నెల్లూరు జిల్లాలో జనసేనకు ఒక స్థానం కూడా కేటాయించకపోవడంతో జిల్లా పార్టీ కార్యాలయం ఎదుట నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. జిల్లాకు సీటు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా.. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి మాట్లాడుతూ.. జనసేన పార్టీ కోసం గత ఆరు సంవత్సరాల నుంచి నేతలు, కార్యకర్తలు ప్రజా సమస్యల మీద పోరాడుతూనే ఉన్నారని తెలిపారు. ఈ పోరాటాలతోనే పార్టీని బలోపేతం చేసుకున్నామన్నారు. కరోనా సమయంలో ఎవరూ చేయని విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించామని పేర్కొన్నారు.
ఆంధ్ర రంజీ జట్టుకు భారత టెస్ట్ క్రికెటర్ హనుమ విహారి గుడ్ బై చెప్పారు. భవిష్యత్లో ఆంధ్ర క్రికెట్ జట్టుకు ఆడబోనని వెల్లడించాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పై ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లలో ఆవేదన వెళ్లగక్కాడు. క్రికెట్‌లో ఏపీ రాజకీయ నేత జోక్యం ఉందని మనస్తాపం వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాలో విహారి పోస్టు చేశారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో క్రీడాకారుల కన్నా.. రాజకీయాలకే ప్రాధాన్యత ఎక్కువ ఉందని వెల్లడించారు.
సీఎం జగన్ కుప్పం పర్యటనపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా విమర్శనాస్త్రాలు గుప్పించారు. ఎన్నికల స్టంట్లో భాగమే కుప్పంలో జగన్ రెడ్డి తిప్పలు అని ఆరోపించారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ కు టీడీపీ 87 శాతం పూర్తి చేస్తే.. మిగిలిన 13 శాతం పనులు చేయడానికి జగన్ రెడ్డికి 57 నెలలు సమయం పట్టిందా? అని ప్రశ్నించారు. 3 లిఫ్టుల్లో 2 లిఫ్టులు టీడీపీ హయాంలో పూర్తి చేయగా, మిగిలిన ఒక్క లిఫ్ట్ పూర్తి చేయడానికి జగన్ రెడ్డికి 5 ఏళ్లు సమయం…
విశాఖ ఆర్కే బీచ్లో పర్యాటకులకు పెను ప్రమాదం తప్పింది. నిన్న ఆర్కే బీచ్లో ఫ్లోటింగ్ బ్రిడ్జి ప్రారంభించారు. అయితే.. అది తెగిపోయింది. కాగా.. ఫ్లోటింగ్ బ్రిడ్జి చివరి ఫ్లాట్ ఫామ్ భాగం సముద్రంలోకి 100 మీటర్లు దూరం కొట్టుకుపోయింది. అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. మరోవైపు.. పర్యాటకులు ఫ్లోటింగ్ బ్రిడ్జి తెగిపోవడంతో ఎక్కాలంటే భయబ్రాంతులకు గురవుతున్నారు. అయితే.. ఫ్లోటింగ్ బ్రిడ్జిని నిన్న ఆర్కే బీచ్లో అట్టహాసంగా రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, మంత్రి అమర్నాథ్ ప్రారంభించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన రా కదలిరా సభలో పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. జగన్ పాలనలో ఐదేళ్లలో ఏం మార్పులు వచ్చాయని ప్రశ్నించారు.? ఈ పాలనలో రైతులు, మహిళలు, విద్యార్థులు ఆనందంగా లేరని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో పేదలు నిరుపేదలయ్యారు.. పది రూపాయలు ఇచ్చి వంద దోచుకున్నాడని మండిపడ్డారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ముప్పై ఏండ్లు వెనక్కి పోయిందని ఆరోపించారు. జగన్.. పేదలమనషి అంటూ కొత్తనాటకం ఆడుతున్నారు.. నేను సవాలు చేస్తున్నా ఎలా…
అనంతపురం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో 'న్యాయ సాధన' సభ పేరుతో బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. అనంతపురం జిల్లా అంటే సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి అమిత ప్రేమ అని అన్నారు. మరోవైపు.. రాష్ట్ర అభివృద్ధి వైఎస్సార్ హాయంలోనే జరిగినట్లు చెప్పారు. అలాంటి.. సుపరిపాలన అందించేందుకు వైఎస్ షర్మిలను మీ ముందుకు తీసుకొచ్చామని ఖర్గే పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడుతుందని, తప్పకుండా అధికారంలోకి వస్తామని దీమా వ్యక్తం చేశారు.
స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలన్న ఏపీ ప్రభుత్వ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. చంద్రబాబు బెయిల్ రద్దు కేసు విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది భారత అత్యున్నత న్యాయస్థానం. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి టీడీపీలో చేరారు. విజయవాడలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీకి రాజీనామా చేసిన పార్థసారథి.. గతంలోనే టీడీపీ చేరతానని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటి జాబితాలో తనకు టిక్కెట్ ఇవ్వడం ఆనందంగా ఉందని పార్థసారథి అన్నారు. పార్టీ నిర్ణయం ప్రకారం నూజివీడు వెళ్తున్నానని తెలిపారు. మరోవైపు.. కోటి 30 లక్షల మందితో సర్వే చేసి టిక్కెట్లు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. నాన్ లోకల్ అయినా నూజివీడులో ప్రజల…
ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు చేస్తున్న ఐవీఆర్ఎస్ సర్వేలు నాయకులకు గుబులు పుట్టిస్తున్నాయి. స్థాన బదిలీలు, కొత్త కొత్త అభ్యర్థుల పేర్ల పరిశీలనతో జరుగుతున్న సర్వేల నేపథ్యంలో పల్నాడు టీడీపీ క్యాడర్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పల్నాడు జిల్లాలోని పార్లమెంటు నియోజకవర్గంతో పాటు, నరసరావుపేట, గురజాల అసెంబ్లీ స్థానాలకు కొత్త అభ్యర్థుల పేర్లను ప్రతిపాదించింది టీడీపీ అధిష్టానం. ఇక్కడ సీనియర్ నాయకులు పేర్లను అభ్యర్థులుగా పెట్టబోతున్నాం అని సర్వేల ద్వారా పరిశీలిస్తుంది టీడీపీ.
ప్రముఖ గజల్ గాయకుడు పంకజ్ ఉదాస్ (72) అనారోగ్యంతో మరణించారు. సోమవారం ఉదయం మరణించినట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని.. ఉదయం 11 గంటల ప్రాంతంలో మరణించారని చెప్పారు. పంకజ్ ఉదాస్ మరణవార్తను చాలా బరువెక్కిన హృదయంతో మీకు తెలియజేసేందుకు చింతిస్తున్నామని ఆయన కుమార్తె నయాబ్ ఉదాస్ ఓ ప్రకటనను పోస్ట్ చేశారు.