ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలలో మరోసారి బాలికలు సత్తా చాటారు. రాష్ట్రవ్యాప్తంగా 2803 పాఠశాలలో విద్యార్థులకు 100% ఉత్తీర్ణత సాధించగా.. రాష్ట్ర వ్యాప్తంగా 17 స్కూల్స్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు. ఇదిలా ఉంటే.. ఏలూరుకు చెందిన ఆకుల వెంకట నాగసాయి మనస్వి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 600 మార్కులకు 599 మార్కులు సాధించి రికార్డు క్రియేట్ చేసింది. దీనితో ఆ అమ్మాయి స్టేట్ టాపర్ గా నిలిచింది. ఆకుల వెంకట నాగ సాయి మనస్వికి కేవలం సెకండ్ లాంగ్వేజ్…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన లక్నో.. ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఉదయగిరి తహసిల్దార్ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా కాకర్ల సురేష్ సోమవారం మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు నామినేషన్ దాఖలు చేశారు. అతిరథ మహారధులు వెంట నడువగా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు ఉదయగిరి కొండంత అభిమానాన్ని చాటగా.. అందరికీ అభివాదం చేస్తూ కాకర్ల సురేష్ ఉదయగిరి తహసిల్దార్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.
అమెరికాలోని అరిజోనాలోని లేక్ ప్లెసెంట్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనగా.. ఈ ఘటనలో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. శనివారం రాత్రి ఈ ఇద్దరు తమ మిత్రులతో కలిసి విశ్వవిద్యాలయం నుంచి ఇంటికి కారులో వస్తుండగా ఓ గుర్తు తెలియని వాహనం వీరి కారును బలంగా ఢీ కొట్టింది. కాగా.. ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. మృతులు నివేష్ ముక్కా (19), గౌతమ్ పార్సీ (19)గా గుర్తించారు. వారు అమెరికాలో అంతర్జాతీయ…
ఉపాధి కోసం సౌదీ అరేబియాలో పని చేస్తున్న ఓ వ్యక్తి.. తన భార్య అక్రమ సంబంధానికి సంబంధించిన వీడియోలు బయటపడ్డాయి. దీంతో హుటాహుటిన అక్కడి నుంచి ఇండియాకు వచ్చాడు. ఈ తతంగాన్ని ప్రశ్నించేందుకు స్వదేశానికి వచ్చిన భర్తపై భార్య ప్రియుడితో కలిసి దాడి చేయించింది. ఈ ఘటన యూపీలోని బులంద్‌షహర్‌లోని కొత్వాలి దేహత్ ప్రాంతంలో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. తన భార్య ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని.. ఈ క్రమంలో తన మొబైల్ ఫోన్ లో వారిద్దరికీ సంబంధించిన ఓ…
ఐపీఎల్ 2024లో కేకేఆర్ తరుఫున ఆడుతున్న వెస్టిండీస్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ కీలక ప్రకటన చేశాడు. తాను టీ20 ప్రపంచకప్ లో రీఎంట్రీ ఇవ్వనున్నాడనే వార్తలపై స్పందించాడు. తిరిగి మళ్లీ వెస్టిండీస్ జట్టులోకి రాలేనని.. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పాడు. రీఎంట్రీకి తలుపులు మూసుకుపోయాయని అన్నాడు. ఈ విషయమై నరైన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ బహిరంగ ప్రకటన విడుదల చేశాడు.
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం గంగూరు వైసీపీ ప్రధాన కార్యాలయంలో మంత్రి జోగి రమేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ప్రభంజనం ఏ విధంగా వీస్తుందో.. రాష్ట్రంతో పాటు దేశంలో ఉన్న ప్రముఖ సర్వే సంస్థలు కూడా వైసీపీ గెలుస్తుందని చెబుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా పార్టీ చూడం, కులం చూడం.. జగనన్నకు మాత్రమే ఓటు వేస్తామని చెబుతున్నారని తెలిపారు.
ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్.. 18.4 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ కోల్పోయి 183 పరుగులు చేసి తమ ఖాతాలో మరో విజయాన్ని వేసుకుంది. యశస్వి జైస్వాల్ అద్భుత సెంచరీతో రాణించడంతో అలవోకగా విజయం సాధించింది. జైస్వాల్ (104*) పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 7 సిక్సులు, 6 ఫోర్లు ఉన్నాయి. తన భాగస్వామి సంజూ శాంసన్ (38*)పరుగులతో రాణించాడు.…
ఏపీలో నాల్గవ రోజు నామినేషన్ల ప్రక్రియ ఉత్సహంగా సాగింది. నామినేషన్ల దాఖలకు ముందు కొందరు అభ్యర్థులు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి నామినేషన్ దాఖలు చేశారు. కార్యకర్తల నడుమ భారీ ర్యాలీలతో వెళ్లి నామినేషన్ల ప్రక్రియ కొనసాగించారు. అధికార, విపక్ష పార్టీలతో పాటు కొందరు స్వతంత్ర అభ్యర్థులు కూడా నామపత్రాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. ఇప్పటి వరకు ఏపీలో 25 లోక్ సభ స్థానాలకు 293 నామినేషన్లు దాఖలు అయ్యాయి. అంతేకాకుండా.. 175 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇప్పటి వరకు 1626 నామినేషన్లు దాఖలు అయ్యాయి.…
ఐపీఎల్ 2024లో భాగంగా.. రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 179 పరుగులు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి రాజస్థాన్ ముందు 180 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ముంబై బ్యాటింగ్ లో ఒకానొక సమయంలో 40 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ముంబై ఇండియన్స్ ను తిలక్ వర్మ (65) దూకుడు బ్యాటింగ్ తో ఆదుకున్నాడు. అతనితో పాటు నేహాల్ వధేరా (49) పరుగులు చేయడంతో.. ముంబై 179 పరుగులు చేసింది.