LPG Crisis: రోజుకు 2 సార్లు భోజనం.. పూరీ, దోస బంద్.. హస్టల్స్‌కు ‘‘గ్యాస్ మంటలు’’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LPG Crisis: ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఇంధర సంక్షోభాన్ని సృష్టిస్తోంది. ముఖ్యంగా భారత్‌లో LPG కొరత ఏర్పడుతోంది. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టల్స్‌లు మూసేయాల్సి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎల్‌పీజీ సంక్షోభం తలెత్తకుండా కేంద్రం గృహవినియోగదారులకే ప్రాధాన్యత ఇస్తుండటంతో పెయింగ్ గెస్ట్ (PG) హాస్టల్స్ తీవ్రంగా ప్రభావం అవుతున్నాయి.
ఈ మేరకు బెంగళూర్ పీజీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. హాస్టల్స్‌లో వంట గ్యాస్ వినియోగాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకున్నాయి. దీని వల్ల హాస్టల్స్‌లో ఉన్న విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. వీక్ డేస్‌లో రోజుకు 2 సార్లు మాత్రమే భోజనం ఏర్పాటు చేస్తామని చెప్పారు. మధ్యాహ్నం లంచ్ మీరే చూసుకోవాలని హాస్టల్స్ ఉంటున్న వారికి తెలిపారు. ఇక పూరీ, దోసె, చపాతీ వంటి బ్రేక్ ఫాస్ట్‌లు చేయమని వెల్లడించారు. శని, ఆదివారాల్లో మాత్రమే మూడు పూటల భోజనం ఏర్పాటు చేస్తామని చెప్పారు.
Also Read
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
బ్రేక్‌ఫాస్ట్‌లో బిసిబిలే బాత్, చిత్రన్నం, పులిహోర వంటి బియ్యం ఆధారిత వంటకాలు, సలాడ్ల వంటివి మాత్రమే చేస్తామని పీజీ అసోసియేషన్ చెప్పింది. గ్యాస్ తక్కువగా లేదా గ్యాస్ లేకుండా చేసే వంటకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మరోవైపు ఎల్పీజీపై ఆదారపడటం తగ్గించడానికి ఇండక్షన్ స్టౌలు, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు వాడాలని పీజీ యజమానులకు అసోసియేషన్ సూచించింది. పీజీల్లో నివసించే వారు వ్యక్తిగత గ్యాస్ సిలిండర్లలో వంట చేసుకోవడాన్ని నిషేధించారు. అవసరమైతే ఇండక్షన్ స్టౌలు వాడుకోవచ్చని సూచించారు.
గ్యాస్ ఆదా చేయడానికి పొరుగున ఉండే పీజీలతో ఒకే వంటగది ఏర్పాటు చేసుకోవాలని అసోసియేషన్ సూచించింది. ఈ పరిస్థితి మరో 10-15 రోజులు కొనసాగితే నిర్వహణే కష్టం అవుతుందని చెప్పింది. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరింది. మరోవైపు, బెంగళూర్ పీఓ ఓనర్ ఈ సమాచారాన్ని వాట్సాప్ స్టేటస్‌ల ద్వారా తెలియజేయడం వైరల్ అవుతోంది.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!