ఐపీఎల్ 2024లో భాగంగా.. రెండో మ్యాచ్ లో ఢిల్లీపై పంజాబ్ గెలిచింది. 4 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. 19.2 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో సామ్ కరణ్ (63), లివింగ్ స్టోన్ (38*) పరుగులతో రాణించడంతో జట్టు విజయం సాధించింది. 175 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు.. ఓపెనర్లు శిఖర్ దావన్ (22), బెయిర్ స్టో (9) పరుగులు చేశారు. ఆ తర్వాత ప్రభుసిమ్రాన్ సింగ్ (26), జితేష్ శర్మ (9), హర్ప్రీత్ బ్రార్ (2) పరుగులు చేశారు. ఢిల్లీ బౌలింగ్ లో ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీశారు. ఇషాంత్ శర్మకు ఒక వికెట్ దక్కింది.

SRH vs KKR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్..
అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. చివరలో అభిషేక్ పోరల్ (32) పరుగులతో రాణించాడు. చివరి ఓవర్లోనే 4,6,4,4,6,1 పరుగులు చేశాడు. దీంతో ఢిల్లీ జట్టు పోరాడే స్కోరు చేసింది. ఢిల్లీ బ్యాటింగ్ లో ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (29), మిచెల్ మార్ష్ (20) పరుగులు చేసి మంచి ఆరంభాన్ని అందించారు. ఆ తర్వాత ఫస్ట్ డౌన్ బ్యాటింగ్ కు దిగిన షై హోప్ (33) పరుగులతో రాణించాడు. ఇక.. 15 నెలల తర్వాత బ్యాట్ పట్టిన రిషబ్ పంత్ (18) పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ (21) పరుగులు చేసి జట్టు స్కోరును పెంచాడు.
ఇక.. పంజాబ్ కింగ్స్ బౌలింగ్ లో అర్ష్ దీప్ సింగ్, హర్షల్ పటేల్ తలో రెండు వికెట్లు సాధించారు. కగిసో రబాడ, హర్ ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్ తలో వికెట్ సంపాదించారు.
Viral Video : ‘కుర్చీ మడత పెట్టి ‘ సాంగ్ కు పెళ్లి కూతురు అదిరిపోయే స్టెప్పులు.. వీడియో వైరల్..