మోడీ మీద నమ్మకంతో బీజేపీ చేవెళ్లలో భారీ మెజారిటీతో గెలుస్తుందని బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. చేవెళ్లలో తమ ఫస్ట్ రౌండ్ ప్రచారం అయిపోయిందని పేర్కొన్నారు. చేవెళ్లలో సర్వే చేయించాం.. గెలిచేది బీజేపీయేనని అన్నారు. చేవెళ్ల సీటు మోడీదే.. ఇది రాసి పెట్టుకోవచ్చని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీపై దుష్ప్రచారం జరుగుతోందని విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని అసెంబ్లీలో ఎన్నికల్లో కూడా అన్నారు.. లిక్కర్ కేసులో తాము చర్యలు తీసుకోకపోవడం వల్ల అలా అనుకున్నారని తెలిపారు. లిక్కర్ కేసులో రాష్ట్రానికి చెందిన డబ్బులు ఉన్నాయి.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మారింది.. కాంగ్రెస్ ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు.
Cabinet Sub Committee: కాసేపట్లో కేబినెట్ సబ్ కమిటీ భేటీ.. పలు జీవోల సమస్యలపై అధ్యయనం
మరోవైపు బీజేపీలోకి.. ఇద్దరు ఎంపీపీలు, ఒక జెడ్పిటిసీ, సర్పంచ్ లు, ఇంతకంటే పై స్థాయిలో ఉన్న ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఇదిలా ఉంటే.. జితేందర్ రెడ్డికి ఎంపీ టికెట్ దక్కకపోవడంపై స్పందించారు. జితేందర్ రెడ్డి నాకు మంచి మిత్రుడు.. ఆయనకు టికెట్ రాకపోవడం బాధాకరం అని అన్నారు. వ్యక్తిగతంగా డీకే అరుణ, జితేందర్ రెడ్డి ఇద్దరూ పెద్ద లీడర్లేనని తెలిపారు. కాంగ్రెస్ కు చాలా చోట్ల క్యాండిడేట్లు దొరకట్లేదు.. అందుకే టికెట్ రాని నేతల కోసం పక్క పార్టీల వైపు చూస్తున్నారని ఆరోపించారు. జితేందర్ రెడ్డి పార్టీ మారుతారని తాను భావించడం లేదన్నారు. కాగా.. రంజిత్ రెడ్డి బీజేపీలోకి వస్తారన్నా.. తనకు అభ్యంతరం లేదన్నారు. నల్లగొండ, ఖమ్మంలో బీజేపీ గెలిచేందుకు అవకాశం ఉంది.. హైదరాబాద్ లో కూడా గెలుస్తామని ఆశిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో 12 నుంచి 13 సీట్లు గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదని తెలిపారు.
Pawan Kalyan: సినిమాలు చేసుకుందాం అంటే.. మీ అభిమానమే నాకు శాపం అయ్యింది..!
CAA పై విపక్షాలు దుష్ర్పచారం చేస్తున్నాయని విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. సీఏఏ ఎవరికీ వ్యతిరేకం కాదు.. కానీ కొన్ని పార్టీలు దీనిపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింల పౌరసత్వం కోల్పోయే ప్రమాదం ఉందని వారిని ఉసిగొల్పుతున్నారని అన్నారు. కానీ ఇది ఎవరికీ నష్టం చేకూర్చదని విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. అయోధ్య మందిరం నిర్మిస్తారని ఎవరూ అనుకోలేదు.. మోడీ చెప్పారంటే చేస్తారు అనడానికి ఇదే నిదర్శనం అని అన్నారు. సిద్ధాంతం ఉన్న పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. కొన్ని పార్టీలు అవసరాలకు ఒకలా సిద్ధాంతాలను మార్చుకుంటాయని అన్నారు. మరోవైపు.. విమోచన దినోత్సవంపై బీజేపీ ముందు నుంచి క్లారిటీ ఉంది.. కొన్ని పార్టీలు దీన్ని నిర్వహించాలా? వద్దా? ఈ పేరుతో నిర్వహించాలని కొన్నిసార్లు, నిర్వహించొద్దని కొన్నిసార్లు చెప్పాయన్నారు.