Rajesh Veeramalla
Author- NTV Telugu-
Tragedy: ప్రొద్దుటూరులో విషాదం.. కుందూ నదిలో మునిగి అక్క తమ్ముడు మృతి
కడప జిల్లా ప్రొద్దుటూరులో విషాదం చోటు చేసుకుంది. రాజుపాలెం వద్ద నదిలో మునిగి అక్క తమ్ముడు గల్లంతయ్యారు. స్నానం కోసం కుందూ నదిలో దిగి మస్తాన్(27), ఇమాంబి(28) లు మృతి చెందారు. కుందు నదిలో ఇసుక కోసం తవ్విన గుంతలో పడి అక్క తమ్ముడు మృతి చెందారు. మృతులు చాగలమర్రికి చెందినవారిగా గుర్తించారు. -
CM Jagan: చంద్రబాబు వాగ్దానాలకు, శకుని చేతిలో పాచికలకు తేడా లేదు..
మేదరమెట్ల సిద్ధం సభలో చంద్రబాబుపై సీఎం జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు వాగ్దానాలకు, శకుని చేతిలో పాచికలకు తేడా లేదు అని దుయ్యబట్టారు. చంద్రబాబు.. 2014లో ఇచ్చిన హామీలు ఒక్కటైన అమలు పరిచారా ? అని ప్రశ్నించారు. మళ్లీ పొత్తు పెట్టుకుని ఇంతకు మించి హామీలు ఇచ్చి మీ దగ్గరకు రావడానికి రెడీ అయ్యారని సీఎం జగన్ తెలిపారు. ప్రజలకు మంచి చేయక పోగా ప్రజలకు మంచి చేసిన జగన్ ని టార్గెట్ చేస్తున్నారని దుయ్యబట్టారు. -
CM Jagan: త్వరలోనే మేనిఫేస్టో విడుదల.. చేసేదే చెప్తాం.. చెప్పేదే చేస్తాం
మేదరమెట్ల వద్ద వైసీపీ సిద్ధం సభలో సీఎం జగన్ ప్రసంగించారు. త్వరలోనే మేనిఫేస్టో విడుదల చేస్తామని తెలిపారు. మేం చేసేదే చెప్తాం.. చెప్పేదే చేస్తాం అన్నారు. చంద్రబాబు మేనిఫేస్టోకు.. శకుని చేతిలో పాచికలకు తేడా ఉందా..? అని దుయ్యబట్టారు. చంద్రబాబు చెప్పే అబద్దాలకు హద్దే లేదని విమర్శించారు. అధికారమంటే నాకు వ్యామోహం లేదు.. అధికారం పోతుందన్న భయంలేదు.. హిస్టరీ బుక్ లో మీ బిడ్డ పేరు ఉండాలన్నదే తన కోరిక అని సీఎం జగన్ తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాక, కరోనా లాంటి కష్టాలు… -
CM Jagan: సిద్ధం అంటే ఓ ప్రజా సముద్రం..
మేదరమెట్లలో వైసీపీ నిర్వహించిన 'సిద్ధం' సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు. మేదరమెట్లలో ఉప్పెనలా వచ్చిన జనసమూహం కనిపిస్తోంది.. సభకు వచ్చిన ప్రజల్ని చూస్తుంటే మహాసముద్రాన్ని తలపిస్తోందని అన్నారు. నాపై నమ్మకంతో వచ్చిన అందరికీ ధన్యవాదాలు.. మరో ఐదేళ్లు ఈ ప్రయాణాన్ని కొనసాగిద్దామని తెలిపారు. పేదవాడి భవిష్యత్ ను కాపాడేందుకు మీరంతా సిద్ధమేనా అని అన్నారు. పార్టీల పొత్తులతో చంద్రబాబు.. ప్రజలే బలంగా మనం తలబడుతున్నామని చెప్పారు. పేదలను గెలిపించడమే తన లక్ష్యమన్నారు. జగన్ ను ఓడించాలని వాళ్లు చూస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికలు… -
BJP: అభ్యర్థుల ఖరారుపై బీజేపీ తుది కసరత్తు.. ఏపీకి కేంద్ర మంత్రి
ఢిల్లీలో బీజేపీ-టీడీపీ-జనసేన మధ్య పొత్తు ఖరారైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఏపీలో అభ్యర్థుల ఖరారుపై బీజేపీ తుది కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నేతృత్వంలోని బృందం ఏపీకి వచ్చింది. గజేంద్ర సింగ్ షెకావత్ బృందంలో ఒడిశా ఎంపీ జై జయంత్ పాండా ఉన్నారు. అభ్యర్థుల ఎంపికపై గజేంద్ర సింగ్ షెకావత్ తో పురంధేశ్వరి భేటీ అయ్యారు. ఈ చర్చల్లో బీజేపీ అగ్ర నేతలు శివ ప్రకాష్, మధుకర్ కూడా పాల్గొన్నారు. -
YSRCP: ఎన్ని పార్టీలు ఏకమై గుంపుగా వచ్చినా సీఎం జగన్ యుద్ధానికి ‘సిద్ధం’..
