విశాఖలో న్యాయ సాధన సభ నిర్వహించారు. ఈ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ పెత్తందార్లు వచ్చి తెలుగు గడ్డ మీద ఇటుక ముక్క కూడా తీసుకుని వెళ్ళలేరని విమర్శించారు. విశాఖ ఉక్కును ఎవరు టచ్ చేయలేరని అన్నారు. వైఎస్సార్ సంకల్పం నిలబెట్టిన వాళ్ళే వారసులు.. అందుకు విరుద్ధంగా వ్యవహరించే వాళ్ళు ఏ విధంగా వారసులు అవుతారో చెప్పాలని పేర్కొన్నారు. మరోవైపు.. రాజధాని ఎక్కడో చెప్పలేని పరిస్థితి రాష్ట్రానికి దాపురించింది.. తెలంగాణ, ఆంధ్రలో ఢిల్లీ వెళ్లి…
టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీలో చేరారు. ఆయనతో పాటు కుమారుడు రాఘవరెడ్డి, కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి, అద్దంకి వైసీపీ నేతలు బాచిన కృష్ణ చైతన్య, గరటయ్య టీడీపీలో చేరారు. వారికి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు చంద్రబాబు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి.. సైకో పాలన పోవాలి ఎన్డీఏ పాలన రావాలన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. మాగుంట రాకతో ప్రకాశం జిల్లా…
ఇసుక పాలెంలో ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో టీడీపీ-జనసేన సైనికులు భారీగా తరలివచ్చారు. ఇసుక వేస్తే రాలనంతా జనం వచ్చి, దారి పొడవునా నీరాజనాలు పలికారు. బాణా సంచాల మోతలతో ఇసుకపాలెం పరిసర ప్రాంతాలు దద్దరిల్లిపోయింది. ఈ సందర్భంగా.. కాకర్ల సురేష్ రైతు కూలీలతో మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వస్తే వ్యవసాయం పండుగ అవుతుంది, రైతుల కష్టం తీరుతుందని అన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత.. ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. దరఖాస్తు చేసిన వారికి నెలాఖరులోగా ఓటరు కార్డులు అందిస్తామని తెలిపారు. ఈసారి ఆన్ లైన్లో నామినేషన్ ఫారంలు ఫిలప్ చేసుకోవచ్చుని తెలిపింది. కానీ ప్రింటవుట్ తీసుకుని ఆర్వోకు ఫిజికల్ గా అందించాల్సిందేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో 46వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఓటరు గుర్తింపు కార్డు లేకుంటే 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తెలిపారు.…
ఎన్నికల షెడ్యూల్ విడుదలపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. జగన్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది.. పోలింగే మిగిలిందని తెలిపారు. ఇక రాష్ట్రానికి అన్నీ మంచి రోజులే.. 5 ఏళ్లుగా 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు ఎదురు చూసింది ఈ రోజు కోసమేనని పేర్కొన్నారు. ఒక్క ఛాన్స్ ప్రభుత్వానికి ఇక నో ఛాన్స్ అని ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ప్రజాగళం వినిపించే రోజు వచ్చిందని అన్నారు. నవశకం వైపు ప్రయాణంలో తొలి అడుగుకు స్వాగతం పలుకుదాం అని చంద్రబాబు ట్వీట్…
రాజోలు జనసేన అభ్యర్థిత్వంపై వివాదం ముదురుతుంది. ఈ క్రమంలో.. బొంతు రాజేశ్వరరావు వర్గం రోడ్డెక్కింది. జనసేన అభ్యర్థిత్వంపై జనసేన నాయకులు, కార్యకర్తలు ఇప్పటికే రెండు వర్గాలుగా విడిపోయారు. బొంతు, దేవా వర్గాలు సీటు తమదంటే తమదంటూ పోటాపోటీగా ప్రచారాలు చేసుకుంటున్నారు. మలికిపురంలో బొంతు రాజేశ్వరరావు ఇంటి నుంచి ఆయన వర్గం మలికిపురం వెంకటేశ్వర స్వామి గుడి వరకు ర్యాలీ నిర్వహించారు.
ఏపీతో పాటు తెలంగాణలో ఒకేరోజు ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలతో పాటు ఇటీవల కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత చనిపోయిన సంగతి తెలిసిందే. దాంతో అక్కడి స్థానం ఖాళీ కాగా.. ఆ అసెంబ్లీ స్థానానికి కూడా మే 13న ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. మే 13న అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. లోక్ సభతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను సీఈసీ విడుదల చేసింది. ఈసీ ప్రకటనతో రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ టికెట్.. చేనేతల బీసీ నేత డాక్టర్ మాచాని సోమనాథ్ కు కేటాయించాలని బీసీ, చేనేత నాయకులు కోరుతున్నారు. ఈ క్రమంలో.. ఎమ్మిగనూరు పట్టణంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి పద్మశ్రీ మాచాని సోమప్ప విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ ర్యాలీలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ విభజన ఏపీ విభజన చట్టం-2014 నియమనిబంధనలకు అనుగుణంగా పూర్తయినట్టు రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇరు రాష్ట్రాలకు పంపిన లేఖను ఆయన మీడియాకు విడుదల చేశారు. రెండు రాష్ట్రాల నడుమ ఆస్తుల పంపకంలో భాగంగా ఆప్షన్-జీ కి ఇరు రాష్టాలు అంగీకారం తెలపడంతో విభజన పూర్తయినట్టు కేంద్రం ఈ లేఖలో తెలిపింది.