జితేందర్ రెడ్డి పార్టీ మార్పుపై బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీలో పెద్ద పెద్ద పదవులు అనుభవించి... పార్టీకి సిద్దాంతం లేదని మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కొడుక్కి సీటు ఇస్తే సిద్దాంతం ఉన్న పార్టీ.. నీకు సీటు ఇవ్వక పోతే సిద్దాంతం లేదా అని ప్రశ్నించారు. ఏ ఆర్థిక ప్రయోజనాలు కోసం మీరు పార్టీ మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ బంధువులు కంపెనీ అమ్ముతున్న ఫ్లాట్స్ ఏమీ.. చేవెళ్ల పార్లమెంట్ ఎంపీతో కలిసి ఏమీ మాట్లాడారు.. ఈస్టర్న్ కన్స్ట్రక్షన్…
బీఆర్ఎస్ పై పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని విమర్శించారు. పదేళ్ల పాటు విచ్చలవిడిగా ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆర్ కాదా..? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీ చివరకు సీపీఐ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోలేదా..? అని మండిపడ్డారు. తెలంగాణ పునర్ నిర్మాణం పేరుతో శాసనసభ్యులను చేర్చుకున్నది మీరు కాదా..? పదేళ్లలో ఇతర పార్టీల నుంచి మొత్తం 39 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ చేర్చుకుందని…
హైదరాబాద్ పాతబస్తీ మీర్‌చౌక్ ఆఘా కాలనీలో దారుణ హత్య కలకలం రేపుతోంది. ఓ ఇంట్లో షేక్ వాజిద్ అనే వ్యక్తిని నిసార్ అహ్మద్ అనే వ్యక్తి కత్తితో దాడి చేసి హతమార్చాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం సహాయంతో దక్షిణ మండలం డీసీపీ సాయి చైతన్య, మీర్ చౌక్ ఏసీపీ వెంకటేశ్వర రావు పరిశీలించారు. హత్యకు గల కారణాలు ఆర్థిక లావాదేవీలే అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
చాలా రోజుల తర్వాత చెడ్డీ గ్యాంగ్ సంచారం మళ్లీ కలకలం రేపుతోంది. శనివారం అర్ధరాత్రి మియాపూర్లో చెడ్డీ గ్యాంగ్ హల్ చల్ చేసింది. వరల్డ్ వన్ స్కూల్ లోకి కొంతమంది చెడ్డీలు ధరించి.. ముఖానికి మాస్క్ కట్టుకుని పదునైన ఆయుధాలతో ఒంటిమీద బట్టలు లేకుండా చొరబడ్డారు. అనంతరం స్కూల్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లో గల కౌంటర్ లో ఉన్న 7 లక్షల 85 వేల నగదును దొంగలు దోచుకెళ్లారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని పిటిషన్ సమర్పించేందుకు బీఆర్ఎస్ సిద్దమైంది. అందుకోసమని.. స్పీకర్ ను కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరారు. దీంతో స్పీకర్ సాయంత్రం 6 గంటలకు అపాయింట్మెం
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేవి చెండాలమైన పనులు అనే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారం ఉందని దుయ్యబట్టారు. పార్టీలు మారితే రాళ్లతో కొట్టాలన్న రేవంత్.. ఇప్పుడు తన పార్టీలోనే జాయిన్ చేసుకుంటున్నాడని విమర్శించారు. గతంలో చట్టబద్దంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల ఇంటి ఎదుట చావు డప్పు కొట్టిన రేవంత్.. ఇపుడు ఇలా చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు.
ఢిల్లీ ఈడీ కార్యాలయంలో కవిత మొదటి రోజు విచారణ పూర్తి అయింది. విచారణ సందర్భంగా ఈడీ అధికారులు వీడియో రికార్డింగ్ చేశారు. విచారణ తర్వాత కవితను ఆమె భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, బావ హరీశ్ రావు కలిశారు. కవిత యోగ, క్షేమాలను వీరు కనుక్కున్నారు. ఈ కేసులో న్యాయపోరాటం చేద్దామని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా న్యాయవాది మోహిత్ రావు కూడా కవితను కలిశారు. ఇదిలా ఉంటే.. రేపు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత భర్త కంటెంప్ట్ అఫిడవిట్ దాఖలు చేయనున్నారు. ఈడీ అరెస్ట్‌ను…
గత ఎన్నికల్లో గోశామహల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుండి ఒక నార్త్ ఇండియన్కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని తమ అధినేత కేసీఆర్ నిర్ణయించారని... ఆ నిర్ణయం మేరకే నంద కిషోర్ వ్యాస్ ( బిలాల్ ) కు టికెట్ కేటాయించారని గోశామహల్ బీఆర్ఎస్ నాయకుడు ఎమ్.ఆనంద్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రచారంలో కూడా కేటీఆర్ రెండు సార్లు నియోజకవర్గంలో ప్రచారం చేశరని గుర్తు చేశారు. అయితే నందు బిలాల్ అసమర్థత వల్ల గెలిచే సీటు ఓడిపోవాల్సి వచ్చిందన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు చేయడం కోసం ప్రజలు అనేక త్యాగాలు చేశారు.. అనేక బలి దానాలు త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణ మొదటి పది సంవత్సారాలు కేసీఆర్ చేతిలో బంది అయ్యిందని ఆరోపించారు. అరాచకాలకు తెలంగాణ సమాజం ఏ రకంగా ఇబ్బంది పడిందో అందరికీ తెలుసు.. ధర్నా చౌక్ లో ధర్నా చేయడానికి కూడా అవకాశం లేకుండా చేశారని దుయ్యబట్టారు. తెలంగాణ కోసం గజ్జె కట్టిన వారే కేసీఆర్ ను వ్యతిరేఖించారన్నారు.…
ఏపీలో గెలుపు ఎన్డీయేదేనని ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కన్నారు. కూటమికి మోడీ అండ ఉందన్నారు. మోడీ క్రమశిక్షణను చూసి అందరూ నేర్చుకోవాలన్నారు. మూడు పార్టీల జెండాలు వేరు కానీ, మా అజెండా ఒకటేనన్నారు. ఏపీ కోసం మూడు పార్టీలు జట్టు కట్టాయన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధే మా అజెండా అని పేర్కొన్నారు. ఇది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సభ అని ఆయన తెలిపారు. మోడీ అంటే భవిష్యత్, మోడీ అంటే ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసమని వెల్లడించారు.