ప్రకాశం జిల్లా మేదరమెట్లలో 'సిద్ధం' సభ జనసంద్రమైంది. సభ జన సునామీని తలపిస్తుంది. కాసేపట్లో సిద్ధం సభకు సీఎం జగన్ హాజరుకానున్నారు. మధ్యాహ్నం 3.25 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, నేతలు 'సిద్ధం' సభలో మాట్లాడారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ, సీఎం జగన్‌కు ప్రజల అండదండలు ఉన్నాయి.. వచ్చే ఎన్నికల్లో మన సత్తా చూపించాలని తెలిపారు. జగన్‌ను ఎదుర్కొనే దమ్ములేక పొత్తులు పెట్టుకున్నారని అనిల్ దుయ్యబట్టారు. ఎంతమంది కలిసి వచ్చినా జగన్ మరోసారి సీఎం… -
APPSC: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష హాల్ టికెట్లు విడుదల..
గ్రూప్-1 పరీక్ష హాల్ టికెట్లను ఏపీపీఎస్సీ (APPSC) విడుదల చేసింది. 18 జిల్లా కేంద్రాల్లోని పలు సెంటర్లలో ఈ నెల 17న ఉదయం 10 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండు పేపర్లకు సంబంధించిన పరీక్ష జరగనుంది. రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో మొత్తం 81 గ్రూప్- 1 పోస్టుల భర్తీకి జనవరి 28 వరకు ఏపీపీఎస్సీ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించింది. ఈ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,48,881 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులు తమ… -
Siddham Sabha: మేదరమెట్లలో వైసీపీ చివరి ‘సిద్ధం’ సభ.. భారీగా తరలివస్తున్న కార్యకర్తలు
ప్రకాశం జిల్లా మేదరమెట్లలో వైసీపీ చివరి సిద్ధం సభ కాసేపట్లో ప్రారంభం కానుంది. సభా ప్రాంగణం వద్దకు కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. ఇప్పటికే సభా ప్రాంగణం మొత్తం నిండిపోయింది. ఇంకా శ్రేణులు భారీగా తరలివస్తుండటంతో రోడ్లపై ఉండటంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. సిద్ధం సభ ప్రాంగణం నుంచి రెండు వైపులా దాదాపు ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. బస్సులు, వాహనాలు నిలిచిపోవడంతో కార్యకర్తలు, జనాలు నడుచుకుంటూ వేదిక వద్దకు చేరుకుంటున్నారు. మరోవైపు.. వీవీఐపీ వాహనాలకు సైతం తిప్పలు తప్పడం… -
Somireddy: కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ను పూర్తిగా మూసివేస్తున్నారు..
కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ ను పూర్తిగా మూసివేస్తున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి ఆరోపించారు. కాకినాడ, విశాఖపట్నం, మూలపేట, ఎన్నోర్ పోర్టులకు సంబంధించి ఎన్ని వెజల్స్ వస్తున్నాయనే విషయంపై షెడ్యూల్ వచ్చిందని తెలిపారు. కృష్ణపట్నంకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఇక్కడకు కంటైనర్లు వచ్చే అవకాశం లేదు.. కాబట్టి షెడ్యూల్ రాలేదని ఆరోపించారు. మంత్రి కాకాణి ఈ విషయంలో మోసం చేస్తున్నారని మండిపడ్డారు. -
YSRCP: పొత్తులపై వైసీపీ మంత్రులు హాట్ కామెంట్స్..
చిత్తూరు జిల్లా పెనుమూరు మండల కేంద్రంలో డీసీసీబి బ్యాంకు ప్రారంభోత్సవంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీ రెడ్డప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తులపై హాట్ కామెంట్ చేశారు. మన రాష్ట్రంలో దాదాపు అన్ని పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డి పై యుద్ధం చేస్తున్నాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కూడా పరోక్షంగా చంద్రబాబుకు మద్దతు ఇస్తుందని.. చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆ మాటలనే షర్మిలమ్మ మాట్లాడుతుందని తెలిపారు. ఈ ఐదు సంవత్సరాల్లో రెండు…
తాజావార్తలు
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
-
Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్‌పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
-
Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
-
Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!