ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ -2024 లో భాగంగా జరుగుతున్నముంబై - విదర్భ ఫైనల్ మ్యాచ్ లో విధ్వంసక ఇన్నింగ్స్ తో అందరి ఫోకస్ తన పై పడేలా చేశాడు టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్. గత కొన్ని రోజులుగా అనవసర వివాదంతో ఈయన వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇంగ్లండ్ తో జరిజిన టెస్టులో ఘోరమైన ఫామ్ తో రన్స్ చేసేందుకు ఇబ్బంది పడ్డ ఈయనను పూర్తి సిరీస్ కు సెలక్ట్ చేయలేదు బీసీసీఐ. ఈ దెబ్బతో సిరీస్ మధ్యలోనే…
పెళ్లి చేసుకుని హ్యాపీగా తన భాగస్వామితో జీవించాల్సింది.. ఇంకో నాలుగు రోజుల్లో పెళ్లి.. ఇంట్లో సంబరాలు, హడవుడి ఉండాల్సింది. విషాదఛాయలతో నిండిపోయింది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఓ యువకుడు విగతజీవిగా మారాడు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కుమ్మరిగూడెం శివారు ఎస్ఆర్ఎస్పీ కెనాల్ లో మృతదేహమై కనిపించాడు. దీంతో వరుడి మిస్సింగ్ మిస్టరీ విషాదాంతం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఈనెల 16వ తేదీన తన వివాహం జరగాల్సి ఉంది. నర్సంపేటకు చెందిన యువతితో కృష్ణతేజకు వివాహం నిశ్చయించుకున్నారు. ఇంతలోనే శవమై తేలాడు.
సీఎం రేవంత్ రెడ్డికి అమిత్ షా సవాలు విసిరారు. కాంగ్రెస్ చేసిన స్కాంల లిస్ట్ పంపిస్తా.. అవినీతి జరిగిందా లేదా రేవంత్ చెప్పాలని ప్రశ్నించారు. ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేని దేశంలో ఏకైక ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ అని అన్నారు. సీఎంగా చేసినప్పుడు కూడా మోడీ పై అవినీతి ఆరోపణలు లేవని అన్నారు. పేదరిక నిర్మూలన కోసం కాంగ్రెస్ ఏమి చేయలేదని.. 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచితంగా రేషన్ ఇచ్చింది మోడీ సర్కారని అమిత్ షా పేర్కొన్నారు. కేంద్రంలో ఈసారి…
కాసేపట్లో చార్మినార్కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెళ్లనున్నారు. ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న విజయ సంకల్ప సమ్మేళనంలో పాల్గొన్న అమిత్ షా.. మీటింగ్ అనంతరం చార్మినార్ బయల్దేరి వెళ్లనున్నారు. అక్కడ భాగ్యలక్ష్మీ టెంపుల్ కు చేరుకుని .. భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకోనున్నారు అమిత్ షా. అమిత్ షా పర్యటన సందర్భంగా.. టెంపుల్ దగ్గర భారీ పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. CAA అమలు తరువాత తొలిసారి ఓల్డ్ సిటీకి వస్తున్నారు. దీంతో భద్రత కట్టుదిట్టం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం టి-సేఫ్ (T-SAFE) యాప్ ను ప్రారంభించారు. మహిళల ప్రయాణ భద్రత కోసం ఈ యాప్ ను రూపొందించారు. T-SAFE ద్వారా మహిళల భద్రత కోసం ప్రయాణ పర్యవేక్షణ సేవలను పోలీసుశాఖ అందిస్తుంది. కాగా.. అన్ని రకాల మొబైల్‌ఫోన్‌లకు అనుకూలంగా ఉండేలా ఈ యాప్ ను తయారు చేశారు. సచివాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.
బీజేపీ తెలంగాణ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొద్ది రోజుల్లోనే పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. సోషల్ మీడియాతో ప్రతి ఇంటికి మన సందేశం వెళ్ళాలి.. దేశ ప్రజలు మూడోసారి మోడీని ప్రధానిగా ఎన్నుకోబోతున్నారని పేర్కొన్నారు. రైతులు, పేదలు.. ఎవరి దగ్గరికి వెళ్లినా మోడీ మోడీ అంటున్నారని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పై వేల కోట్ల అవినీతి ఆరోపణలు వచ్చాయి.. కానీ మోడీ పై అవినీతి ఆరోపణలు లేవని అన్నారు.…
భారతదేశంలో కొంతమంది సమస్య ఎంత పెద్దదైనా సరే పరిష్కారాన్ని చిటికెలో కనిపెడతారు. సమస్య పెద్దదా లేక చిన్నదా అని తేడా లేకుండా పరిష్కారం కోసం అవసరానికి తగ్గట్టు సమస్య నుంచి బయటపడతారు. ఇకపోతే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోను చూస్తే మనకి మతిపోక తప్పదు. ఇక వీడియో విషయానికి వస్తే.. వర్షంలో వెళ్తున్న సమయంలో ఆ కార్ వైపర్స్ పాడైపోయాయి. అయితే ఆ సమయంలో కార్లో ఉన్న దంపతులు కనుగొన్న పరిష్కారం చూస్తే మాత్రం నిజంగా వారి తెలివికి జోహార్…
సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. రేపోమాపో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రానుందనే ప్రచారం నేపథ్యంలో కేబినెట్ భేటీ కానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు.. కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. కొత్త రేషన్ కార్డుల జారీపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. అంతేకాకుండా.. మహిళలకు వడ్డీలేని రుణాలతో పాటు, మహాలక్ష్మి పథకం కింద రూ.2500 ఆర్థిక సహాయంపై చర్చించే అవకాశముంది.
ఫిబ్రవరి నెల నుంచే సూర్య ప్రతాపం మొదలైంది. మార్చి నెల సగమైనా గడవక ముందే వాతావరణం మండువేసవిని తలపిస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే ఇక ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని సామాన్యుడు బెంబేలెత్తుతున్నాడు! గత ఏడాదితో పోల్చితే ఫిబ్రవరి నుంచే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం మొదలైంది. మార్చి నెలలో సాధారణం కంటే రోజువారీ ఉష్ణోగ్రతలు నాలుగైదు డిగ్రీలు ఎక్కువగానే నమోదవుతున్నాయి.
ఆయనకు ప్రజలంటే ప్రాణం.. తనను నమ్ముకున్న ప్రజల కోసం తన సొంత ఆస్తులు ఖర్చు అయినా పర్లేదు.. వాళ్లు సంతోషంగా ఉంటే చాలనుకునే పెద్ద మనసు అయినది. కేవలం డబ్బు సంపాదన కోసమే రాజకీయాలకు వచ్చి.. అవినీతి, అక్రమాలతో వందల కోట్లు దోపిడీకి పాల్పడుతూ.. తరతరాలకు సరిపడా సంపాదించుకునే నాయకులు ఉన్న కాలంలో, పదవుల్లో ఉన్నా లేకపోయినా.. కష్టపడి సంపాదించిన వందల కోట్లను సేవాకార్యక్రమాలకు ఖర్చుపెడుతున్న నిస్వార్థ ప్రజాసేవకుడు బీసీ జనార్థన్ రెడ్డి.. నంద్యాల జిల్లా రాజకీయాల్లో రాజకీయాలకతీతంగా ప్రజాభిమానం సంపాదించుకున్న బనగానపల్లె టీడీపీ…