పార్లమెంట్ ఎన్నికలకు పోటీ చేసే మరో ఇద్దరు అభ్యర్థుల పేర్లను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. తాజాగా.. మల్కాజిగిరి, ఆదిలాబాద్ ఎంపీ స్థానాలను అభ్యర్థులను వెల్లడించారు. మల్కాజిగిరి పార్లమెంటు స్థానానికి రాగిడి లక్ష్మారెడ్డి పేరును ఖరారు చేయగా.. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం నుంచి ఆత్రం సక్కు పేరును గులాబీ బీస్ ప్రకటించారు. ముఖ్య నేతలతో జరిపిన చర్చల అనంతరం అభ్యర్థులను ప్రకటించారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని సీతారామ స్వామి గుట్టపై పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ శంకుస్థాపన చేశారు. రూ.74.80 కోట్లతో 2160 సింగిల్ బెడ్రూం ప్లాట్ ల నిర్మాణానికి శంకుస్థాపన, పైలాన్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ కావాలనే ఇళ్లను పూర్తి కాకుండా చేశారని అన్నారు. ప్రతీ నియోజకవర్గంలో ఏడాదికి 3500 ఇళ్ల నిర్మాణం చేస్తామని తెలిపారు. రేషన్…
తెలంగాణకు బీజేపీ ఏమీ చేసిందో మోడీ ప్రజల ముందు పెట్టబోతున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. విపక్షాలు విభజన రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. అభివృద్ది మీద, అవినీతి మీద చర్చ లేదు.. మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలు విపక్షాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి మరక లేకుండా మోడీ పాలన చేస్తున్నారని లక్ష్మణ్ పేర్కొన్నారు. ప్రధాని మోడీ 15 రోజులుగా లక్షల కోట్ల అభివృద్ధి పనులు చేపడుతున్నారు.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో అభివృద్ధి…
గ్రూప్-1 దరఖాస్తుల గడువును తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) పొడిగించింది. మరో రెండురోజుల పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దరఖాస్తులకు గురువారం చివరి రోజు కాగా.. శనివారం సాయంత్రం 5 గంటల వరకు పొడిగించింది. చివరిరోజు టీఎస్పీఎస్సీ సర్వర్ పనిచేయకపోవడంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందారు. ఈ క్రమంలో.. టీఎస్పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది.
మాజీమంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని తెలిపారు. ఇదిలా ఉంటే.. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొన్నారు. ఐదేళ్లు బీఆర్ఎస్ ను వదిలేది లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం తన వయసు 71 సంవత్సరాలని.. ఈ సమయంలో పార్టీ మారే అవకాశం లేదన్నారు. ఈ ఐదేళ్లు ప్రజా సేవ చేసి, రాజకీయాల నుంచి వైదొలుగుతానని మల్లారెడ్డి తెలిపారు.
మోడీ మీద నమ్మకంతో బీజేపీ చేవెళ్లలో భారీ మెజారిటీతో గెలుస్తుందని బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. చేవెళ్లలో తమ ఫస్ట్ రౌండ్ ప్రచారం అయిపోయిందని పేర్కొన్నారు. చేవెళ్లలో సర్వే చేయించాం.. గెలిచేది బీజేపీయేనని అన్నారు. చేవెళ్ల సీటు మోడీదే.. ఇది రాసి పెట్టుకోవచ్చని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీపై దుష్ప్రచారం జరుగుతోందని విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని అసెంబ్లీలో ఎన్నికల్లో కూడా అన్నారు.. లిక్కర్ కేసులో తాము చర్యలు తీసుకోకపోవడం వల్ల అలా…
సాయంత్రం 5 గంటలకు ఎంప్లాయిస్ అసోసియేషన్తో కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. జీవో 317, జీవో 46కు సంబంధించిన సమస్యలపై కమిటీ అధ్యయనం చేయనుంది. ఇటీవల MCRHRDలో ఉద్యోగ సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి జరిపిన చర్చల్లో 317, 46 జీవోలపై అధ్యానం చేయాలని సూచించారు. ఈ క్రమంలో.. దానికి సంబంధించిన సిఫార్సులతో కేబినెట్ సబ్ కమిటీతో చర్చలకు రావాలని ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాలకు సూచించారు.
తల్లిదండ్రులు పిల్లలను లింగ వివక్ష లేకుండా పెంచాలని.. అప్పుడే వారు ఉన్నత స్థాయికి వెళ్తారని స్త్రీ శిశు సంక్షేమ , పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మహిళా శిశు సంక్షేమ, సీనియర్ సిటిజన్స్ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు రవీంద్రభారతిలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి సీతక్కతో పాటు మహిళ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ పాటు పలువురు మహిళ అధికారిణిలు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుండి రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలకు టీజీ అని రిజిస్ట్రేషన్ అవుతుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయం అని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వాహనాలన్నీ.. ఏపీ అని ఉంటే టీజీ అని మార్చుకున్న సందర్భం ఉందని పేర్కొన్నారు. జూన్ 2న రాష్ట్రం విడిపోయే సమయంలో టీజీ అని గెజిట్ ఇచ్చారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.