ఏడాది క్రితం అకాల వర్షాలతో తడిచిన ధాన్యం విక్రయాల్లో పౌరసరఫరాల శాఖకు రూ.వెయ్యి కోట్లకుపైగా నష్టం వాటిల్లేలా గత ప్రభుత్వం ప్రయత్నించింది. మెట్రిక్ టన్నుకు రూ.3 వేలకుపైగా తక్కువకు టెండర్ కట్టబెట్టినా.. కొనుగోలుదారులు ఆ మొత్తం కూడా చెల్లించేందుకు ఇష్టపడలేదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ టెండర్లను రద్దు చేశారు. తాజాగా పిలిచిన టెండర్లలో గతం కన్నా ఒక్కో మెట్రిక్ టన్నుకు రూ.3 వేలు అదనంగా టెండర్లు దాఖలయ్యాయి. ఈ లెక్కన పౌరసరఫరాల శాఖకు రూ.1,110.51 కోట్లు అదనంగా సమకూరనుంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంటిపై ఈడీ సోదాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కవితపై ఈడీ రైడ్స్ మ్యాచ్ ఫిక్సింగ్ అని అన్నారు. తాము రెండు సంవత్సరాల క్రితమే కవిత అరెస్టు అవుతుందని చెప్పామని తెలిపారు. మనీష్ సిసోడియా అరెస్ట్ అయినప్పుడే కవిత అరెస్టు కావాలి.. కానీ అప్పుడు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. కవిత అరెస్టుతో వచ్చే సానుభూతితో మూడు నాలుగు సీట్లు సంపాదించవచ్చని బీజేపీ ఆశపడుతుంది.. ఇది మ్యాచ్ ఫిక్సింగ్…
ఎలక్టోరల్ బాండ్లను మొదటి నుంచి తాము వ్యతిరేకించినట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి కే. నారాయణ తెలిపారు. రాజకీయాలను ధ్వంసం చేసేందుకే ఎలక్టోరల్ బాండ్లను తీసుకొచ్చారని మండిపడ్డారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. ఎస్బీఐ వ్యవహారశైలి సరిగా లేదు.. ఎస్బీఐ దగ్గర వివరాలు అందించే టెక్నాలజీ లేదా ? అని ప్రశ్నించారు. సమయం లేదు అని దొంగలను కాపాడేందుకే ఎస్బీఐ వివరాలు సరిగా ఇవ్వలేదని విమర్శించారు. ఏ పార్టీకి ఇచ్చారో సమాచారం ఇవ్వలేదని అన్నారు. ఎవరెవరికి, పార్టీలకు ఎంత ఇచ్చారో లెక్క తేలాలని నారాయణ పేర్కొన్నారు. కార్పొరేట్…
గత కేసీఆర్ ప్రభుత్వంలో పదేళ్లు మంత్రిగా ఉండి అధికార దాహంతో అక్రమంగా సంపాదించుకున్న అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికి మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో వచ్చేందుకు ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. మాజీ మంత్రిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దంటూ నిర్మల్ జిల్లా కేంద్రంలో హస్తం పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు నివాసం వద్ద మాజీ మంత్రిని చేర్చుకోవద్దంటూ నినాదాలు చేశారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడికి వినతిపత్రం అందజేశారు. మాజీమంత్రి అతని…
హైదరాబాద్ మల్కాజ్గిరిలో పోలీస్ హై అలర్ట్ నిర్వహించారు. ప్రధాని మోడీ ఈరోజు హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ప్రధాని మోడీ విజయ సంకల్ప రోడ్ షో చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర బలగాలతో భారీ భద్రత నిర్వహించనున్నారు. మల్కాజ్గిరిలో మోడీ రోడ్ షో 1.3 కిలోమీటర్, గంట పాటు సాగనుంది. అందుకోసమని.. రెండు వేలకు పైగా10 అంచెల పోలీస్ భారీ భద్రత చేపట్టనున్నారు.
ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారుల బృందం సోదాలు నిర్వహిస్తుంది. ఈడీ అధికారులతో కలిసి ఐటీ సోదాలు చేపట్టింది. కవిత నివాసంలో నాలుగు టీమ్‌లుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో.. కవిత నివాసం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
కేంద్ర రహదారుల మౌలిక సదుపాయాల(CRIF) నిధి కింద తెలంగాణలో రోడ్ల నిర్మాణానికి రూ.850 కోట్లను కేంద్రం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు సంబంధించి మొత్తం 31 రోడ్ల నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ కార్యదర్శి కమల్ ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రతిపాదనల మేరకు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 4 రహదారుల నిర్మాణానికి రూ.107 కోట్లను విడుదల…
హైదరాబాద్ శిల్పారామం పక్కన నిరుపయోగంగా ఉన్న స్టాల్స్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. మహిళా శక్తి పథకంలో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళల ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులకు ఆదేశాలిచ్చారు. 2017 నుంచి నిరుపయోగంగా ఉన్న నైట్ బజార్ లోని 119 స్టాల్స్ ను ఇందుకు ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతు బజార్ లా స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేలా స్టాల్స్ ను తీర్చి దిద్దాలని అధికారులకు దిశానిర్ధేశం…
గొర్రెల పంపిణీ కుంభకోణంలో మరో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ అంజిలప్ప, ఏడీ కృష్ణయ్యలను అధికారులు అరెస్టు చేశారు. ఇప్పటికే ఈ స్కామ్ లో నలుగురు అధికారులను అరెస్ట్ చేయగా.. తాజాగా మరో ఇద్దరిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణలో 3 లక్షల మంది అభ్యర్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో టెట్ నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డీఎస్సీ కంటే ముందే టెట్ నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్ కు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో.. త్వరలో టెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. వీలైనంత ఎక్కువ మంది డీఎస్సీ రాసే అవకాశం కల్పించాలని సర్కార్ చూస్తోంది.