Rajesh Veeramalla
Author- NTV Telugu-
Inter Students Suicide: క్షణికావేశంలో విద్యార్థులు బలి.. తల్లిదండ్రులకు కడుపుకోత
తెలంగాణలో ఇంటర్ లో ఫెయిల్ అయినందుకు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మెదక్ జిల్లాలో ఓ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. ఇంటర్ లో ఫెయిల్ కావడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. శేరిపల్లి సమీపంలో రమ్య అనే విద్యార్థిని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. మరోవైపు.. మంచిర్యాల జిల్లాలో రెండు వేర్వేరు చోట్ల ఇద్దరు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దొరగారి పల్లి గ్రామానికి చెందిన ఘటిక తేజస్విని అనే విద్యార్థిని.. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలో ఫెయిల్ అయిన కారణంగా మనస్థాపంతో ఉరివేసుకొని… -
Patnam Suneetha Mahender Reddy: మల్కాజిగిరిని అభివృద్ధి పరిచి, ప్రజల మన్నన పొందాలని దేవున్ని కోరుకున్నా..
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అహంకారాన్ని దించాలంటే కాంగ్రెస్కు చురకలు పెట్టాల్సిందేనని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ మేడలు వంచుతామన్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడినా, గెలిచినా.. ప్రభుత్వం పడిపోదని తెలిపారు. అహంకారం మత్తులో ఉన్న కాంగ్రెస్ ను ఓడించాలని దుయ్యబట్టారు. రైతుబంధు, ఆరు గ్యారెంటీలు అన్ని తుపాకీ మాటలేనని ఆరోపించారు. మీ మోసాలకు గుణపాఠాలు తప్పవని హెచ్చరించారు. -
Anna Rambabu: సంక్షేమం కావాలంటే జగనన్నే రావాలి..
గత ఐదేళ్లుగా రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకోవాలని మార్కాపురం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలిపారు. మంగళవారం పొదిలి మండలంలోని ఓబులక్కపల్లి, కొండాయపాలెం, సలకనూతల, దొడ్లేరు, మూగచింతల, భట్టువారిపాలెం, మాదిరెడ్డిపాలెం, నందిపాలెం గ్రామాల్లో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నా రాంబాబు పాల్గొన్నారు. -
CSK vs LSG: ఉత్కంఠపోరులో లక్నో విజయం.. సెంచరీతో ఆదుకున్న స్టోయినీస్
ఐపీఎల్ 2024లో భాగంగా.. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ఘన విజయం సాధించింది. 211 పరుగుల లక్ష్యాన్ని కేవలం 4 వికెట్లు కోల్పోయి చేధించింది. లక్నో బ్యాటింగ్ లో స్టోయినీస్ సెంచరీ సాధించడంతో లక్నో గెలుపొందింది. ఒకానొక సమయంలో మ్యాచ్ చెన్నై వైపు ఉన్నప్పటికీ.. సీఎస్కే బౌలర్లపై స్టోయినీస్ విరుచుకుపడ్డాడు. 63 బంతుల్లో 124 పరుగులు చేసి అజేయంగా మ్యాచ్ ను గెలిపించాడు. అతని ఇన్నింగ్స్ లో 6 సిక్సులు, 13 ఫోర్లు ఉన్నాయి. -
Raghurama Krishna Raju: అధికారంలోకి రాబోయేది ఎన్డీఏ కూటమే..
తిరుపతిలో ఎంపీ రఘురామ కృష్ణంరాజు పర్యటించారు. సోమవారం నామినేషన్ వేసిన ఆయన.. ఈరోజు తిరుమలకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నామినేషన్ వేసి ఆనవాయితీ ప్రకారం శ్రీవారి ఆశీస్సులు కోసం వచ్చానన్నారు. చంద్రగిరి ప్రాంతాన్ని కొందరు చందనగిరిగా మార్చారని తెలిపారు. చంద్రగిరి అభివృద్ధి కోసం ప్రజలు టీడీపీ అభ్యర్థి నానిని గెలిపించాలని పేర్కొన్నారు. చంద్రబాబులానే భారీ మెజారిటీతో నాని చంద్రగిరి ప్రజలు గెలిపించాలని కోరారు. -
AP News: పలువురు కీలక పోలీస్ అధికారులపై ఈసీ బదిలీ వేటు..
