చిత్తూరు జిల్లా పెనుమూరు మండల కేంద్రంలో డీసీసీబి బ్యాంకు ప్రారంభోత్సవంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీ రెడ్డప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తులపై హాట్ కామెంట్ చేశారు. మన రాష్ట్రంలో దాదాపు అన్ని పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డి పై యుద్ధం చేస్తున్నాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కూడా పరోక్షంగా చంద్రబాబుకు మద్దతు ఇస్తుందని.. చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆ మాటలనే షర్మిలమ్మ మాట్లాడుతుందని తెలిపారు. ఈ ఐదు సంవత్సరాల్లో రెండు…
నెల్లూరు జిల్లా వింజమూరు పట్టణంలోని వైశ్య బజార్లో ముస్లిం సోదరులు ప్రార్థనలు చేసే జామియా మసీదులో శుక్రవారం రాత్రి ముస్లిం సోదరులతో కలిసి ఉదయగిరి తెలుగుదేశం జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇమామ్ సాబ్ కాకర్ల సురేష్ చేత ప్రార్థనలు జరిపించారు. అల్లా ఆశీస్సులు ఎల్లవేళలా కాకర్ల సురేష్ ఉండాలని ఆశీర్వాదాలు అందించారు. అనంతరం ముస్లిం సోదరులను పరిచయం చేసుకున్నారు. వారికి అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.
టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై ఉమ్మడి ప్రకటన వెలువడింది. ఈ క్రమంలో చంద్రబాబు, అమిత్ షా, పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. మళ్లీ ఎన్డీయేలో చేరడం సంతోషంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, దేశానికి సేవ చేయడం కోసమే టీడీపీ - బీజేపీ- జనసేన మధ్య పొత్తు కుదిరిందని తెలిపారు. దేశ, రాష్ట్రాభివృద్ధికి మూడు పార్టీలు కట్టుబడి ఉన్నాయని అన్నారు. మోడీ, అమీత్ షా, నడ్డా, పవన్ కళ్యాణ్ కలిసి ఏపీలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అభివృద్ధిలో కొత్త శకానికి…
గత తొమ్మిదేళ్లలో ఎవిస్ ఆసుపత్రి ప్రస్థానంలో మహిళా ఉద్యోగుల పాత్ర అద్వితీయమని ఆసుపత్రి మానేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాజా.వి.కొప్పాల అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో భాగంగా శనివారం ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. రోగులకు సేవలకు సంబంధించి ఇన్నేళ్లలో నాలుగు ఫిర్యాదులు మినహా ఎటువంటి సమస్యలు లేకపోవడం విశేషమన్నారు.
నెల్లూరు GGHలో మొక్కలు నాటే కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరీ పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో మెరుగైన పాలన అందించే లక్ష్యంతో కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై పార్టీ కేంద్ర నాయకత్వానిదే తుది నిర్ణయం అని తెలిపారు. పార్టీ అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి ఎన్నికల బరిలోకి దిగుతానని ఆమె పేర్కొన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి అంబటి తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం సీఎం అని అరిచిన ఓ కాపులారా..! సీఎం అంటే చీఫ్ మినిస్టరా..?అని ప్రశ్నించారు. సీఎం అంటే సెంట్రల్ మినిస్టరా..? సీఎం అంటే చంద్రబాబు మనిషా..? సీఎం అంటే చీటింగ్ మనిషా..? అని ట్విట్టర్ వేదికగా కాపు వర్గాన్ని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.
బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుపై ఆయా పార్టీల అధినేతలు జేపీ నడ్డా, చంద్రబాబు, పవన్ కల్యాణ్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. మోడీ, బీజేపీ, టీడీపీ, జనసేన దేశ ప్రగతికి, ఏపీ ప్రజల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాయన్నారు. ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. ప్రధాని మోడీ గత 10 సంవత్సరాలుగా దేశాభివృద్ధి ప్రగతి కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నారన్నారు. బీజేపీతో టీడీపీ-జనసేన కలిసి రావడం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను చేరుకోవడానికి సహాయం చేస్తుందని తెలిపారు. బీజేపీ-టీడీపీల మధ్య పాత…
టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తులపై మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అందరూ కలిస్తే తప్ప పోటీ ఇవ్వలేమని తెలిసి రాజకీయ పార్టీలు అన్నీ ఏకం అయ్యాయని విమర్శించారు. చంద్రబాబుకు పొత్తులు కొత్త కాదని దుయ్యబట్టారు. మేలు చూసి ఓటేయమని ముఖ్యమంత్రి అడుగుతుంటే.. పొత్తు చూసి ఓటేయమని చంద్రబాబు అడుగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. KA పాల్ తప్ప అందరితోనూ పొత్తులు పెట్టుకున్న చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు.
భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ సతీసమేతంగా కలిసి ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఆదివారం బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైసీపీ 'సిద్ధం' సభ నిర్వహించనుంది. అందుకు సంబంధించి భారీఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్ని లక్షల మంది వచ్చినా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. సభాస్థలంలో సీఎం ప్రసంగం అందరికి కనబడేటట్లుగా భారీ స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో.. శనివారం మేదరమెట్ల ‘సిద్ధం’ ఏర్పాట్లను మంత్రి విడదల రజని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మూడు 'సిద్ధం' సభలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని మంత్రి విడదల రజని అన్నారు. మూడు సభలకు…