భద్రాచలంలో ప్రతిష్ఠాత్మక ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్, ఆయన కొడుకు, కూతురు ఫాంహౌస్ లు కట్టుకున్నారని విమర్శించారు. పేదలకు ఇళ్లు ఇవ్వలేదని మండిపడ్డారు. అదేవిధంగా.. భద్రాచలం దేవస్థానంను అభివృద్ధి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. మీరందరూ మంచి మెజారిటీతో బలరాం నాయక్ ను గెలిపించాలని…
సీతారామచంద్ర సన్నిధిలో ఇళ్ల కార్యక్రమానికి కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం శ్రీకారం చుట్టిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈరోజు భద్రాచలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అర్హులైన అందరికీ ఇళ్లు రాబోతున్నాయని తెలిపారు. గత పదేళ్ల కాలంలో పేద వాళ్లకు ఇళ్లు ఇచ్చిన పాపం లేదని అన్నారు. పోరాటం చేస్తామనే వారికి సవాల్ చేస్తున్నాం.. విమర్శలు చేసే మీ మెప్పు కోసం ఈ హామీలు ప్రకటించలేదని భట్టి పేర్కొన్నారు.
కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తూ వస్తుంది. అందులో భాగంగానే మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా.. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద సొంత జాగా ఉన్న వారు ఇళ్లు నిర్మించుకోవడానికి 5లక్షల రూపాయల ఆర్థిక సాయం, ఇళ్లు లేని నిరుపేదలకు స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది. రూ.22,500 కోట్లతో ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టారు.…
త్వరలో జరగబోవు ఎన్నికల సంగ్రామంలో తెలుగుదేశం జనసేన టీడీపీల కలయిక చారిత్మాత్మకమైనదని.. మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా నడిచి విజయం సాధిద్దామని ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పిలుపునిచ్చారు. వింజమూరు మండల కేంద్రం బొమ్మరాజు చెరువు తెలుగుదేశం కార్యాలయం నందు ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాకర్ల మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో దుష్ట శక్తిని సాగనంపాలంటే అందరి కలయిక ముఖ్యమని ఒక అడుగు ముందుకేసి అనుభవం ఉన్న నాయకుడు టీడీపీ అధినేత చంద్రబాబు…
మునుపెన్నడు లేని విధంగా రికార్డులు తిరగరాస్తు 50 వేల మెజార్టీతో గెలిపిస్తామని ఉదయగిరి ముస్లిం మైనార్టీ సోదరులు మహిళలు కాకర్ల సురేష్ కు భరోసా ఇచ్చారు. వింజమూరు మండల కేంద్రంలోని బొమ్మ రాజుచెరువు సమీపంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉదయగిరి ముస్లిం మైనార్టీ మహిళలు ముస్లిం సోదరులు సుమారు 500 మంది టిడిపి పార్టీలో ఉదయగిరి ఇంచార్జ్ కాకర్ల సురేష్ సమక్షంలో ఆదివారం చేరారు. ఈ సందర్భంగా ముస్లిం నేతలు మాట్లాడుతూ.. 50వేల మెజార్టీ మెజారిటీతో ఉదయగిరి పై తెలుగుదేశం జెండా ఎగరవేస్తామన్నారు. వారికి…
రేపు టీడీపీ - బీజేపీ - జనసేన పార్టీల ఉమ్మడి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు హాజరుకానున్నారు. అందుకోసమని.. రేపు ఉదయం హైదరాబాదు నుంచి రానున్నారు. రేపు ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రి షెకావత్, చంద్రబాబు, పవన్ ఉమ్మడి సమావేశం జరగనుంది. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై కసరత్తులు చేయనున్నారు. రేపటి మూడు పార్టీల అగ్ర నేతల భేటీలో ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి పాల్గొననున్నారు.
తిరుమలలో కిడ్నాప్ కు గురైన మూడేళ్ల చిన్నారి ఘటన సుఖాంతమైంది. ఈరోజు మధ్యాహ్నం ఓ మహిళ చిన్నారిని కిడ్నాప్ చేసినట్లు సీసీ టీవీ ఫుటేజ్ లో వెల్లడైంది. తెలంగాణలోని గద్వాల్ జిల్లాకు చెందిన అభినయ్ అనే మూడేళ్ల చిన్నారిని ఓ మహిళ అపహరించింది. యాత్రికుల వసతి సముదాయం 2 వద్ద చిన్నారిని ఎత్తుకెళ్లింది. దీంతో హుటాహుటిన చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా బాలుడి ఆచూకీ కోసం గాలించారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద…
రాజకీయంగా బహుజనులు చైతన్యవంతులైనప్పుడే రాజ్యాధికారం సాధ్యమవుతుందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, ఎంపీ మార్గాని భరత్ రామ్, రాజమండ్రి లోక్‌సభ వైసీపీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తదితర బీసీ సామాజిక ప్రముఖులు అభిప్రాయపడ్డారు. రాజమండ్రి వీఎల్ పురం మార్గాని ఎస్టేట్ ప్రాంగణంలో 'శెట్టిబలిజ, గౌడ ఆత్మీయ సమ్మేళనం' నిర్వహించారు. ఈ సభకు ఎంపీ భరత్ అధ్యక్షత వహించారు. రాజమండ్రి అర్బన్, రూరల్, రాజమండ్రి లోక్‌సభ స్థానాలను బీసీలకే సీఎం జగన్ కేటాయించడం శుభపరిణామమని మంత్రి చెల్లుబోయిన అన్నారు. ఈ ముగ్గుర్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత…
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. పులివెందులలో ముఖ్యమంత్రి వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేస్తారు. అధికారికంగా ఖరారైన సీఎం పర్యటన వివరాలు ఇలా..
రానున్న ఎన్నికల్లో పోటీపై మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ జీవితానికి విశ్రాంతి అవసరమనిపిస్తోందని అన్నారు. కానీ.. పార్టీ కోసం పనిచేస్తానని సీఎం జగన్ కు చెప్పానని తెలిపారు. కాగా.. ఈసారి పోటీలో ఉండాలని సీఎం అంటున్నారు.. పార్టీ కష్టకాలంలో వదిలేసానని అపవాదు తనపై రాకూడదని చెప్పారు. మూడు రోజుల క్రిందట తాను ముఖ్యమంత్రిని కలిసానని.. ఈసారి తనను ఎంపీకి పోటీ చేసి తమ బాబుని అసెంబ్లీకి పంపిద్దామని తనతో సీఎం చెప్పినట్లు తెలిపారు.