భూమ్మీద నూకలు ఉన్నట్లు ఉంది.. అందుకే బతికి బయటపడ్డాడు. చిరుత దాడి చేసినా తీవ్ర గాయాలైనప్పటికీ సేఫ్ గానే ఉన్నాడు. జింబాబ్వే మాజీ క్రికెటర్ గయ్ విటల్.. ట్రెక్కింగ్ చేస్తున్న సమయంలో చిరుత దాడి చేసింది. ఈ ఘటన హరారే సమీపంలోని బఫెలో రేంజ్ లో జరిగింది. ఈ విషయాన్ని తన భార్య హన్నా సోషల్ మీడియా ద్వారా తెలిపింది. తీవ్ర గాయాలైన విటలో ఫోటోను ఆమె పోస్ట్ చేసింది.
Read Also: Renu Desai: బీజేపీ అభ్యర్థిపై పవన్ మాజీ భార్య కీలక వ్యాఖ్యలు.. డబ్బులు అందలేదు కానీ?
విటల్ పై చిరుత దాడి చేయగానే.. వెంటనే హరారేలోని మిల్టన్ పార్క్ హాస్పిటల్ కు తరలించినట్లు హన్నా పేర్కొంది. కాగా.. చిరుత దాడిలో అతని రక్తం చాలా పోయిందని, డాక్టర్లు సర్జరీ చేసినట్లు తెలిపింది. దాడి విషయానికొస్తే.. విటల్ జింబాబ్వేలో సఫారీ నిర్వహిస్తున్నాడు. కాగా.. హ్యూమని ప్రాంతానికి గురువారం ట్రెక్కింగ్ కు వెళ్లిన సమయంలో చిరుత దాడి చేసింది. ట్రెక్కింగ్ కు వెళ్లినప్పుడు తన పెంపుడు కుక్కను కూడా తీసుకెళ్లాడు.
Read Also: USA: కొత్త రూల్స్ వచ్చేశాయ్.. ఫ్లైట్ క్యాన్సిల్ అయితే ఇకపై..!
ఆ సమయంలో విటల్ పై చిరుత దాడి చేసింది. తన పెంపుడు కుక్క అతన్ని కాపాడాటానికి తీవ్రంగా శ్రమించినప్పటికీ సాధ్యపడలేదు. చిరుత దాడిలో కుక్కకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయినప్పటికీ కుక్క మాత్రం విటల్ ను రక్షించేందుకు చాలా కష్టపడింది. కాగా.. విటల్ తో పాటు పెంపుడు కుక్కను ఎయిర్ అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు.