎస్సీ వర్గీకరణకు ఎవరు మద్దతిస్తే వారికి ఎమ్మార్పీఎస్ తరఫున ఆ పార్టీకి మద్దతిస్తాని తెలిపారు.
కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం ఏపీలో పర్యటించనున్నారు. ఆయన పర్యటనకు రాష్ట్ర బీజేపీ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయల్దేరి గన్నవరం చేరుకుంటారు. ఎయిర్ పోర్టు వద్ద ఆయనకు స్వాగతం పలికేందుకు బీజేపీ నేతలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం అక్కడి నుంచి.. విశాఖ, విజయవాడ, ఏలూరు పర్యటనలకు వెళ్లనున్నారు.