Malla Reddy: వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. మాజీమంత్రి కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీమంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని తెలిపారు. ఇదిలా ఉంటే.. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొన్నారు. ఐదేళ్లు బీఆర్ఎస్ ను వదిలేది లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం తన వయసు 71 సంవత్సరాలని.. ఈ సమయంలో పార్టీ మారే అవకాశం లేదన్నారు. ఈ ఐదేళ్లు ప్రజా సేవ చేసి, రాజకీయాల నుంచి వైదొలుగుతానని మల్లారెడ్డి తెలిపారు.
Read Also: konda vishweshwar reddy: చేవెళ్లలో బీజేపీ భారీ మెజారిటీతో గెలుస్తుంది..
Also Read
- Kaveri Engine: రష్యాలో ‘‘కావేరి ఇంజన్’’ సత్తా.. భారత స్వేదేశీ ఇంజన్ సిద్ధం.!
- Congress: ప్రధాని మోదీ, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి.. సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ 5 డిమాండ్లు..
- Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
- UP Election 2027: ‘‘5 తరాల వరకు ప్రధాని కాలేరు’’.. గాంధీ కుటుంబంపై ఎస్పీ నేత సెటైర్లు..
ఇదిలా ఉంటే.. గురువారం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ను మల్లారెడ్డి కలిశారు. తన అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి, తనయుడు భద్రారెడ్డి కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి పార్టీ మారుతున్నారంటూ మళ్లీ పుకార్లు గుప్పుమన్నాయి. దీనిపై మల్లారెడ్డి స్పందించారు. ఓ ప్రయివేటు కార్యక్రమంలో ఆయనను కలిశానని.. కర్ణాటక కాంగ్రెస్ నేతను కలవడంలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని తెలిపారు. డీకే శివకుమార్ తనకు స్నేహితుడని.. బిజినెస్ పనుల మీద ఆయనను కలిసినట్లు చెప్పారు. యూనివర్శిటీ కొనుగొలు విషయంలో తనను మధ్యవర్తి తీసుకెళ్ళాడని.. ఇందులో ఎలాంటి రాజకీయం లేదన్నారు మల్లారెడ్డి.
Read Also: Supreme Court: శరద్ పవార్ పేరు, ఫొటోపై ఎన్సీపీకి కీలక ఆదేశాలు
తాజావార్తలు
-
Kaveri Engine: రష్యాలో ‘‘కావేరి ఇంజన్’’ సత్తా.. భారత స్వేదేశీ ఇంజన్ సిద్ధం.!
-
Congress: ప్రధాని మోదీ, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి.. సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ 5 డిమాండ్లు..
-
Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
-
UP Election 2027: ‘‘5 తరాల వరకు ప్రధాని కాలేరు’’.. గాంధీ కుటుంబంపై ఎస్పీ నేత సెటైర్లు..
-
Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!