టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో బొప్పూడిలో ప్రజాగళం బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ప్రధాని మోడీ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఏపీ అభివృద్ధి లేక అప్పులతో నలుగుతోందని ఆరోపించారు. దాష్టీకాలతో ఏపీ ఇబ్బందులు పడుతోందని తెలిపారు. ఇలాంటి సందర్భంలో ఏపీకి మోడీ రాక ఆనందాన్ని కలిగించిందని అన్నారు. ప్రధానిగా మోడీ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని పవన్ కల్యాణ్ తెలిపారు.
'ప్రజాగళం' సభ యావత్ ప్రాంగణం పెమ్మసాని ప్రభంజనంతో మార్మోగింది. స్వాగత సన్నాహక ఏర్పాట్లలో భాగంగా ఉంచిన ఫ్లెక్సీలు, తోరణాలతో పాటు కటౌట్లు సభ వద్ద ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కోరుతూ టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి ఆధ్వర్యంలో 'ప్రజాగళం' భారీ బహిరంగ సభను చిలకలూరిపేట వద్ద గల బొప్పూడి ప్రాంతంలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
కరీంనగర్లోని మమత థియేటర్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ‘‘రజాకార్’’ సినిమాను వీక్షించారు. ‘‘రజాకార్’’ సినిమా నిర్మాత గూడూరు నారాయణరెడ్డి, డైరెక్టర్ యాట సత్యనారాయణ, సినీ నటులు రాజ్ అర్జున్ (మెయిన్ యాక్టర్), బలగం సంజయ్, గిరి, కాస్ట్యూమ్ డిజైనర్ పూజ(కరీంనగర్) తదితరులు సైతం ఈరోజు బండి సంజయ్ తో కలిసి సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కొంతమంది కూహన సెక్యులర్ వాదులు తెలంగాణ చరిత్రని మరుగున పెట్టారని ఆరోపించారు. నిజామే గొప్పవాడని కీర్తిస్తున్నారని…
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి ముంబాయి వెళ్లాల్సిన ఇండిగో విమానం (6E5099) ఆలస్యం అయింది. మధ్యాహ్నం 2:30 గంటలకు ముంబై వెళ్లాల్సిన విమానంలో సాంకేతికలోపం తలెత్తింది. విమానంలోని ఇంజన్ లో ఓవర్ హీట్ సమస్య రావడంతో ఏసీ సమస్య మొదలై.. విమానం అలస్యం అయింది.
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. సుమారు 3353 గ్రాముల బంగారాన్ని సీజ్ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. సీజ్ చేసిన బంగారం విలువ రూ.1.92 కోట్ల వరకు ఉంటుందని తెలిపారు. విదేశీ ప్రయాణీకులు బంగారాన్ని పేస్టుగా మార్చి లగేజ్ బ్యాగ్ లో దాచి పట్టుకొస్తుండగా తనిఖీలు చేపట్టడంతో బట్టబయలైంది. దుబాయ్ నుండి తీసుకొచ్చిన బంగారాన్ని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని వాష్ రూమ్ వద్ద మరో వ్యక్తికి అప్పగిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇతర పార్టీల్లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. వర్థన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో చేరారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆరూరి పార్టీ వీడకుండా.. బీఆర్ఎస్ సీనియర్ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నిన్న బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. ప్రధాని మోడీ చేస్తున్న అభివృద్ధిని చూసే…
వీధికుక్కలు సైరవిహారం చేస్తున్నాయి. మనుషులు కనిపిస్తే చాలు ఎక్కడ పడితే అక్కడ కండలు పీకేస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారులపై కుక్కల దాడులు ఎక్కువైపోయాయి. హైదరాబాద్ నగరంలోని ప్రజలపై కుక్కుల దాడి మరీ ఎక్కువైంది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ సంఘటన శామీర్ పేట అద్రాస్ పల్లి గ్రామంలో చోటు చేసుకుంది.
వైసీపీ మేనిఫెస్టో రూపకల్పన తుది దశకు చేరుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 20న సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేస్తారని తెలిపాయి. ఇవాళ 175 అసెంబ్లీ, 24 ఎంపీ స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడటంతో ప్రచారం ప్రారంభించేందుకు YCP రూట్ మ్యాప్ సిద్ధం చేస్తోంది.
విశాఖలో నిర్వహించిన న్యాయ సాధన సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి, మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం, సీపీఐ నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ కు నలుగురు పాడేకట్టారని ఆరోపించారు. ఆ పాపంలో మోడీ, చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ ఉన్నారని తెలిపారు. ఉక్కును అమ్మకానికి పెడితే అడ్డుకోలేని వీళ్ళందరినీ ఉరితీయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో మోస పూరిత పార్టీలకు పాతర వేయాలని…
పార్టీ అధినాయకత్వం ఏం చెబితే అది చేస్తానని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు తెలిపారు. పార్టీ అప్పజెప్పిన బాధ్యతలను నెరవేరుస్తా.. పార్టీ ఏం నిర్ణయం తీసుకున్నా దాన్ని అంగీకరించాలని చంద్రబాబు చెప్పారు.. తాను సరేనన్నానని పేర్కొన్నారు. చీపురుపల్లా ఎంపీనా.. లేక ఎచ్చెర్ల అనేది కాదు.. ఏం చెబితే అది చేస్తానన్నారు. రాజకీయాల్లో ఎప్పుడూ కొన్ని శక్తులు ఉంటాయి.. దాని గురించి తానేం మాట్లాడనని తెలిపారు. ఓసారి ముందు ప్రకటించొచ్చు.. ఓసారి చివర్లో ప్రకటన రావచ్చని పేర్కొన్నారు.