ఏపీలో పలువురు కీలక పోలీసు అధికారులపై ఈసీ బదిలీ వేటు వేసింది. ఇప్పటికే.. పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన ఈసీ.. తాజాగా మరో ఇద్దరిని బదిలీ చేసింది. ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు, బెజవాడ సీపీ కాంతి రాణాపై బదిలీ వేటు పడింది. వారి స్థానంలో.. కింది స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించాలని పీఎస్సార్, బెజవాడ సీపీకి ఈసీ ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా.. ఈసీ వేటు వేసిన ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులకు ఎన్నికల విధులు అప్పగించొద్దని స్పష్టం చేసింది. -
CSK vs LSG: చెన్నై భారీ స్కోరు.. సెంచరీతో చెలరేగిన గైక్వాడ్
ఐపీఎల్ 2024లో భాగంగా.. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో సీఎస్కే కెప్టెన్ (108*)సెంచరీతో చెలరేగాడు. 60 బంతుల్లో 80 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ లో 3 సిక్సులు, 12 ఫోర్లు ఉన్నాయి. మరో బ్యాటర్ శివం దూబె శివాలెత్తించాడు. అతను కూడా 66 పరుగులు సాధించాడు. దీంతో చెన్నై భారీ… -
Ranjith Reddy: చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన రంజిత్ రెడ్డి..
చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా గడ్డం రంజిత్‌రెడ్డి ఈరోజు (మంగళవారం) నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి కలెక్టర్ శశాంకకు ఆయన నామినేషన్ పత్రాలను అందజేశారు. శుభప్రదమైన ఆంజనేయ స్వామి జయంతి రోజున.. తాను తన మొదటి సెట్ నామినేషన్ వేయడం ఆ భగవంతుడి దివ్యమైన ఆశీస్సులుగా భావిస్తున్నట్లు రంజిత్ రెడ్డి తెలిపారు. నామినేషన్ ర్యాలీలో తాండూరు ఎమ్మెల్యే బి. మనోహర్ రెడ్డి.. చేవెళ్ళ, రాజేంద్రనగర్ ఇంఛార్జీలు భీం భరత్, కస్తూరి నరేందర్, కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
AP News: ఎన్నికల పర్యవేక్షణ నిమిత్తం రాష్ట్ర స్థాయి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు..
ఎన్నికల పర్యవేక్షణ నిమిత్తం రాష్ట్ర స్థాయి కమాండ్ కంట్రోల్ సెంటర్(CCC)ను ఏర్పాటు చేసింది ఈసీ. ఈ క్రమంలో.. కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సీఈఓ ఎంకే మీనా పరిశీలించారు. ఏపీలో నిరంతర నిఘా కోసం CCC ఏర్పాటు చేశారు. ఎంసీసీ ఉల్లంఘనలు, నగదు, మద్యం అక్రమ రవాణా, సీజర్లపై CCC నుంచి నిఘా ఉంటుంది. అంతేకాకుండా.. వెబ్ కాస్టింగ్ ద్వారా అంతర్ రాష్ట్ర చెక్ పోస్టుల్లో వాహనాల కదలికపై పర్యవేక్షణ ఉంటుంది. -
Tenth Topper: 599 మార్కులు సాధించిన టాపర్ మనస్వి తల్లిదండ్రులు ఎవరో తెలుసా..?
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలలో మరోసారి బాలికలు సత్తా చాటారు. రాష్ట్రవ్యాప్తంగా 2803 పాఠశాలలో విద్యార్థులకు 100% ఉత్తీర్ణత సాధించగా.. రాష్ట్ర వ్యాప్తంగా 17 స్కూల్స్‌లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు. ఇదిలా ఉంటే.. ఏలూరుకు చెందిన ఆకుల వెంకట నాగసాయి మనస్వి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 600 మార్కులకు 599 మార్కులు సాధించి రికార్డు క్రియేట్ చేసింది. దీనితో ఆ అమ్మాయి స్టేట్ టాపర్ గా నిలిచింది. ఆకుల వెంకట నాగ సాయి మనస్వికి కేవలం సెకండ్ లాంగ్వేజ్…
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!