Rajesh Veeramalla
Author- NTV Telugu-
BJP: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై బీజేపీ నేతల రియాక్షన్ ఇదే..!
ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత అవినీతికి పాల్పడినందుకు ఆమె జైలుకు వెళ్లాల్సిందేనని తెలిపారు. తప్పు చేస్తే ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందేనని... ఈ రోజు సోదరి వెళ్లింది... రేపు సోదరుడు వెళ్ళవచ్చు... ఎల్లుండి తండ్రి కూడా జైలుకు వెళ్లవచ్చునని కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలను ఆయన ఓ వీడియో ద్వారా తెలిపారు. -
Nandakishore Vyas: బీఆర్ఎస్కు మరో షాక్.. పార్టీకి గోషామహల్ ఇంఛార్జి రాజీనామా
పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. ఆ పార్టీ గోషామహల్ ఇంఛార్జి నందకిషోర్ వ్యాస్ రాజీనామా చేశారు. త్వరలో కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే.. తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి, తెలంగాణ భవన్ కి ప్యాక్స్ లో పంపించారు. తాను ఇక నుంచి పార్టీలో పని చేయలేనని.. పార్టీలోని తన పోస్టుకి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నారు. -
Satyavathi Rathod: బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కై కవితపై ఈడీ దాడులు..
ఎమ్మెల్సీ కవిత ఇంటిపై ఈడీ దాడులు, అరెస్ట్ పై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కై ఎమ్మెల్సీ కవితపై ఈడీ దాడులు, అరెస్ట్ చేయడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవితను ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలన్నారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉంది.. ఇన్ని రోజులు లేనిది పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ అరెస్టులు ఏంటి అని ఆమె ప్రశ్నించారు. చట్టానికి వ్యతిరేకంగా ఈడీ వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక మలుపు..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈడీ అదుపులో ఉన్న అమిత్ అరోరా సమాచారంతో ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేశారు ఈడీ అధికారులు. గత నాలుగు రోజుల నుంచి అమిత్ అరోరా ను ఈడీ విచారిస్తుంది. సౌత్ లాబీకి సంబంధించి కీలక సమాచారాన్ని అమిత్ అరోరా ఈడీకి ఇచ్చారు. కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ లాబీ కీలకంగా వ్యవహరించింది. ఈ క్రమంలో కవితను ఈరోజు ఈడీ అరెస్ట్ చేసింది. కవితను రాత్రికి ఢిల్లీకి తీసుకొచ్చిన తర్వాత.. ఈడీ అదుపులో… -
Kavitha: ఇలాంటి అణిచివేతలు ఎన్ని జరిగిన ఎదుర్కొంటాం.. పార్టీ శ్రేణులు మనోధైర్యంతో ఉండాలి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.. సాయంత్రం 5.20 గంటల సమయంలో కవితను అరెస్ట్ చేసినట్టు ఈడీ అధికారికంగా ప్రకటించింది. సెక్షన్ 19, Pmla act కింద ఈడీ అరెస్ట్ చేశారు. కవిత నివాసం నుంచి మూడు వాహనాల్లో కవితను శంషాబాద్ ఎయిర్ పోర్టుకు తరలించారు. దుర్గంచెరువు మీదుగా శంషాబాద్ కి ఈడీ తీసుకెళ్తున్నారు. అంతకుముందు కవిత ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు కార్యకర్తలకు, అభిమానులకు నినాదాలు చేశారు. ఇలాంటి అణిచివేతలు ఎన్ని జరిగిన ఎదుర్కొంటామని కవిత తెలిపారు. పార్టీ… -
MLC Kavitha: కవిత అరెస్ట్.. ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదం
కాసేపటి క్రితమే ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో కవిత ఇంటికి కేటీఆర్, హరీష్ రావు వెళ్లారు. ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితను ఎలా అరెస్ట్ చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. కనీసం తమ న్యాయవాదినైనా అనుమతించాలి కదా అని వాదించారు. అధికారులు వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. -
Kavitha: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్.. రాత్రి ఢిల్లీకి తీసుకెళ్లనున్న ఈడీ అధికారులు
లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది ఈడీ అధికారులు సుమారు 3 గంటలకుపైగా తనిఖీలు చేసిన అనంతరం.. అరెస్ట్ చేశారు. కాగా.. కవితను ఈడీ అధికారులు ఢిల్లీకి తీసుకెళ్లనున్నారు. మరోవైపు ఈడీ సోదాల్లో భాగంగా.. కవిత రెండు ఫోన్లతో పాటు ఇంట్లో ఉన్న 16 ఫోన్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు. -
MLC Kavitha: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. ఈడీ అదుపులో కవిత..!
లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను అదుపులోకి తీసుకుంది. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది ఈడీ అధికారులు సుమారు 3 గంటలకుపైగా తనిఖీలు చేసి.. కవితను అదుపులోకి తీసుకున్నారు. సోదాల్లో భాగంగా.. కవిత రెండు ఫోన్లతో పాటు ఇంట్లో ఉన్న 16 ఫోన్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు. -
Soma Bharat: కవిత ఇంట్లో ఈడీ సోదాలపై న్యాయవాది ఏమన్నారో తెలుసా..?
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ అధికారులు మూడు గంటలకుపైగా సోదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈడీ అధికారులు వచ్చారని తెలుసుకున్న కవిత తరఫు న్యాయవాది సోమా భరత్ ఆమె ఇంటికి వచ్చారు. అయితే ఈడీ అధికారులు ఆయనను లోపలికి అనుమతించలేదు. ఈ క్రమంలో సోమ భరత్ కుమార్ మాట్లాడుతూ.. ఢిల్లీ నుండి ఈడీ అధికారులు ఇలా రావడం కరెక్ట్ కాదన్నారు. సుప్రీంకోర్టులో కవిత కేసు పెండింగ్ ఉంది.. పెండింగ్ లో కేసు ఉండగా ఈడీ అధికారులు ఎలా కవిత ఇంటికి వస్తారని ప్రశ్నించారు.… -
Civil Supplies Department: ధాన్యం తాజా టెండర్లతో పౌరసరఫరాల శాఖకు రూ.1,110.51 కోట్ల లాభం..
ఏడాది క్రితం అకాల వర్షాలతో తడిచిన ధాన్యం విక్రయాల్లో పౌరసరఫరాల శాఖకు రూ.వెయ్యి కోట్లకుపైగా నష్టం వాటిల్లేలా గత ప్రభుత్వం ప్రయత్నించింది. మెట్రిక్ టన్నుకు రూ.3 వేలకుపైగా తక్కువకు టెండర్ కట్టబెట్టినా.. కొనుగోలుదారులు ఆ మొత్తం కూడా చెల్లించేందుకు ఇష్టపడలేదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ టెండర్లను రద్దు చేశారు. తాజాగా పిలిచిన టెండర్లలో గతం కన్నా ఒక్కో మెట్రిక్ టన్నుకు రూ.3 వేలు అదనంగా టెండర్లు దాఖలయ్యాయి. ఈ లెక్కన పౌరసరఫరాల శాఖకు రూ.1,110.51 కోట్లు అదనంగా సమకూరనుంది.
తాజావార్తలు
-
TSLPRB: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల తేదీలు ఖరారు.. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలు ఎప్పుడంటే..
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
-
Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
-
Prithvi Shaw: యువ క్రికెటర్ పృథ్వీ షా–ఆకృతి అగర్వాల్ సంచలన నిర్ణయం.. పెళ్లికి ముందే బ్రేకప్..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!