Maruti Cars: మారుతి వ్యాగన్ ఆర్ కొనాలనుకుంటున్నారా.. కొన్ని రోజులు ఆగాల్సిందే..!
- పెరిగిన మారుతి వ్యాగన్ ఆర్ ధరలు
- 2025 ఫిబ్రవరి నెలలో రూ. 15,000 పెంపు
- మారుతి కంపెనీలో కొన్ని వేరియంట్ల ధరలు రూ.10,000 పెంపు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత మార్కెట్లో ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు మారుతి సుజుకి.. గత కొన్ని నెలల్లో పలు వాహనాల ధరలను పెంచింది. వీటిలో హ్యాచ్‌బ్యాక్ విభాగంలో బాగా పాపులర్ అయిన మారుతి వ్యాగన్ ఆర్ ధరలు కూడా పెరిగాయి. ఇది 2025 ఫిబ్రవరి నెలలో జరిగింది. కస్టమర్ల కోసం ఈ కొత్త ధరలు ఇప్పటికే అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టారు. మారుతి సుజుకి తన వ్యాగన్ ఆర్ యొక్క ధరను 15,000 రూపాయల వరకు పెంచింది. మారుతి కంపెనీలో కొన్ని వేరియంట్ల ధరలు 10,000 రూపాయల వరకూ పెరిగాయి.
Read Also: Redmi Book Pro: రెడ్ మీ నుంచి ప్రీమియం ల్యాప్ టాప్.. త్వరలో మార్కెట్‌లోకి
Also Read
- Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
- Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
- Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
- Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
ఏ వేరియంట్ల ధరలు పెరిగాయి..
మారుతి పాపులర్ వేరియంట్లలో VXI 1.0 AGS, ZXI 1.2 AGS, ZXI+ 1.2 AGS, ZXI+ AGS డ్యూయల్ టోన్ వేరియంట్ల ధరలు 15,000 రూపాయలు పెరిగాయి. మిగతా అన్ని వేరియంట్ల ధరలు 10,000 రూపాయల వరకు పెరిగాయి. మారుతి వ్యాగన్ ఆర్ తాజా ధరల విషయానికొస్తే..
బేస్ వేరియంట్ (LXI): ₹5.64 లక్షలు (ఎక్స్-షోరూమ్)
VXI: ₹6.09 లక్షలు (ఎక్స్-షోరూమ్)
ZXI: ₹6.38 లక్షలు (ఎక్స్-షోరూమ్)
LXI CNG: ₹6.54 లక్షలు (ఎక్స్-షోరూమ్)
VXI AGS: ₹6.59 లక్షలు (ఎక్స్-షోరూమ్)
ZXI+: ₹6.85 లక్షలు (ఎక్స్-షోరూమ్)
ZXI AGS: ₹6.88 లక్షలు (ఎక్స్-షోరూమ్)
VXI CNG: ₹6.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)
ZXI+ AGS: ₹7.35 లక్షలు (ఎక్స్-షోరూమ్)
పోటీ ఎవరు..?
మారుతి వ్యాగన్ ఆర్ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్రధాన వాహనాలతో పోటీ పడుతుంది. ఈ విభాగంలో మారుతి సెలెరియో, ఎస్ ప్రెస్సో, రెనాల్ట్ క్విడ్, హ్యుందాయ్ గ్రాండ్ నియోస్ ఐ10 వంటి హ్యాచ్‌బ్యాక్ కార్లు పోటీగా ఉన్నాయి. అలాగే.. టాటా పంచ్, నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కిగర్ వంటి SUV లతో కూడా వ్యాగన్ ఆర్ పోటీ పడుతుంది. అయితే.. ఈ ధరల పెరుగుదల ప్రధానంగా మార్కెట్లో రాబోయే వ్యూహాలు, కొత్త వాహనాల తయారీ ఖర్చుల పెరుగుదల కారణంగా జరుగుతున్నట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. 2025లో వాహనదారుల ఆర్థిక పరిస్థితి, మార్కెట్ డిమాండ్‌ను బట్టి ఈ ధరల పెరుగుదల అనేక మారుతి కస్టమర్లపై ప్రభావం చూపిస్తుంది.
తాజావార్తలు
-
Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
-
PM Modi: “2047 నాటికి ‘వికసిత భారతే లక్ష్యం.. We Will Do It..” దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!