ప్రత్యామ్నాయ ఆదాయం పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో లాజిస్టిక్స్ విభాగ నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరిస్తున్నామని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. వినియోగదారులకు వేగవంతమైన సేవలందించేందుకు త్వరలోనే పార్శిళ్లను ఇంటి వద్దనే పికప్, డెలివరీ చేస్తామని ఆయన చెప్పారు. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ బస్ స్టేషన్ ప్రాంగణంలో గురువారం నూతనంగా ఏర్పాటు చేసిన లాజిస్టిక్స్ మోడల్ కౌంటర్‌ను సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ ప్రారంభించారు. కొత్త కౌంటర్‌లో ఒక పార్శిల్‌ను బుకింగ్ చేసి రశీదును వినియోగదారుడికి ఆయన అందజేశారు. అనంతరం లాజిస్టిక్స్ విభాగ కొత్త లోగో,…
రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఇంట్లో కమ్మ సంఘం ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మన అనే వాళ్ళు ఉంటడం చాలా ముఖ్యం.. మిమ్మలిని చూసి గర్వ పడుతున్నా అని అన్నారు. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ.. అందరికీ న్యాయం చేస్తుందని తెలిపారు. ఎక్కడో మిస్ కమ్యూనికేషన్ అయింది.. లేకుంటే కమ్మ సామాజిక వర్గానికి న్యాయం చేస్తారన్నారు. రేవంత్ దృష్టికి తీసుకుపోతాను.. న్యాయం చేస్తారు అనే నమ్మకం ఉందని పేర్కొన్నారు. రైతు బిడ్డగా సెలవుల్లో ఊరికిపోతే పల్లెటూరులతో చాలా అనుబంధం ఉందని…
సోమవారం సీఎం రేవంత్ రెడ్డితో పాలు పలువురు మంత్రులు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న విషయం తెలిసిందే.. అయితే, పూజలో కూర్చున్న సందర్భంగా రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పెద్ద పీటలపై కూర్చోగా... డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చిన్న పీటపై కూర్చున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు గుప్పించాయి. దళిత నేతకు దేవుడి సమక్షంలో తీవ్ర అవమానం జరిగిందంటూ కామెంట్స్ చేశారు. ఈ అంశంపై భట్టి విక్రమార్క స్పందించారు.
బేగంపేట ఐటీసీ కాకతీయ హోటల్‌లో బీజేపీ ముఖ్యనేతలు పార్లమెంట్ కన్వీనర్లు, జాతీయ కార్యవర్గ సభ్యులతో అమిత్ షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్, డీకే అరుణ.. ఈటల రాజేందర్, జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. లోకసభ ఎన్నికల ప్రచార వ్యూహాలు, సభలు సమావేశాలు, నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై అమిత్ షా ఆరా తీశారు. పార్టీలో నేతల మధ్య విభేదాలు ఉంటే పక్కన పెట్టి, సమన్వయంతో పనిచేయాలని అమిత్ షా సూచించారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో అధ్యాపకుల, సిబ్బంది కొరతను తీర్చడానికి తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సాహసోపేతమైన నిర్ణయాన్ని ప్రకటించింది. 2021 నుండి రాష్ట్రంలో ఉన్న 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో ఖాళీగా ఉన్న 4356 టీచింగ్ పోస్టులను కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ప్రతిపాదికన భర్తీ చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహ సీఎం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వెంటనే స్పందించి పోస్టుల భక్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
కరీంనగర్ జిల్లా కదనభేరి సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వచ్చి బాధ పెట్టినా, ఖజానాలో డబ్బు లేకున్నా రైతుబంధు ఇచ్చామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇవ్వలేకపోతున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంత బలంగా గులాబీ జెండా ఎగిరితే అంత బలంగా తాము అభివృద్ధిపై పోరాడుతామని తెలిపారు. చట్టం ప్రకారం జిల్లాకో నవోదయ ఇవ్వాల్సి ఉన్నా.. ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలి..? అని ప్రశ్నించారు. ఐదు…
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామంలోని 60 కుటుంబాలకు చెందిన వాల్మీకులు గిద్దలూరు వైసీపీ ఇంచార్జి, మార్కాపురం శాసన సభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి సమక్షంలో వైఎస్సార్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి కుందూరు నాగార్జున రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. మండలంలో మేజర్ పంచాయతీ అయిన ముండ్లపాడు గ్రామ సర్పంచ్ పదవి విజయావకాశాలకు వాల్మీకి ఓటింగ్ కి చాలా ప్రాధాన్యత ఉంటుంది.
ఎందరో జీవితాలకు వెలుగునిచ్చి ఎమ్మిగనూరు ప్రాంత ప్రజల గుండెల్లో... చిరస్మరణీయుడుగా నిలిచిన మహనీయుడు, చేనేతల పితామహుడు స్వర్గీయ పద్మశ్రీ మాచాని సోమప్ప. ఆయన ఆశయాలు నిరంతరం కొనసాగాలంటే.. అది కేవలం ఎం.జి. కుటుంబ వారసుడు డాక్టర్ మాచాని సోమనాథ్ తోనే సాధ్యమని టీడీపీ నేతలు పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని పద్మశ్రీ మాచాని సోమప్ప బంగ్లాలో ఏర్పాటైన సమావేశంలో టీడీపీ నేతలు మాట్లాడారు. పరిశ్రమలను స్థాపించి, చేనేతల పితామహుడుగా పేరుగాంచి 1954 లో భారత రాష్ట్రపతి చేత పద్మశ్రీ జాతీయ అవార్డు అందుకుని ఎమ్మిగనూరు ప్రాంతాన్ని…
తెలంగాణ కేబినెట్ పలు కార్పొరేషన్లకు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. బలహీన వర్గాలకు న్యాయం చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చిందని తెలిపారు. అంతేకాకుండా.. అసెంబ్లీలో కులగణన ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పామని.. ముదిరాజ్ కార్పొరేషన్, యాదవ, మున్నూరు కాపు, పెరిక, గంగపుత్ర, పద్మశాలి కార్పొరేషన్.. ఏబీసీలకు కార్పొరేషన్ వైశ్య, రెడ్డి కార్పొరేషన్, మాల, మాదిగ కార్పొరేషన్, ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు.
తెలంగాణ కేబినెట్ మంగళవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. పైరవీలకు తావులేకుండా రేషన్ కార్డులను అర్హులైన పేదలకు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అంతేకాకుండా.. ఆరు గ్యారెంటీల్లో భాగంగా మరికొన్నింటిని అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించిందిని పేర్కొన్నారు. మరోవైపు.. ప్రజారాజ్యం, ప్రజలు మెచ్చుకునే విధంగా ప్రజలు కోరుకున్న విధంగా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా కొన్ని అమలు చేస్తున్నామన్నారు. ఒక్కో నియోజకవర్గంలో 3500 ఇండ్లు, సొంత ఇంటి స్థలం ఉన్న వారికి ఇస్తామని…