Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ ‘డీసీ’కి ఏ సర్టిఫికేట్.. విడుదలకు ముందే పెరిగిన హైప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lokesh Kanagaraj: దర్శకుడిగా వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న లోకేష్ కనగరాజ్ ఇప్పుడు మరో సాహసానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు స్టార్ హీరోలను కొత్త కోణంలో చూపిస్తూ ప్రేక్షకులను అలరించిన ఆయన, ఈసారి స్వయంగా హీరోగా వెండితెరపై కనిపించబోతున్నారు. అందుకే ఆయన నటిస్తున్న తొలి చిత్రం ‘డీసీ’ని చూసేందుకు మూవీ లవర్స్ కూడా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా గురించి వస్తున్న ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పుడు విడుదలకు ముందే మరో కీలక పరిణామం చోటుచేసుకోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
లోకేష్ కనగరాజ్, వామికా గబ్బి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న క్రైమ్ రొమాన్స్ చిత్రం ‘డీసీ’కి అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్, ఎమోషన్స్, రొమాన్స్ ఎలిమెంట్స్ తో ఈ మూవీని రూపొందించినట్లు తెలుస్తోంది. మొదట ఈ సినిమాను 2026 జూలై 31న విడుదల చేయాలని మేకర్స్ ప్రకటించినప్పటికీ, కొన్ని కారణాల వల్ల విడుదలను వారం రోజులు వాయిదా వేశారు. ప్రస్తుతం ఈ చిత్రం 2026 ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
Also Read
- NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
విడుదలకు ముందు ‘డీసీ’ సెన్సార్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అయితే సెన్సార్ బోర్డు సీబీఎఫ్సీ ఈ సినిమాకు ‘ఏ’ సర్టిఫికేట్ జారీ చేసింది. కథలో ఉన్న హింసాత్మక సన్నివేశాలు, క్రైమ్ నేపథ్యం దృష్ట్యా ఈ రేటింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల తమిళంలో విడుదలకు సిద్ధమైన విజయ్ నటించిన ‘జన నాయగన్’, అలాగే ‘డెమోంటే కాలనీ 3’ చిత్రాలకు కూడా ఇదే రేటింగ్ రావడం విశేషం. ఇప్పుడు ‘డీసీ’ కూడా ఆ జాబితాలో చేరడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే అనిరుధ్ సంగీతం సినిమాపై అంచనాలను పెంచుతుండగా, కథనం పరంగా కొత్తదనం ఉండబోతుందనే సంకేతాలు కూడా ఈ సినిమాపై భారీ బజ్ ఏర్పడింది.
లోకేష్ కనగరాజ్ ఇప్పటివరకు దర్శకుడిగా ‘ఖైదీ’, ‘మాస్టర్’, ‘విక్రమ్’, ‘లియో’ వంటి విజయాలతో తనకంటూ ప్రత్యేక అభిమాన వర్గాన్ని ఏర్పరచుకున్నారు. ఇప్పుడు అదే క్రేజ్‌తో హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ‘డీసీ’పై భారీ బజ్ ఏర్పడింది. దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన లోకేష్, నటుడిగానూ అదే స్థాయిలో ఆకట్టుకుంటారా ? ఆగస్టు 7న విడుదల కానున్న ఈ చిత్రం ఆయన కెరీర్లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందా ? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
- Tags
- cinema
- Lokesh Kanagaraj
తాజావార్తలు
-
Deputy CM Pawan Kalyan: మళ్లీ వాయిదాపడిన పవన్ కల్యాణ్ పోలవరం జిల్లా పర్యటన..
-
TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
-
Red Magic 12 Pro+: 8,400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+.. RGB లిక్విడ్ కూలింగ్‌తో కొత్త గేమింగ్ ఫోన్!
-
IND vs WI 2nd T20: నేడు భారత్, వెస్టిండీస్ రెండో టీ20.. పిచ్ రిపోర్ట్, వాతావరణం, ప్లేయింగ్ 11 ఇదే!
-
Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!